ఈకథకు 'ఓ తండ్రి తీర్పు' అని పేరు పెట్టడం చాలా బాగుంది
ప్రతాప్ భీమవరపు గారు ఈ కథకు 'ఓ తండ్రి తీర్పు' అని పేరు పెట్టడం చాలా చాలా బాగుంది. అంతేగాక శీర్షిక చూడగానే కథ అర్ధం అయ్యేలాగా, తాము ఊహించిన విధంగా కథ మలపు తిరిగిందా? లేదా? అనే దృక్కోణంలో పఠితులచే పఠింపజేసే విధంగా, అందరి మనసులలో ఔరా! అనిపించే విధంగా, సభ్య సమాజానికి కనువిప్పు కల్గించేలా ప్రతాప్ గారు తమ కథ ద్వారా మన ముందుకు రావడం ముదావహం. అంతేగాక కథకు తగ్గట్టుగా శీర్షికను ఎంపిక చేయడం రచయిత గారికే చెల్లింది.
నేడు ఉద్యోగ రీత్యా అయితేనేమి, వ్యాపారం రీత్యా అయితేనేమి, ఇతరిత్రా పనులవల్ల అయితేనేమి, కుటుంబ కలహాల వల్ల అయితేనేమి, విపరీతమైన స్వార్థపు ఆలోచనలవల్ల అయితేనేమి ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమై, వ్యష్టి కుటుంబాలు పెరిగిపోయి, పిల్లలు ఒక దగ్గర, తల్లిదండ్రులు మరో దగ్గర నివసించాల్సిన దుస్థితిని, రచయిత ఈ కథలో తన ఆవేదనను తెలియజేశారు.
ప్రస్తుత సమాజంలో వృద్ధులైన తల్లిదండ్రుల పరిస్థితిని, వారు, వారి సంతానం ద్వారా ఎదుర్కొంటున్న ఛీత్కారాలు, చీదరింపులు, అవమానాలను 'ఓ తండ్రి తీర్పు' కథ ద్వారా ప్రతాప్ గారు పాఠకుల కళ్లకు కట్టినట్లు మన ముందుంచడమే గాక, కరోనా పరిస్థితుల గురించి, వృద్ధాశ్రమాల గురించి, వృద్ధ తల్లిదండ్రులను పట్టించుకోని నీచ, నిర్భాగ్య, నికృష్ట సంతానాన్ని గురించి తెలిపారు. కనీసం ఫోన్లో కూడా యోగక్షేమాలు అడగని సంతానానికి ఈ కథ ఒక చెంపదెబ్బ కావాలని కథను అనేక మలుపులతో తీర్చిదిద్దిన రచయిత గారికి హృదయ పూర్వక అభినందన మందార మాలలు.....
ఈకథకు 'ఓ తండ్రి తీర్పు' అని పేరు పెట్టడం చాలా బాగుంది ప్రతాప్ భీమవరపు గారు ఈ కథకు 'ఓ తండ్రి తీర్పు' అని పేరు పెట్టడం చాలా చాలా బాగుంది. అంతేగాక శీర్షిక చూడగానే కథ అర్ధం అయ్యేలాగా, తాము ఊహించిన విధంగా కథ మలపు తిరిగిందా? లేదా? అనే దృక్కోణంలో పఠితులచే పఠింపజేసే విధంగా, అందరి మనసులలో ఔరా! అనిపించే విధంగా, సభ్య సమాజానికి కనువిప్పు కల్గించేలా ప్రతాప్ గారు తమ కథ ద్వారా మన ముందుకు రావడం ముదావహం. అంతేగాక కథకు తగ్గట్టుగా శీర్షికను ఎంపిక చేయడం రచయిత గారికే చెల్లింది. నేడు ఉద్యోగ రీత్యా అయితేనేమి, వ్యాపారం రీత్యా అయితేనేమి, ఇతరిత్రా పనులవల్ల అయితేనేమి, కుటుంబ కలహాల వల్ల అయితేనేమి, విపరీతమైన స్వార్థపు ఆలోచనలవల్ల అయితేనేమి ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమై, వ్యష్టి కుటుంబాలు పెరిగిపోయి, పిల్లలు ఒక దగ్గర, తల్లిదండ్రులు మరో దగ్గర నివసించాల్సిన దుస్థితిని, రచయిత ఈ కథలో తన ఆవేదనను తెలియజేశారు. ప్రస్తుత సమాజంలో వృద్ధులైన తల్లిదండ్రుల పరిస్థితిని, వారు, వారి సంతానం ద్వారా ఎదుర్కొంటున్న ఛీత్కారాలు, చీదరింపులు, అవమానాలను 'ఓ తండ్రి తీర్పు' కథ ద్వారా ప్రతాప్ గారు పాఠకుల కళ్లకు కట్టినట్లు మన ముందుంచడమే గాక, కరోనా పరిస్థితుల గురించి, వృద్ధాశ్రమాల గురించి, వృద్ధ తల్లిదండ్రులను పట్టించుకోని నీచ, నిర్భాగ్య, నికృష్ట సంతానాన్ని గురించి తెలిపారు. కనీసం ఫోన్లో కూడా యోగక్షేమాలు అడగని సంతానానికి ఈ కథ ఒక చెంపదెబ్బ కావాలని కథను అనేక మలుపులతో తీర్చిదిద్దిన రచయిత గారికి హృదయ పూర్వక అభినందన మందార మాలలు.....© 2017,www.logili.com All Rights Reserved.