ధర్మ సాధనముకు శరీరము సంపూర్ణముగా సహకరించాలి. శరీరానికి సంబంధించిన స్థితి ఏవిధంగా ఉండాలి. సోమరితనం లేకుండా ఉండాలి. ఏ విషయాన్ని చెప్పినా గ్రహించగలగాలి. ఎంత కాలమైన కూర్చోగలగాలి. ఇదంతా యోగ శాస్త్రములో చెప్పిన ప్రకారముగా నియమ పూర్వక "యోగాసనాలను వేయడం వలన మాత్రమే సాధ్యమవుతుంది. యోగము మనిషికి మనస్సుకు ఏవిధంగా చికిత్స చేస్తుందో శరీరానికి కూడా మంచి చికిత్స చేస్తుంది. అందుకని యోగ శాస్త్రము, ప్రతి మానవ మాత్రునకు అత్యవసరమై ఉన్నది. పతంజలి తర్వాత ఎందరో మహానుభావులు ఈ యోగము ద్వారా అనుకున్నది సాధించగలిగినారు. ఇహలోకంలో భోగములు పర లోకంలో స్వాత్మానందము కూడా, ఇట్టి ఇహపర సుఖముల నోసిగెడి ఈ యోగము అందరికీ అందుబాటులో ఉండడానికై, సామాన్య జ్ఞానము కలవారికి కూడ ఈ పుస్తకాన్ని చదివి ఆసన బంధ, క్రియ, ప్రాణయామము, కుండలిని ఉద్దీపన, చక్ర భేదనాడులను తెలియుటకై సులభమయిన భాషను ఉపయోగించి "యోగవాచస్పతి" ఎస్.సంపత్ కుమార్ గారు ఇంకా అనేక విషయాలు గురించి వివరించినారు అవి.
- యోగ పరిచయము - "ఇమే యోగః"
- నాద్ సంప్రదాయ అద్భుతయోగులు
- సూక్ష్మ యోగ ప్రకరణము (సుక్ష్మ, స్థూల యోగ వ్యాయామములు, సూర్య నమస్కారములు)
- క్రియా ప్రకరణము (షట్ శుద్ధి క్రియలు)
- అష్టాంగ యోగము - ప్రధమ ద్వితీయాంగ ప్రకరణము (యమ, నియమములు)
- యోగాసన ప్రకరణము (సాధారణ యోగాసనములు)
- ప్రాణాయామ ప్రకరణము (పంచ ప్రాణములు, అష్టవిధ కుంభకములు)
- ప్రత్యాహార ప్రకరణము
- ముద్రా ప్రకరణము (కాయ, మనో, హస్త ముద్రలు)
- ఆసన విజ్ఞాన ప్రకరణము ( యోగ గ్రంధములలోని శ్లోకముల ఆధారముగా...)
- ధ్యాన ప్రకరణము
- సమాధి ప్రకరణము
- యోగ తరంగ ప్రకరణము (యోగ నిద్ర, తక్షణ విశ్రాంతి మొదలైన విశ్రాంతి ప్రక్రియలు)
- కుండలినీ ప్రకరణము (పంచకోశములు, నాడులు, షట్ చక్రములు, కుండలినీ ప్రబోధము)
- కృతజ్ఞతాంజలి
ఈ గ్రంథ రచనకు వారు ఎంత కృషి చేసినారు? ఎన్ని గ్రంధాలను పరిశీలించినారు? సుమారు యాబై ఆరు గ్రంధాలను పరిశీలించి, ఈ గ్రంథ రచనను కొనసాగించారు. భగవత్ప్రేరణచే "సమగ్రహఠ యోగ మంజరి" అనెడి ఈ బృహద్గ్రందాన్ని మన తెలుగు వారి ప్రయోజనం కొరకు రచించినారు. మన తెలుగువారు చదివి మానసిక శారీరక శుద్ధి చేసికొని, మానవ జన్మ యొక్క ముఖ్యమయిన ప్రయోజనమయిన మోక్ష సామ్రాజ్యాన్ని అధిరోహించగలరని ఆకాంక్షిస్తూ...
