ఎదురైన దృశ్యం వంశీ కృష్ణ
ఆ మాట వినగానే ధూళిమేఘాలు కమ్మేసిన తాజ్మహల్ లాగా నల్లగా అయి పోయింది కరుణాకర్ మొహం. ఒక్కక్షణం పాటు నోట మాట రాలేదు అతనికి. స్తబ్ధుగా వుండిపోయాడు. అతడి గుండె చప్పుడు బయటికే స్పష్టంగా వినపడసాగింది.
"నిజమేనా? నువ్వంటున్నది నిజమేనా? నీ కెలా తెలిసింది?" అని ఆతురతగా అడిగాడు.
జవాబుగా చంద్రశేఖర్ తన స్మార్ట్ ఫోన్లో ఫేస్బుక్ ఓపెన్ చేసి చూపించాడు. కరుణాకర్ క్షణం ఆలస్యంగా చేయకుండా స్క్రోల్ చేయసాగాడు. అన్నీ రిప్ రిప్ రిప్ సందేశాలే! ఇంకా పైకి స్క్రోల్ చేస్తే ప్రొఫైల్ పిక్గా ఒక చిన్న తెల్లటి మల్లెమొగ్గల జంట ఒకటి కనిపించింది. కరుణాకర్ దీర్ఘంగా నిశ్వసించాడు.
"రేవతి చనిపోయిందంటే నమ్మలేకుండా వున్నాను" అన్నాడు తన లోపలికి చూసుకుంటూ. ఒక్కక్షణం ఆగి “ఇప్పుడే బయలుదేరుతాను. రేవతిని చివరి సారి చూడాలి" అన్నాడు చిన్నగా
"రేవతిని చూడటానికా? ఆమె ఎక్కడ ఉన్నదో తెలియదు కదా! ఎలా వెళతావు? అయినా ముప్ఫై సంవత్సరాల తరువాత వెళ్లి, నువ్వు శవాన్ని చూసి చేసేదేమిటి? అసలు నిన్ను అక్కడ ఎవరైనా గుర్తు పడతారా? ఒక వేళ పట్టినా లోపలికి రానిస్తారా? నీకు ఆమెకు ఏమిటి సంబంధం అంటే ఏమి చెపుతావు?” అన్నే ప్రశ్నలు ఒకే సారి గుమ్మరించాడు చంద్రశేఖర్.
అతడికి కరుణాకర్ బదులు ఇవ్వలేదు. ఇవ్వడానికి తన దగ్గర జవాబు కూడా లేదు. అతడి మనసు అతడి మాట వినడం మానేసింది. ఒక స్థిర నిర్ణయానికి వచ్చినవాడిలా రెండు రోజులకు లీవ్ లెటర్ రాసి శేఖర్ కి ఇచ్చి "బాస్ కి ఈ లీవ్ లెటర్ ఇవ్వు. నేను ఫోన్ చేసి ఆఫీస్ పని మీద వైజాగ్ వెళుతున్నాను అని శ్యామలకి.......
ఎదురైన దృశ్యం వంశీ కృష్ణ ఆ మాట వినగానే ధూళిమేఘాలు కమ్మేసిన తాజ్మహల్ లాగా నల్లగా అయి పోయింది కరుణాకర్ మొహం. ఒక్కక్షణం పాటు నోట మాట రాలేదు అతనికి. స్తబ్ధుగా వుండిపోయాడు. అతడి గుండె చప్పుడు బయటికే స్పష్టంగా వినపడసాగింది. "నిజమేనా? నువ్వంటున్నది నిజమేనా? నీ కెలా తెలిసింది?" అని ఆతురతగా అడిగాడు. జవాబుగా చంద్రశేఖర్ తన స్మార్ట్ ఫోన్లో ఫేస్బుక్ ఓపెన్ చేసి చూపించాడు. కరుణాకర్ క్షణం ఆలస్యంగా చేయకుండా స్క్రోల్ చేయసాగాడు. అన్నీ రిప్ రిప్ రిప్ సందేశాలే! ఇంకా పైకి స్క్రోల్ చేస్తే ప్రొఫైల్ పిక్గా ఒక చిన్న తెల్లటి మల్లెమొగ్గల జంట ఒకటి కనిపించింది. కరుణాకర్ దీర్ఘంగా నిశ్వసించాడు. "రేవతి చనిపోయిందంటే నమ్మలేకుండా వున్నాను" అన్నాడు తన లోపలికి చూసుకుంటూ. ఒక్కక్షణం ఆగి “ఇప్పుడే బయలుదేరుతాను. రేవతిని చివరి సారి చూడాలి" అన్నాడు చిన్నగా "రేవతిని చూడటానికా? ఆమె ఎక్కడ ఉన్నదో తెలియదు కదా! ఎలా వెళతావు? అయినా ముప్ఫై సంవత్సరాల తరువాత వెళ్లి, నువ్వు శవాన్ని చూసి చేసేదేమిటి? అసలు నిన్ను అక్కడ ఎవరైనా గుర్తు పడతారా? ఒక వేళ పట్టినా లోపలికి రానిస్తారా? నీకు ఆమెకు ఏమిటి సంబంధం అంటే ఏమి చెపుతావు?” అన్నే ప్రశ్నలు ఒకే సారి గుమ్మరించాడు చంద్రశేఖర్. అతడికి కరుణాకర్ బదులు ఇవ్వలేదు. ఇవ్వడానికి తన దగ్గర జవాబు కూడా లేదు. అతడి మనసు అతడి మాట వినడం మానేసింది. ఒక స్థిర నిర్ణయానికి వచ్చినవాడిలా రెండు రోజులకు లీవ్ లెటర్ రాసి శేఖర్ కి ఇచ్చి "బాస్ కి ఈ లీవ్ లెటర్ ఇవ్వు. నేను ఫోన్ చేసి ఆఫీస్ పని మీద వైజాగ్ వెళుతున్నాను అని శ్యామలకి.......© 2017,www.logili.com All Rights Reserved.