ఇప్పుడు రాత్రి పదకొండు. హాల్లో కూచున్నాం.
"ఇది మన సమస్య ఎందుకు కాదమ్మా?”
నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ, పిడికిలి బిగించి మరీ గద్దించింది మాలతి. చూస్తూ కూచున్నాడు రమేష్. కూతురు ఆలోచనలకీ, చేసే పనులకీ కూడా అంతో ఇంతో అవ్యక్త వత్తాసు ఆయనది.
జరిగిన రభసంతా నా కళ్ళముందు మెదిలింది. నలభై అపార్ట్మెంట్ల కాంప్లెక్స్ మాది రెండో అంతస్థు. ఒక్కొక్క ఫ్లోర్కి నాలుగు అపార్ట్మెంట్లు. మా ఇంటిముందు - నారాయణగారిది. ఆయన గవర్నమెంటు ఉద్యోగి. ఇద్దరు చిన్నపిల్లలు - ఆరు, మూడు తరగతుల్లో ఉన్నారు. భార్య సరస్వతి. టీచర్ గా చేస్తుంది. నారాయణ తాగుడుకి బానిస. రోజూ తాగి రావడం - ఇంట్లో గలాటా. దాదాపు అందరికీ తెలిసిన భాగోతం ఇది. ఇటీవల వో నెలనుంచీ, ఆయన గారి ప్రతాపం కారిడార్లోకి వచ్చింది. సరస్వతి ఎంత వారించినా, లోపలికి తీసుకుపోవాలని ప్రయత్నించినా వినక, ఆమెని కొట్టటం, తిట్టటం..... నడవా అంతా దున్నేయటం... మధ్యలో ఉమ్ములూ.... ఉచ్ఛలూ... అంతా ఛండాలం చేస్తున్నాడు.
ఇవ్వాళ - మాలతి కలుగజేసుకుంది. పదిమందీ చేరారు. నేను సర్ది చెబుతున్నా అది వినలేదు. వెళ్ళి నారాయణని మాటలతో మాత్రమే కాకుండా చేతలతోనూ వాయించేసింది. ఆయన పిల్లలు చప్పట్లు కొట్టారు. సరస్వతేమో ఏడుపు. వచ్చినవారికి ఉచిత వినోదం. అనుకూల వ్యతిరేక వ్యాఖ్యలు. వాళ్ళనీ ఝాడించేసింది. “ఇదంతా ప్రైవేట్ ఎఫైర్' అని ఏమేమో మాట్లాడుతున్నారు. బుద్ధుందా మనకు. నాలుగ్గోడల మధ్య ప్రైవసీ. అది దాటితే పబ్లిక్కే ఆమె క్షోభకి మనం కేవలం చూపరులుగా మిగిలిపోవాలా?" అంటూ నోరెత్తకుండా చేసింది. "రేపటినుంచీ ఈ ఇంట్లో ఇలాంటిది జరిగితే ఆయన్ని పోలీసులకప్పజెప్పి, అంతు చూస్తాను. జాగ్రత్త"అని హెచ్చరిక చేసింది.
నిదానంగా సమూహం చెదిరింది. మేం మా హాల్లోకి వచ్చి కూచున్నాం..............
వ్యూహం ఇప్పుడు రాత్రి పదకొండు. హాల్లో కూచున్నాం. "ఇది మన సమస్య ఎందుకు కాదమ్మా?” నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ, పిడికిలి బిగించి మరీ గద్దించింది మాలతి. చూస్తూ కూచున్నాడు రమేష్. కూతురు ఆలోచనలకీ, చేసే పనులకీ కూడా అంతో ఇంతో అవ్యక్త వత్తాసు ఆయనది. జరిగిన రభసంతా నా కళ్ళముందు మెదిలింది. నలభై అపార్ట్మెంట్ల కాంప్లెక్స్ మాది రెండో అంతస్థు. ఒక్కొక్క ఫ్లోర్కి నాలుగు అపార్ట్మెంట్లు. మా ఇంటిముందు - నారాయణగారిది. ఆయన గవర్నమెంటు ఉద్యోగి. ఇద్దరు చిన్నపిల్లలు - ఆరు, మూడు తరగతుల్లో ఉన్నారు. భార్య సరస్వతి. టీచర్ గా చేస్తుంది. నారాయణ తాగుడుకి బానిస. రోజూ తాగి రావడం - ఇంట్లో గలాటా. దాదాపు అందరికీ తెలిసిన భాగోతం ఇది. ఇటీవల వో నెలనుంచీ, ఆయన గారి ప్రతాపం కారిడార్లోకి వచ్చింది. సరస్వతి ఎంత వారించినా, లోపలికి తీసుకుపోవాలని ప్రయత్నించినా వినక, ఆమెని కొట్టటం, తిట్టటం..... నడవా అంతా దున్నేయటం... మధ్యలో ఉమ్ములూ.... ఉచ్ఛలూ... అంతా ఛండాలం చేస్తున్నాడు. ఇవ్వాళ - మాలతి కలుగజేసుకుంది. పదిమందీ చేరారు. నేను సర్ది చెబుతున్నా అది వినలేదు. వెళ్ళి నారాయణని మాటలతో మాత్రమే కాకుండా చేతలతోనూ వాయించేసింది. ఆయన పిల్లలు చప్పట్లు కొట్టారు. సరస్వతేమో ఏడుపు. వచ్చినవారికి ఉచిత వినోదం. అనుకూల వ్యతిరేక వ్యాఖ్యలు. వాళ్ళనీ ఝాడించేసింది. “ఇదంతా ప్రైవేట్ ఎఫైర్' అని ఏమేమో మాట్లాడుతున్నారు. బుద్ధుందా మనకు. నాలుగ్గోడల మధ్య ప్రైవసీ. అది దాటితే పబ్లిక్కే ఆమె క్షోభకి మనం కేవలం చూపరులుగా మిగిలిపోవాలా?" అంటూ నోరెత్తకుండా చేసింది. "రేపటినుంచీ ఈ ఇంట్లో ఇలాంటిది జరిగితే ఆయన్ని పోలీసులకప్పజెప్పి, అంతు చూస్తాను. జాగ్రత్త"అని హెచ్చరిక చేసింది. నిదానంగా సమూహం చెదిరింది. మేం మా హాల్లోకి వచ్చి కూచున్నాం..............© 2017,www.logili.com All Rights Reserved.