- ఎస్. సంపత్ కుమార్
ధర్మ సాధనముకు శరీరము సంపూర్ణముగా సహకరించాలి. శరీరానికి సంబంధించిన స్థితి ఏవిధంగా ఉండాలి. సోమరితనం లేకుండా ఉండాలి. ఏ విషయాన్ని చెప్పినా గ్రహించగలగాలి. ఎంత కాలమైన కూర్చోగలగాలి. ఇదంతా యోగ శాస్త్రములో చెప్పిన ప్రకారముగా నియమ పూర్వక "యోగాసనాలను వేయడం వలన మాత్రమే సాధ్యమవుతుంది. యోగము మనిషికి మనస్సుకు ఏవిధంగా చికిత్స చేస్తుందో శరీరానికి కూడా మంచి చికిత్స చేస్తుంది. అందుకని యోగ శాస్త్రము, ప్రతి మానవ మాత్రునకు అత్యవసరమై ఉన్నది. పతంజలి తర్వాత ఎందరో మహానుభావులు ఈ యోగము ద్వారా అనుకున్నది సాధించగలిగినారు. ఇహలోకంలో భోగములు పర లోకంలో స్వాత్మానందము కూడా, ఇట్టి ఇహపర సుఖముల నోసిగెడి ఈ యోగము అందరికీ అందుబాటులో ఉండడానికై, సామాన్య జ్ఞానము కలవారికి కూడ ఈ పుస్తకాన్ని చదివి ఆసన బంధ, క్రియ, ప్రాణయామము, కుండలిని ఉద్దీపన, చక్ర భేదనాడులను తెలియుటకై సులభమయిన భాషను ఉపయోగించి "యోగవాచస్పతి" ఎస్.సంపత్ కుమార్ గారు ఇంకా అనేక విషయాలు గురించి వివరించినారు అవి. - యోగ పరిచయము - "ఇమే యోగః" - నాద్ సంప్రదాయ అద్భుతయోగులు - సూక్ష్మ యోగ ప్రకరణము (సుక్ష్మ, స్థూల యోగ వ్యాయామములు, సూర్య నమస్కారములు) - క్రియా ప్రకరణము (షట్ శుద్ధి క్రియలు) - అష్టాంగ యోగము - ప్రధమ ద్వితీయాంగ ప్రకరణము (యమ, నియమములు) - యోగాసన ప్రకరణము (సాధారణ యోగాసనములు) - ప్రాణాయామ ప్రకరణము (పంచ ప్రాణములు, అష్టవిధ కుంభకములు) - ప్రత్యాహార ప్రకరణము - ముద్రా ప్రకరణము (కాయ, మనో, హస్త ముద్రలు) - ఆసన విజ్ఞాన ప్రకరణము ( యోగ గ్రంధములలోని శ్లోకముల ఆధారముగా...) - ధ్యాన ప్రకరణము - సమాధి ప్రకరణము - యోగ తరంగ ప్రకరణము (యోగ నిద్ర, తక్షణ విశ్రాంతి మొదలైన విశ్రాంతి ప్రక్రియలు) - కుండలినీ ప్రకరణము (పంచకోశములు, నాడులు, షట్ చక్రములు, కుండలినీ ప్రబోధము)- కృతజ్ఞతాంజలి ఈ గ్రంథ రచనకు వారు ఎంత కృషి చేసినారు? ఎన్ని గ్రంధాలను పరిశీలించినారు? సుమారు యాబై ఆరు గ్రంధాలను పరిశీలించి, ఈ గ్రంథ రచనను కొనసాగించారు. భగవత్ప్రేరణచే "సమగ్రహఠ యోగ మంజరి" అనెడి ఈ బృహద్గ్రందాన్ని మన తెలుగు వారి ప్రయోజనం కొరకు రచించినారు. మన తెలుగువారు చదివి మానసిక శారీరక శుద్ధి చేసికొని, మానవ జన్మ యొక్క ముఖ్యమయిన ప్రయోజనమయిన మోక్ష సామ్రాజ్యాన్ని అధిరోహించగలరని ఆకాంక్షిస్తూ... - ఎస్. సంపత్ కుమార్© 2017,www.logili.com All Rights Reserved.