ఆత్మీయులు, సుప్రసిద్ధ కథానవలానాటక రచయిత, విమర్శకుడు, శ్రీ జె.ఎస్. మూర్తి (విహారి) గారు వచన కవితా సంపుటులనేకం రచించి పద్యకవితా ప్రవీణుడుగా కూడా ముద్రవేసికొన్న వైనం సాహిత్యలోకానికి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.
శ్రీ పదచిత్ర రామాయణం సంపూర్ణ పద్యకావ్యంగా నిర్మించి ప్రచురించిన తరువాత వెలువరిస్తున్న కావ్యప్రమాన గుళుచ్చం. ఈ పద్యమంజరి. ఇందులో శతకం, ఒక కథాకావ్యం ప్రధానంగా దర్శనమిస్తాయి. వాటితోపాటు 'బ్రతుకువరం', మహాకావ్యం, తెలుగువెలుగది. దిశల వర్ధిల్లవలయు' అనే శీర్షికలతో మూడు ఖండికలు కూడా కూర్చబడినాయి.
బ్రతుకు చదువు: ఇది ఒక నీతి శతకం. తెలుగు సాహిత్య వినీలాకాశంలో శతక తారకలు అసంఖ్యాకంగా వెలుగొందుతూ, వాటిలోని పద్యాలు జన సామాన్యపు నోళ్ళలో ఇప్పటికీ నిలిచి యున్నాయంటే వాటి ప్రాధాన్యం ఇంతింతని చెప్పలేనిది. భక్తి జ్ఞాన వైరాగ్య వేదాంతాది శతకాల్లో అంతర్లీనంగా నీతి వాక్యాలు ధ్వనిమయం కాబడుతున్నా, ప్రత్యేకించి నీతిశతకాలు కూడా శతాబ్దాలుగా నిలిచియున్నాయి.
చిత్ర ప్రస్తానం: ఇది ఒక రెండు వందల తేటగీతి పద్యాలతో కూర్చిన బౌద్ధ కథా కావ్యం. సుప్రసిద్ధమైన అజంతా గుహల కూడ్యాల్లోని చిత్రశిల్ప సంభరితమైన కళాభరణ౦ ఈ కథకు తొలి వేదిక. అక్కడ జరిగిన తొలివేదిక. అక్కడ జరిగిన ఒక చిన్న సంఘటన అనుకోని విధంగా పరిణమించి, వర్ణనాత్మకమైన, రసవత్తరమైన కవ్యేతివృత్తం రూపుదిద్దుకున్నది.
- పువ్వాడ తిక్కన సోమయాజి
ఆత్మీయులు, సుప్రసిద్ధ కథానవలానాటక రచయిత, విమర్శకుడు, శ్రీ జె.ఎస్. మూర్తి (విహారి) గారు వచన కవితా సంపుటులనేకం రచించి పద్యకవితా ప్రవీణుడుగా కూడా ముద్రవేసికొన్న వైనం సాహిత్యలోకానికి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. శ్రీ పదచిత్ర రామాయణం సంపూర్ణ పద్యకావ్యంగా నిర్మించి ప్రచురించిన తరువాత వెలువరిస్తున్న కావ్యప్రమాన గుళుచ్చం. ఈ పద్యమంజరి. ఇందులో శతకం, ఒక కథాకావ్యం ప్రధానంగా దర్శనమిస్తాయి. వాటితోపాటు 'బ్రతుకువరం', మహాకావ్యం, తెలుగువెలుగది. దిశల వర్ధిల్లవలయు' అనే శీర్షికలతో మూడు ఖండికలు కూడా కూర్చబడినాయి. బ్రతుకు చదువు: ఇది ఒక నీతి శతకం. తెలుగు సాహిత్య వినీలాకాశంలో శతక తారకలు అసంఖ్యాకంగా వెలుగొందుతూ, వాటిలోని పద్యాలు జన సామాన్యపు నోళ్ళలో ఇప్పటికీ నిలిచి యున్నాయంటే వాటి ప్రాధాన్యం ఇంతింతని చెప్పలేనిది. భక్తి జ్ఞాన వైరాగ్య వేదాంతాది శతకాల్లో అంతర్లీనంగా నీతి వాక్యాలు ధ్వనిమయం కాబడుతున్నా, ప్రత్యేకించి నీతిశతకాలు కూడా శతాబ్దాలుగా నిలిచియున్నాయి. చిత్ర ప్రస్తానం: ఇది ఒక రెండు వందల తేటగీతి పద్యాలతో కూర్చిన బౌద్ధ కథా కావ్యం. సుప్రసిద్ధమైన అజంతా గుహల కూడ్యాల్లోని చిత్రశిల్ప సంభరితమైన కళాభరణ౦ ఈ కథకు తొలి వేదిక. అక్కడ జరిగిన తొలివేదిక. అక్కడ జరిగిన ఒక చిన్న సంఘటన అనుకోని విధంగా పరిణమించి, వర్ణనాత్మకమైన, రసవత్తరమైన కవ్యేతివృత్తం రూపుదిద్దుకున్నది. - పువ్వాడ తిక్కన సోమయాజి© 2017,www.logili.com All Rights Reserved.