నడివయస్సులో షేక్ హుసేన్ "సత్యాగ్ని" గా పరిపుష్టమైన కధలు వెలువరించారు. ఆ కధలు ఒక కొత్తమలుపునకు దారితీశాయి. ఆయన రాసిన తీరును గమనిస్తే. ఇతరేతర వ్యాపకాలతో రచన వ్యాసంగాన్ని దీర్ఘకాలం నిలిపివేసిన, రాయాలని కలంపడితే ఏకబిగిన రాయగలిగిన సత్తా, అనుభవాలు, పుష్కలంగా ఉన్నవాడని తెలుస్తుంది. సాహిత్యంలో వాదాలు, ఉద్యమాలు, స్పష్టమైనరూపు దిద్దుకోకముందేరాసిన సత్యాగ్ని కధలు పురోగాముక లక్షణాన్ని ఒడిసి పట్టుకోవడం అభినందనీయం. మరీ ముఖ్యంగా సత్యాగ్ని కధన సారళ్యం ముచ్చట గొల్పుతుంది.
షేక్ హుసేన్ సత్యాగ్ని గారి ఈ సంపుటిలోని కధలన్నీ జాగ్రత్తగాచదివితే, ఆయన ఎవరిపక్షణ, ఏ భావజాలం కలిగివున్నాడో, ఏ భావాలనుండి బయటపడినాడో, ఎలాంటి ఆధునిక సమాజాన్ని కంక్షించాడో, పాఠకులకు సులభంగా అర్ధ మోతుంది. సమాజం పట్ల, ముఖ్యంగా స్ర్తీలపట్ల, మతంపట్ల, రాజ్యవ్యవస్ద పట్ల ఇంకా అనేకానేక అంశాలపట్ల ఆయనకుగల దృక్పధాన్ని ఈ కధలు స్పష్టం చేస్తాయి. మత సాంప్రదాయాలు అడుగడుగునా అడ్డుపడే ముస్లిం మతంలోపుట్టి, ఆ మతం మహిళలపట్ల విధించే ఎన్నో కట్టుబాట్లను, ఛాందస విధి విధానాలను విమర్శకు పెట్టె కధలు రాయడం చిన్న విషయం కాదు.
షేక్. హుసేన్
నడివయస్సులో షేక్ హుసేన్ "సత్యాగ్ని" గా పరిపుష్టమైన కధలు వెలువరించారు. ఆ కధలు ఒక కొత్తమలుపునకు దారితీశాయి. ఆయన రాసిన తీరును గమనిస్తే. ఇతరేతర వ్యాపకాలతో రచన వ్యాసంగాన్ని దీర్ఘకాలం నిలిపివేసిన, రాయాలని కలంపడితే ఏకబిగిన రాయగలిగిన సత్తా, అనుభవాలు, పుష్కలంగా ఉన్నవాడని తెలుస్తుంది. సాహిత్యంలో వాదాలు, ఉద్యమాలు, స్పష్టమైనరూపు దిద్దుకోకముందేరాసిన సత్యాగ్ని కధలు పురోగాముక లక్షణాన్ని ఒడిసి పట్టుకోవడం అభినందనీయం. మరీ ముఖ్యంగా సత్యాగ్ని కధన సారళ్యం ముచ్చట గొల్పుతుంది. షేక్ హుసేన్ సత్యాగ్ని గారి ఈ సంపుటిలోని కధలన్నీ జాగ్రత్తగాచదివితే, ఆయన ఎవరిపక్షణ, ఏ భావజాలం కలిగివున్నాడో, ఏ భావాలనుండి బయటపడినాడో, ఎలాంటి ఆధునిక సమాజాన్ని కంక్షించాడో, పాఠకులకు సులభంగా అర్ధ మోతుంది. సమాజం పట్ల, ముఖ్యంగా స్ర్తీలపట్ల, మతంపట్ల, రాజ్యవ్యవస్ద పట్ల ఇంకా అనేకానేక అంశాలపట్ల ఆయనకుగల దృక్పధాన్ని ఈ కధలు స్పష్టం చేస్తాయి. మత సాంప్రదాయాలు అడుగడుగునా అడ్డుపడే ముస్లిం మతంలోపుట్టి, ఆ మతం మహిళలపట్ల విధించే ఎన్నో కట్టుబాట్లను, ఛాందస విధి విధానాలను విమర్శకు పెట్టె కధలు రాయడం చిన్న విషయం కాదు. షేక్. హుసేన్© 2017,www.logili.com All Rights Reserved.