ప్రపంచంలోని మిగత జాతులకి మనుషులకి ఉన్న భేదం భాష. చెట్లకి, జంతువులకి కూడా భాష ఉందని చెబుతారు. వాటికి భాష ఉందో లేదో తెలియదు కానీ కొన్ని విషయాలని అవి గ్రహించగలవు. భాష వల్ల మనిషికి మిగతా జాతులకి భేదం ఏర్పడింది. భాష వల్ల మనిషికి మనిషికి మధ్యన విషయాలు తెలియపరచుకునే పరిస్థితి ఏర్పడింది. భాష ఎప్పుడు మొదలైంది, ఎలా మొదలైంది మనకు తెలియకపోవచ్చు కానీ భాష వల్ల మనిషి ప్రత్యేకంగా మారినాడు. భాష వల్ల మనుషుల మధ్యన సాంఘిక సంబంధాలు పెరిగాయి. ఒకరి అనుభవాలని మరొకరికి చెప్పే వెసులుబాటు కలిగింది. ఆ అనుభవాలు కథల రూపం దాల్చి ఆకర్షించాయి. మనం తెలుసుకున్న విషయాలను ఇతరులకు చెప్పడం మొదట కథల రూపంలో జరిగేది.
మంచి కథల ద్వారా మంచి ఆలోచనలు, కొత్త తోవలు, కొత్త అలవాట్లు ఏర్పడుతాయి. కష్ట సమయంలో ఉన్న వ్యక్తిని కొన్ని కథలు పైకెత్తుతాయి. వాళ్ళలో ధైర్యాన్ని నింపుతాయి. కొన్ని గంటల ఉపన్యాసం చేసే పని ఓ చిన్న కథ అలోవోకగా చేస్తుంది. మనం గంటసేపు చెప్పి సాంత్వనపరిచే అంశం ఓ చిన్న కథ ద్వారా ఐదు నిమిషాల్లో సాంత్వనపరచవచ్చు. మనం చూపించే దారిని కథ ద్వారా సులువుగా తెలియపరచవచ్చు. మంచి కథలు మనల్ని ఉల్లాసపరుస్తాయి, ఉత్తేజపరుస్తాయి. మంచి మార్గం వైపు నడిపిస్తాయి. మనలో నిద్రిస్తున్న మానవత్వాన్ని తట్టి లేపుతాయి. పనిలేని ముచ్చట్లు కూడా కథలుగా మార్పు చెందుతాయి. అయితే అవి హాని కలిగించే కథలు. అందుకే మంచి కథల్ని చెప్పుకుందాం మంచి కథల్ని విందాం. నేను అనుభవించినవి. నాకు నచ్చినవి. మీకు ఈ కథల రూపంలో..
- మంగారి రాజేందర్ జింబో
ప్రపంచంలోని మిగత జాతులకి మనుషులకి ఉన్న భేదం భాష. చెట్లకి, జంతువులకి కూడా భాష ఉందని చెబుతారు. వాటికి భాష ఉందో లేదో తెలియదు కానీ కొన్ని విషయాలని అవి గ్రహించగలవు. భాష వల్ల మనిషికి మిగతా జాతులకి భేదం ఏర్పడింది. భాష వల్ల మనిషికి మనిషికి మధ్యన విషయాలు తెలియపరచుకునే పరిస్థితి ఏర్పడింది. భాష ఎప్పుడు మొదలైంది, ఎలా మొదలైంది మనకు తెలియకపోవచ్చు కానీ భాష వల్ల మనిషి ప్రత్యేకంగా మారినాడు. భాష వల్ల మనుషుల మధ్యన సాంఘిక సంబంధాలు పెరిగాయి. ఒకరి అనుభవాలని మరొకరికి చెప్పే వెసులుబాటు కలిగింది. ఆ అనుభవాలు కథల రూపం దాల్చి ఆకర్షించాయి. మనం తెలుసుకున్న విషయాలను ఇతరులకు చెప్పడం మొదట కథల రూపంలో జరిగేది. మంచి కథల ద్వారా మంచి ఆలోచనలు, కొత్త తోవలు, కొత్త అలవాట్లు ఏర్పడుతాయి. కష్ట సమయంలో ఉన్న వ్యక్తిని కొన్ని కథలు పైకెత్తుతాయి. వాళ్ళలో ధైర్యాన్ని నింపుతాయి. కొన్ని గంటల ఉపన్యాసం చేసే పని ఓ చిన్న కథ అలోవోకగా చేస్తుంది. మనం గంటసేపు చెప్పి సాంత్వనపరిచే అంశం ఓ చిన్న కథ ద్వారా ఐదు నిమిషాల్లో సాంత్వనపరచవచ్చు. మనం చూపించే దారిని కథ ద్వారా సులువుగా తెలియపరచవచ్చు. మంచి కథలు మనల్ని ఉల్లాసపరుస్తాయి, ఉత్తేజపరుస్తాయి. మంచి మార్గం వైపు నడిపిస్తాయి. మనలో నిద్రిస్తున్న మానవత్వాన్ని తట్టి లేపుతాయి. పనిలేని ముచ్చట్లు కూడా కథలుగా మార్పు చెందుతాయి. అయితే అవి హాని కలిగించే కథలు. అందుకే మంచి కథల్ని చెప్పుకుందాం మంచి కథల్ని విందాం. నేను అనుభవించినవి. నాకు నచ్చినవి. మీకు ఈ కథల రూపంలో.. - మంగారి రాజేందర్ జింబో© 2017,www.logili.com All Rights Reserved.