నగరం ఒక క్యారెక్టర్. నగరంలో స్త్రీ ఇంకా ముఖ్యమైన క్యారెక్టర్. ప్రతి ఫ్లాట్ లో పవర్ పోతే ఇన్ వర్టర్లు, అపార్ట్ మెంటుకు జనరేటర్లు ఉంటున్నాయి. వెలుతురులో చూస్తున్నాం అనుకుంటున్నాం. కాని స్త్రీలను సరిగానే చూస్తున్నామా? నాలుగు గోడల మధ్యన – చీకటి గుయ్యారం వంటి అంతరంగంలో ఉడుకుతున్న ఆలోచనాధార., చువ్వలను బిగించి పట్టుకున్న వేళ్ళలో నిండిన నిస్పృహ, మర్యాదకరమైన పతనం, పతనంలో కూడా కాపాడుకోగలిగిన సంస్కారం, రోదనలా వినిపించే నవ్వు, అగోచర మంటలంటుకుని ఉన్న కుచ్చిళ్ళు, భాస్వరాల కొంగు ముడులు, సలపరించే వక్షాలు, నెరిసిన వెంట్రుకల తలపోతల నిస్సహాయమైన మూలుగు.. ఒక నాగరికతలో ఒక కాలపు శాంపిల్ ఈ కథలు.
నగరం ఒక క్యారెక్టర్. నగరంలో స్త్రీ ఇంకా ముఖ్యమైన క్యారెక్టర్. ప్రతి ఫ్లాట్ లో పవర్ పోతే ఇన్ వర్టర్లు, అపార్ట్ మెంటుకు జనరేటర్లు ఉంటున్నాయి. వెలుతురులో చూస్తున్నాం అనుకుంటున్నాం. కాని స్త్రీలను సరిగానే చూస్తున్నామా? నాలుగు గోడల మధ్యన – చీకటి గుయ్యారం వంటి అంతరంగంలో ఉడుకుతున్న ఆలోచనాధార., చువ్వలను బిగించి పట్టుకున్న వేళ్ళలో నిండిన నిస్పృహ, మర్యాదకరమైన పతనం, పతనంలో కూడా కాపాడుకోగలిగిన సంస్కారం, రోదనలా వినిపించే నవ్వు, అగోచర మంటలంటుకుని ఉన్న కుచ్చిళ్ళు, భాస్వరాల కొంగు ముడులు, సలపరించే వక్షాలు, నెరిసిన వెంట్రుకల తలపోతల నిస్సహాయమైన మూలుగు.. ఒక నాగరికతలో ఒక కాలపు శాంపిల్ ఈ కథలు.© 2017,www.logili.com All Rights Reserved.