ఏ రచయిత శిల్పం, శైలిలో రాయమన్నా - ఒక్క రాత్రి రాసి చూపించేవాడు రవిశంకర్. అలాగే ఏ పత్రికా సంపాదకులు ఎలాంటి కథానికల్ని ప్రచురించడానికిష్టపడతారో పంపించి, ప్రచురణలో చూపించి మరీ నిరూపించేవాడు. ఎంత మంచి రచయితో, అంత మంచి వ్యక్తీ. ఎంత మంచి రచయితో, అంత మంచి స్నేహశీలి. అన్ని సామాజిక సమస్యల మీద కథానికలే కాదు, అపరాధ పరిశోధనా కథానికలు, పిల్లల కథలు - ఎలాంటి కథానికలనైనా, కథలనైనా తేలికగా రాయగలిగిన రచయిత రవిశంకర్.
చిన్న వయసులోనే 'కుంటికాకి' కథానికకు ఆంద్రపత్రిక దీపావళి కథానికల పోటీలో బహుమతి పొంది తన సత్తా చుపించుకున్నవాడు - నాకు బాగా ఇష్టమైన రచయిత, మిత్రుడు ప్రతాప రవిశంకర్. ఇంతకుముందు రవిశంకర్ కథానికా సంపుటాలు ఎన్నో వచ్చాయి. ఒకదానిని నాకు అ౦కితమిచ్చాడు కుడా. తర్వాత వస్తాయి. కానీ ఈ సంపుటి ప్రత్యేకత ఈ సంపుటిదే! చదివితే మీరూ ఆ మాటే అంటారు. ఇక ఆలస్యం ఎందుకు? ముందు పేజీల్లోకి వెళ్ళిపొండి.
- వేదగిరి రాంబాబు
ఏ రచయిత శిల్పం, శైలిలో రాయమన్నా - ఒక్క రాత్రి రాసి చూపించేవాడు రవిశంకర్. అలాగే ఏ పత్రికా సంపాదకులు ఎలాంటి కథానికల్ని ప్రచురించడానికిష్టపడతారో పంపించి, ప్రచురణలో చూపించి మరీ నిరూపించేవాడు. ఎంత మంచి రచయితో, అంత మంచి వ్యక్తీ. ఎంత మంచి రచయితో, అంత మంచి స్నేహశీలి. అన్ని సామాజిక సమస్యల మీద కథానికలే కాదు, అపరాధ పరిశోధనా కథానికలు, పిల్లల కథలు - ఎలాంటి కథానికలనైనా, కథలనైనా తేలికగా రాయగలిగిన రచయిత రవిశంకర్. చిన్న వయసులోనే 'కుంటికాకి' కథానికకు ఆంద్రపత్రిక దీపావళి కథానికల పోటీలో బహుమతి పొంది తన సత్తా చుపించుకున్నవాడు - నాకు బాగా ఇష్టమైన రచయిత, మిత్రుడు ప్రతాప రవిశంకర్. ఇంతకుముందు రవిశంకర్ కథానికా సంపుటాలు ఎన్నో వచ్చాయి. ఒకదానిని నాకు అ౦కితమిచ్చాడు కుడా. తర్వాత వస్తాయి. కానీ ఈ సంపుటి ప్రత్యేకత ఈ సంపుటిదే! చదివితే మీరూ ఆ మాటే అంటారు. ఇక ఆలస్యం ఎందుకు? ముందు పేజీల్లోకి వెళ్ళిపొండి. - వేదగిరి రాంబాబు© 2017,www.logili.com All Rights Reserved.