మంచి పుస్తకం, చెడ్డ పుస్తకమంటూ ప్రత్యేకంగా ఏమి ఉండవు. ఉండేదల్లా - మంచిగా రాసినవి - మంచిగా రాయబడనివే' అంటాడు ఆస్కార్ వైల్డ్. మరి, ఈ పరిగెచేను కతలు ఏ కోవకు చెందుతాయో పాఠకుల ఇష్టాయిష్టాలకే వదిలేస్తున్నాను. ఎవరి అభిరుచి వారిది. వారి వారి అభిరుచులను మరొహరెందుకు కాదనాలి!
నిజంగా, మీకు రైతుయెడ ప్రేమాభిమానాలు ఉంటే గనుక - మీలో కవితాత్మ అంటూ ఉంటే గనుక - దాంతో పాటు పరిశీలనా శక్తి, ఆసక్తి ఉంటేను గనుక - మీ బాల్యాన్ని, మీరీ వయస్సులో పునఃదర్శించుకోవాలనే కోరిక ఉంటే గనుక, రైతు నిజమైన ఆత్మ వీలువ ఏమిటో తెలుసుకోవాలను కుంటేను గనుక - రైతు, ప్రకృతి మధ్య, ప్రభుతల మధ్య ఎలా బలి పశువు అవుతున్నాడో తెలుసుకోవాలనుకుంటేను గనుక - రైతు జీవితంలోని దైన్యాన్ని, ఆశ నిరాశలను, వారి కడగండ్లను స్వయంగా తెలుసుకోవలనుకుంటేను గనుక, మీరి కథల్ని మనస్సు పెట్టి చదవండి.
- ఎలికట్టె శంకర్ రావు