ఇది ఇక్ష్వాకుల కాలం నాటి కథ. ఆ రోజుల్లో భరతఖండాన్ని మోహనవర్మ అనే రాజు పాలిస్తూ ఉండేవాడు. మోహనవర్మ పరమ సాత్వికుడు. మృదుస్వభావి. ఎప్పుడూ ఎవరి మీదా దర్పాన్నిగానీ, అధికారాన్నిగానీ ప్రయోగించినవాడు కాదు. ఎప్పుడూ అందరితో నవ్వుతూ మాట్లాడేవాడు. ఎవరైనా పరుషంగా ఏదైనా అన్నా బొత్తిగా పట్టించుకునేవాడు కాదు. నవ్వి ఊరుకునేవాడు. ఇంత మెతక రాజుని ఎప్పుడూ చూడలేదని జనం ఇష్టంగా చెప్పుకునేవారు.
మోహనవర్మకు తలపాగాలంటే చాలా ఇష్టం. అతను రంగురంగుల పట్టు తలపాగలు ధరించేవాడు. ప్రతిరోజూ ఒక కొత్తరకం తలపాగా పెట్టుకునేవాడు. తలపాగా అతని శరీరంలో భాగంలా ఉండేది. నెత్తిమీద తలపాగా లేకుండా ఎవరికీ దర్శనం ఇచ్చేవాడు. కూడా కాదు. రాజుగారికి తలపాగాలు నేయడానికి ఆస్థానంలో ఒక ప్రత్యేక విభాగం
మోహనవర్మ తలవెంట్రుకలు ఎప్పుడూ బయటకి కనిపించేవి కావు. రాజుగారి నెత్తిమీద వెంట్రుకలు ఉన్నాయా? ఊడిపోయాయా? ఒకవేళ ఉంటే, నల్లగా ఉన్నాయా? తెల్లబడిపోయాయా? అని దేశప్రజలు చర్చించుకుంటూ ఉండేవారు.
రాజధాని నగరంలో పితామంగళం అనే ముసలి క్షురకుడు ఉండేవాడు. అతను ప్రతి రోజూ ఉదయాన్నే రాజప్రసాదానికి వెళ్లి మోహనవర్మకు గెడ్డం గీసి, అవసరమైన మేరకు తల వెంట్రుకలు సవరించి వచ్చేవాడు. ఎవరికీ తలవంచని మోహనవర్మ క్షవరం చేయించుకునే సమయంలో మాత్రమే పితామంగళం ముందు తలవంచి కూర్చునేవాడు. అప్పుడు మాత్రమే తలపాగ తీసేవాడు. స్నానాల మందిరంలో మోహనవర్మ పాత తలపాగ తీసి కొత్త తలపాగ పెట్టుకునే తతంగం అంతా రాజమాత కనుసన్నల్లోనే జరిగేది.....................
సరదా కథ రాజుగారి కొమ్ము ఇది ఇక్ష్వాకుల కాలం నాటి కథ. ఆ రోజుల్లో భరతఖండాన్ని మోహనవర్మ అనే రాజు పాలిస్తూ ఉండేవాడు. మోహనవర్మ పరమ సాత్వికుడు. మృదుస్వభావి. ