భారతదేశం నుండి విభజన అయి పాకిస్థాన్ గా అవతరించిన తరువాత ఆ దేశంలో భారతదేశం కంటె భిన్నమైన సామాజిక దృక్పధం అక్కడ నెలకొన్నది. ఈ కథానికలు ఉర్దూ, పంజాబి, సింధ్, సరైకా భాషలలో వ్రాసి, తరువాత ఇంగ్లీషుకు తర్జుమా అయినవి. పాకిస్థాన్ సాంస్కృతిక జీవన సరళిని ఇవి ప్రదర్శిస్తాయి.
ఈ కథలను ఎంపిక చేసినవారు ఇంతిజార్ హుస్సేన్, అసిఫ్ ఫరూకి అనేవారు. ఉర్దూ నుంచి అనువదించిన వారు యం. అసదుద్దీన్.
ఇంతిజార్ హుస్సేన్ (1925) పేరుపడిన నవలాకారుడు, కథా రచయిత, వ్యాసకర్త. భారతదేశంలో జన్మించాడు. 1947 లో పాకిస్థాన్ కు తరలి వెళ్లాడు. మంచి మంచి నవలలు వ్రాయడమే గాక, జాతీయ అంతర్జాతీయ పురస్కారాలను అందుకున్నాడు.
అసిఫ్ ఫరూకీ వృత్తి రీత్యా వైద్యుడు అయినా, విస్తారంగా రచనలు చేస్తున్నవాడు. మంచి అనువాదకుడు, సంపాదకుడు కూడా. 1998 లో తన మొదటి కథా సంపుటిని ప్రచురించాడు. తరువాత అనేక గ్రంధాలకు సంవలనకర్తగా వ్యవహరించాడు.
ఈ కథానికలను తెలుగులోనికి అనువదించిన 'శ్రీవిరంచి' తెలుగులో 1951 నుండి కథా రచన చేస్తున్నారు. తెలుగు, ఇంగ్లీషు భాషలలో కథలు, వ్యాసాలు వ్రాస్తారు. తెలుగు కథలు, కాల్పనిక సాహిత్యం గురించి ఇంగ్లీషు, తెలుగు భాషలలో అనేక వ్యాసాలు పత్రికలలో ప్రచురించారు.
- శ్రీవిరంచి.