కీర్తిశేషుని మాసిపోని కథాక్షరాలు
-విహారి
పురాణం శ్రీనివాసశాస్త్రి నాకు 1970ల నుంచీ మిత్రుడు. మొదట అతని కరలంటే ఇష్టం. ఆ తర్వాతి సాన్నిహిత్యంతో అతనూ ఇష్టమైనాడు. మృదువుగా మాటాడేవాడు. అసలు లోకం తెలీనివాడిలా ఉండేవాడు. కానీ, అతను లోకాన్ని చాలా దగ్గరగా చదివి తెలుసుకున్నవాడు. జీవికలోనూ, జీవితంలోనూ చాలా మునుగీతలూ, నిలువీతలూ వేసినవాడు. ఆంధ్రభూమిలోనూ ఆంధ్రప్రభలోనూ వారలోనూ పనిచేశాడు. 'కోకిలమ్' సాహిత్య సాంస్కృతిక వేదిక అతని మానస పత్రిక దాని గురించి ఎన్నో కలలుండేవి అతనికి. నేనూ, మునిపల్లెరాజు గారూ, పులిగడ్డ విశ్వనాథరావు గారి లాంటి వాళ్ళం కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నాం. శాస్త్రికి వాళ్ళ నాన్నగారు పురాణం సుబ్రహ్మణ్యశర్మగారి సాహిత్యమంటే అమిత గౌరవం. ఎప్పుడూ వాటి గురించి చెబుతూ, అడపాదడపా ఏదో చేయాలని అంటూ వుండేవాడు. తాను చనిపోవటానికి ముందు తన కథాసంపుటి రావాలనే కోరికని వ్యక్తం చేశాడు. కథలన్నింటినీ బయటికి తీస్తున్నానన్నాడు. అతని కలల్ని (మరణానంతరం) వాస్తవం చేస్తూ వస్తున్న సంపుటి ఇది. దీనికి కారకులైన అందరికీ అభినందనలు.
శ్రీశా. కథల్ని పాఠకులు మెచ్చుకున్నారు. పత్రికా సంపాదకులు ఆనందించి బహుమతులిచ్చారు. (జ్యోతి, ఆంధ్రప్రభ (ప్రథమ బహుమతులు) యువచక్రపాణి నాలుగో అవార్డు, మళ్ళీ జ్యోతిలో బహుమతి... ఇలా), విమర్శకులూ, విశ్లేషకులు | ఎక్కువమంది చదవలేదు. చదివినవారు ఒకరిద్దరు ఉటంకించారు. నాకు నచ్చిన 400 తెలుగు కథల్ని విశ్లేషిస్తూ నేను ఐదేళ్ళు వివిధ పత్రికల్లో ధారావాహిక శీర్షికల్లో వాటిని పరిచయం చేశాను. వాటిలో శ్రీ. శ. 'గూడు చాలని సుఖం |...........
కీర్తిశేషుని మాసిపోని కథాక్షరాలు -విహారి పురాణం శ్రీనివాసశాస్త్రి నాకు 1970ల నుంచీ మిత్రుడు. మొదట అతని కరలంటే ఇష్టం. ఆ తర్వాతి సాన్నిహిత్యంతో అతనూ ఇష్టమైనాడు. మృదువుగా మాటాడేవాడు. అసలు లోకం తెలీనివాడిలా ఉండేవాడు. కానీ, అతను లోకాన్ని చాలా దగ్గరగా చదివి తెలుసుకున్నవాడు. జీవికలోనూ, జీవితంలోనూ చాలా మునుగీతలూ, నిలువీతలూ వేసినవాడు. ఆంధ్రభూమిలోనూ ఆంధ్రప్రభలోనూ వారలోనూ పనిచేశాడు. 'కోకిలమ్' సాహిత్య సాంస్కృతిక వేదిక అతని మానస పత్రిక దాని గురించి ఎన్నో కలలుండేవి అతనికి. నేనూ, మునిపల్లెరాజు గారూ, పులిగడ్డ విశ్వనాథరావు గారి లాంటి వాళ్ళం కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నాం. శాస్త్రికి వాళ్ళ నాన్నగారు పురాణం సుబ్రహ్మణ్యశర్మగారి సాహిత్యమంటే అమిత గౌరవం. ఎప్పుడూ వాటి గురించి చెబుతూ, అడపాదడపా ఏదో చేయాలని అంటూ వుండేవాడు. తాను చనిపోవటానికి ముందు తన కథాసంపుటి రావాలనే కోరికని వ్యక్తం చేశాడు. కథలన్నింటినీ బయటికి తీస్తున్నానన్నాడు. అతని కలల్ని (మరణానంతరం) వాస్తవం చేస్తూ వస్తున్న సంపుటి ఇది. దీనికి కారకులైన అందరికీ అభినందనలు. శ్రీశా. కథల్ని పాఠకులు మెచ్చుకున్నారు. పత్రికా సంపాదకులు ఆనందించి బహుమతులిచ్చారు. (జ్యోతి, ఆంధ్రప్రభ (ప్రథమ బహుమతులు) యువచక్రపాణి నాలుగో అవార్డు, మళ్ళీ జ్యోతిలో బహుమతి... ఇలా), విమర్శకులూ, విశ్లేషకులు | ఎక్కువమంది చదవలేదు. చదివినవారు ఒకరిద్దరు ఉటంకించారు. నాకు నచ్చిన 400 తెలుగు కథల్ని విశ్లేషిస్తూ నేను ఐదేళ్ళు వివిధ పత్రికల్లో ధారావాహిక శీర్షికల్లో వాటిని పరిచయం చేశాను. వాటిలో శ్రీ. శ. 'గూడు చాలని సుఖం |...........© 2017,www.logili.com All Rights Reserved.