తెలుగు భాషకి అందాన్ని, తెలుగు కథకి యవ్వనాన్ని అందించిన ఘనత మల్లాది రామకృష్ణశాస్త్రి గారిది. చాలా మంది కథలు రాస్తారు. కానీ కొద్ది మందే కథలు చెప్తారు. కథకు చెప్పే గుణం ప్రాణం. అలా ప్రాణ ప్రతిష్ఠ చేసింది మల్లాది. వీరి కథనంలో కొంటెతనం, మాట విరుపులో వ్యంగ్యం పాఠకులను అహో అనిపిస్తాయి.
ఈ సంపుటంలోని మొదటి నవల 'కృష్ణాతీరం'. ఇది కేవలం శైలినీ శిల్పాన్నీ ప్రదర్శించడానికి మాత్రమే చేసిన రచనకాదు. దీనికి ఒక విశిష్టసామాజిక ప్రయోజనం స్పష్టంగా కనిపిస్తుంది. అది మానవ సంబంధాలను మెరుగుపరచుకోవడం. పెళ్లి సంబంధాలు కుదుర్చుకోవడంలో మూఢ నమ్మకాలను తొలగించుకోవడం, భార్యాభర్తలు, తల్లిదండ్రులు పిల్లలూ తమ తమ అహంకారాలూ దురభిప్రాయాలూ వదులుకుని తమ అనుబంధాలను అన్యోన్యంగా మలచుకోవడం, కుల మత వివక్ష పాటించకుండా మానవ సంబంధాలను ప్రేమపూర్వకంగా పెంపొందించుకోవడం ఎంత అవసరమో చూపిస్తారు ఈ నవలలో.
రెండవ నవల 'తేజోమూర్తులు'. శాస్త్రిగారికి సీతమ్మ అంటే భక్తేకాదు, జాలికూడా - ఆవిడపడిన కష్టాలకి. ఈ నవలలో కథానాయకుడి తల్లిపేరు సీతమ్మ. ఒక పురుషుడి వలలో పడి మోసపోయిన స్త్రీ ఆమె. "ఛీ చెడబుట్టింది! పెట్టిన పేరు చెడగొట్టింది!అన్నారుట అందరూ! వెర్రివాళ్ళు కాకపొతే, ఆ పేరెట్టినందుకు సీతమ్మవారి కష్టాలన్నీ పడ్డది" అనుకుంటాడు ఆమె కొడుకు. అతను ఎలా ఉన్నాడో చూడాలని బయలుదేరుతాడు. 'తవిశిపూడి' గ్రామంలో అతనికి ఆప్తులతో పరిచయాలవడం, కొన్ని అపోహలూ భ్రమలూ తొలగిపోవడం ఈ నవలలోని ఇతివృత్తం.
ఈ సంపుటంలోని మరో నవల 'క్షేత్రయ్య'. ప్రప్రథమంగా అచ్చులోకోచ్చిన అసంపూర్ణ నవల. సంగీత సాహిత్యాల్లో పండితులూ, భక్తీ ప్రపూర్ణులు, శృంగారశాస్త్రంలో నిష్ణాతులూ అయిన శాస్త్రిగారు అన్నమయ్య గురించి 'వనమాల' రచించినట్లుగానే క్షేత్రయ్య జీవిత చిత్రణ చెయ్యాలనుకోవడం సహజమే. ఎందువల్లనో పూర్తి చెయ్యలేకపోయారు. వరదయ్య బాల్యం గడిచి యౌవనారంభంలో ఉండగానే కథనం ఆగిపోయింది. మల్లాది రామకృష్ణశాస్త్రి రచనల్ని చదవడం కృష్ణలో స్నానం చేసినంత పవిత్రకార్యం అనిపిస్తుంది. చదివాక మనస్సు స్వేచ్చమవుతుంది.
