ఇప్పటి మాటేమోగానీ... పత్రికల్లో ఇంచార్జిల హెూదాలో డెస్క్ ని చేసేవారికి ఒకప్పుడు చాలా కష్టాలుండేవి. టైమ్కి వెళ్లడమే తప్ప వెనక్కి రావడం ఎప్పుడూ వాళ్ల చేతుల్లో ఉండదు. అవ్యవస్థ అలుముకున్న చోటైతే ఈ కష్టాలు రెట్టింపు. సమస్తం వాళ్లే చేసుకోవాలి. ఇవన్నీ పడుతూనే ఆర్టికల్ రాయడమంటే ఇంకెలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇక వీక్లీ కాలమైతే, సృజనాత్మకత జోడించవలసి వస్తే చెప్పేదేముంది? ఇప్పుడు మీముందున్న 'మూడావుల ముచ్చట్లు' పుస్తకం అలాంటి పరిస్థితుల్లో రూపుదిద్దుకున్నదే. చేపల మార్కెట్ను తలపించేచోట ప్రశాంతంగా ఆలోచించుకోవడం, రాసే ప్రతివాక్యాన్నీ బాధ్యతగా భావించి రాయడం అందరికీ సాధ్యం కాదు. కె.వి.యస్. వర్మగారు తరచు అలా చేసేవారు. కాబట్టే ఇది మీ చేతుల్లో ఉంది.
తొంభయ్యో దశకంనాటి మాట. దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశించి, వాటి అమలు జోరు పెరిగేకొద్దీ సాధారణ ప్రజానీకంలో ఒక రకమైన అయోమయావస్థ నెలకొంది. వారి వృత్తులన్నీ దెబ్బ తిన్నాయి. ఉపాధి పోయింది. ఆ అనిశ్చితి సహజంగానే పార్లమెంటరీ రాజకీయాలకు సోకింది. అధికారంలో ఎన్నాళ్లుంటామో, మిత్రులుగా...................
లోగుట్టు విప్పిన 'ముచ్చట్లు' -తెంపల్లె వేణుగోపాలరావు సీనియర్ పాత్రికేయులు, విమర్శకులు ఇప్పటి మాటేమోగానీ... పత్రికల్లో ఇంచార్జిల హెూదాలో డెస్క్ ని చేసేవారికి ఒకప్పుడు చాలా కష్టాలుండేవి. టైమ్కి వెళ్లడమే తప్ప వెనక్కి రావడం ఎప్పుడూ వాళ్ల చేతుల్లో ఉండదు. అవ్యవస్థ అలుముకున్న చోటైతే ఈ కష్టాలు రెట్టింపు. సమస్తం వాళ్లే చేసుకోవాలి. ఇవన్నీ పడుతూనే ఆర్టికల్ రాయడమంటే ఇంకెలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇక వీక్లీ కాలమైతే, సృజనాత్మకత జోడించవలసి వస్తే చెప్పేదేముంది? ఇప్పుడు మీముందున్న 'మూడావుల ముచ్చట్లు' పుస్తకం అలాంటి పరిస్థితుల్లో రూపుదిద్దుకున్నదే. చేపల మార్కెట్ను తలపించేచోట ప్రశాంతంగా ఆలోచించుకోవడం, రాసే ప్రతివాక్యాన్నీ బాధ్యతగా భావించి రాయడం అందరికీ సాధ్యం కాదు. కె.వి.యస్. వర్మగారు తరచు అలా చేసేవారు. కాబట్టే ఇది మీ చేతుల్లో ఉంది. తొంభయ్యో దశకంనాటి మాట. దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశించి, వాటి అమలు జోరు పెరిగేకొద్దీ సాధారణ ప్రజానీకంలో ఒక రకమైన అయోమయావస్థ నెలకొంది. వారి వృత్తులన్నీ దెబ్బ తిన్నాయి. ఉపాధి పోయింది. ఆ అనిశ్చితి సహజంగానే పార్లమెంటరీ రాజకీయాలకు సోకింది. అధికారంలో ఎన్నాళ్లుంటామో, మిత్రులుగా...................© 2017,www.logili.com All Rights Reserved.