భోజనం చేయడం అందరికి సులువే కానీ దాన్ని తయారు చేయడం అందరికి రాదు. వచ్చినా రుచిగా తయారు చేయడం కొందరికే వస్తుంది. అది భోజనం అయినా, సృజన అయినా ఒక్కటే. రెండు మనుషులకు అత్యవసరం .
"సృజనత్వం" జివులలోని కేవలం మనుషులకే సొంతం. అందునా అది సామజిక బాధ్యత గల వారి హక్కు . ఇక ఈ సృజన ప్రక్రియలు ఎన్ని వున్నా కథా ప్రక్రియ నిత్యయవ్వని. ప్రతి మనిషికి బాల్యదశ ఎంత ముఖ్యమో, ప్రతి సృజనకారుడికి "బాల సాహిత్యం " అంతే ప్రధానం! కానీ బాల సాహితి వేత్తలంతా ప్రాధమిక బోధకులు, ప్రౌఢ సాహితి వేత్తలంతా విశ్వవిద్యాలయ బోధకులు అన్న చిన్న చూపు - పెద్ద చూపులతో సాగిపోతోంది. ఇక్కడ విజ్ఞాలంతా గమనించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే "బాల సాహిత్యం" ఎంత పటిష్టంగా వృద్ధి చెందుతుందో , ప్రౌఢ సాహిత్యం కూడా అంతే ఘనంగా ఆదరించబడుతుందని తెలుసుకోవాలి.