ఒక కుటుంబంలో ఉన్న వాళ్ళంతా, అన్యోన్యంగా కలిసిమెలిసి, ఒకరికొకరు తోడుగా, ప్రేమానురాగాలతో వ్యవహరిస్తూ, అందరూ ఒక్క మాట మీద నడుస్తూ ఉంటే, ఆ కుటుంబాన్ని చూసి, ఎవరు మాత్రం అభినందించరు. ఒకరినొకరు నోరారా ఆప్యాయతతో పలకరించుకుంటూ, ఒకరి కష్టసుఖాల్లో మిగతా వాళ్ళు పాలు పంచుకుంటూ, ఒకరిపై ఒకరు ఆధారపడి, ఒకరు లేకపోతే ఇంకొకరు ఉండలేము అని భావిస్తూ, ఎవరు చెయ్యగలిగిన పని వారు చేస్తూ, ప్రతివాడూ మిగతావాళ్లకు సహాయకారిగా ఉంటే, ఆ ఇంట్లో వాతావరణం ఎంత బావుంటుంది! ఉన్నదానితో తృప్తిపడి, లేనిదానికి ఆరాటపడకుండా, ఎవరికీ ఎవరూ భారం అనుకోకుండా, ఎవరి ధర్మాన్ని వారు గుర్తెరిగి నిర్వర్తిస్తూ, సుఖంగా, సంతోషంగా, సరదాగా, కుటుంబ సభ్యులంతా ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ కళకళ లాడుతూ ఉంటే, ఆ ఇంటిని మించిన స్వర్గసీమ ఏముంటుంది! అలాగే ఒక ఇంట్లో గల సభ్యుల గురించి రాసిన కధలు అందరు చదువుతారని ఆశిస్తూ..
- సి ఎల్ నాగేశ్వరరావు
ఒక కుటుంబంలో ఉన్న వాళ్ళంతా, అన్యోన్యంగా కలిసిమెలిసి, ఒకరికొకరు తోడుగా, ప్రేమానురాగాలతో వ్యవహరిస్తూ, అందరూ ఒక్క మాట మీద నడుస్తూ ఉంటే, ఆ కుటుంబాన్ని చూసి, ఎవరు మాత్రం అభినందించరు. ఒకరినొకరు నోరారా ఆప్యాయతతో పలకరించుకుంటూ, ఒకరి కష్టసుఖాల్లో మిగతా వాళ్ళు పాలు పంచుకుంటూ, ఒకరిపై ఒకరు ఆధారపడి, ఒకరు లేకపోతే ఇంకొకరు ఉండలేము అని భావిస్తూ, ఎవరు చెయ్యగలిగిన పని వారు చేస్తూ, ప్రతివాడూ మిగతావాళ్లకు సహాయకారిగా ఉంటే, ఆ ఇంట్లో వాతావరణం ఎంత బావుంటుంది! ఉన్నదానితో తృప్తిపడి, లేనిదానికి ఆరాటపడకుండా, ఎవరికీ ఎవరూ భారం అనుకోకుండా, ఎవరి ధర్మాన్ని వారు గుర్తెరిగి నిర్వర్తిస్తూ, సుఖంగా, సంతోషంగా, సరదాగా, కుటుంబ సభ్యులంతా ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ కళకళ లాడుతూ ఉంటే, ఆ ఇంటిని మించిన స్వర్గసీమ ఏముంటుంది! అలాగే ఒక ఇంట్లో గల సభ్యుల గురించి రాసిన కధలు అందరు చదువుతారని ఆశిస్తూ.. - సి ఎల్ నాగేశ్వరరావు© 2017,www.logili.com All Rights Reserved.