- అబ్బూరి ఛాయాదేవి
తెలుగు భాషకి అందాన్ని, తెలుగు కథకి యవ్వనాన్ని అందించిన ఘనత మల్లాది రామకృష్ణశాస్త్రి గారిది. చాలా మంది కథలు రాస్తారు. కానీ కొద్ది మందే కథలు చెప్తారు. కథకు చెప్పే గుణం ప్రాణం. అలా ప్రాణ ప్రతిష్ఠ చేసింది మల్లాది. వీరి కథనంలో కొంటెతనం, మాట విరుపులో వ్యంగ్యం పాఠకులను అహో అనిపిస్తాయి. ఈ సంపుటంలోని మొదటి నవల 'కృష్ణాతీరం'. ఇది కేవలం శైలినీ శిల్పాన్నీ ప్రదర్శించడానికి మాత్రమే చేసిన రచనకాదు. దీనికి ఒక విశిష్టసామాజిక ప్రయోజనం స్పష్టంగా కనిపిస్తుంది. అది మానవ సంబంధాలను మెరుగుపరచుకోవడం. పెళ్లి సంబంధాలు కుదుర్చుకోవడంలో మూఢ నమ్మకాలను తొలగించుకోవడం, భార్యాభర్తలు, తల్లిదండ్రులు పిల్లలూ తమ తమ అహంకారాలూ దురభిప్రాయాలూ వదులుకుని తమ అనుబంధాలను అన్యోన్యంగా మలచుకోవడం, కుల మత వివక్ష పాటించకుండా మానవ సంబంధాలను ప్రేమపూర్వకంగా పెంపొందించుకోవడం ఎంత అవసరమో చూపిస్తారు ఈ నవలలో. రెండవ నవల 'తేజోమూర్తులు'. శాస్త్రిగారికి సీతమ్మ అంటే భక్తేకాదు, జాలికూడా - ఆవిడపడిన కష్టాలకి. ఈ నవలలో కథానాయకుడి తల్లిపేరు సీతమ్మ. ఒక పురుషుడి వలలో పడి మోసపోయిన స్త్రీ ఆమె. "ఛీ చెడబుట్టింది! పెట్టిన పేరు చెడగొట్టింది!అన్నారుట అందరూ! వెర్రివాళ్ళు కాకపొతే, ఆ పేరెట్టినందుకు సీతమ్మవారి కష్టాలన్నీ పడ్డది" అనుకుంటాడు ఆమె కొడుకు. అతను ఎలా ఉన్నాడో చూడాలని బయలుదేరుతాడు. 'తవిశిపూడి' గ్రామంలో అతనికి ఆప్తులతో పరిచయాలవడం, కొన్ని అపోహలూ భ్రమలూ తొలగిపోవడం ఈ నవలలోని ఇతివృత్తం. ఈ సంపుటంలోని మరో నవల 'క్షేత్రయ్య'. ప్రప్రథమంగా అచ్చులోకోచ్చిన అసంపూర్ణ నవల. సంగీత సాహిత్యాల్లో పండితులూ, భక్తీ ప్రపూర్ణులు, శృంగారశాస్త్రంలో నిష్ణాతులూ అయిన శాస్త్రిగారు అన్నమయ్య గురించి 'వనమాల' రచించినట్లుగానే క్షేత్రయ్య జీవిత చిత్రణ చెయ్యాలనుకోవడం సహజమే. ఎందువల్లనో పూర్తి చెయ్యలేకపోయారు. వరదయ్య బాల్యం గడిచి యౌవనారంభంలో ఉండగానే కథనం ఆగిపోయింది. మల్లాది రామకృష్ణశాస్త్రి రచనల్ని చదవడం కృష్ణలో స్నానం చేసినంత పవిత్రకార్యం అనిపిస్తుంది. చదివాక మనస్సు స్వేచ్చమవుతుంది. - అబ్బూరి ఛాయాదేవి© 2017,www.logili.com All Rights Reserved.