డా. జయప్రదగారు మంచి డాక్టర్ గా, మంచి రచయిత్రిగా ఏకకాలంలో పేరు తెచ్చుకున్నారు. 'బెస్ట్ షార్ట్ స్టోరీ రైటర్' గా అవార్డు పొందారు. ఆల్ ఇండియా రేడియో వారి 'కమండేషన్ అవార్డు' కూడా వీరికి లభించింది. సభల్లో, కవి సమ్మేళనాలలో పాల్గొంటూ, స్త్రీ పక్షపాతి అని అనిపించుకున్నారు. ఈ మధ్యే తాను చదివిన మెడికల్ కాలేజీలోనూ,నెల్లూరు డాక్టర్ల అసోసియేషన్ సన్మానింపబడ్డారు. వృత్తిపరంగా డా. గా పేరు గడిస్తూనే, సాహిత్యాన్ని ప్రవృత్తిగా స్వీకరించి ఇప్పటికి ౩౦౦ పైగా కథలు, 10 నవలలు, 100 కవితలు, మెడికల్ వ్యాసాలు, కొద్ది నాటికలు, యాభై పైన రేడియో కథలు, 18 పాటలు వ్రాశారు. వాటిలో కొన్నిటికి బహుమతులు వచ్చాయి. సీనియర్ రచయిత్రిగానే కాక, నెల్లూరు జిల్లాలో మొట్టమొదటి నవలా రచయిత్రిగా కూడా వీరు పేరు గడించారు. తన రచనలలో ఈ పుస్తకాలలో కలిసి 16 పుస్తకాల ద్వారా వచ్చే ఆదాయాన్ని పేద వికలాంగుల కోసం రచయిత్రి వినియోగించాలనుకోవడం ఎంతో ముదావహం. ఈ పుస్తకాలను ఆదరించడం ద్వారా రచయిత్రి ఆశయానికి పాఠకుల సహకారం తప్పక లభించగలదని ఆశిద్దాం.
- డా. సోమిరెడ్డి జయప్రద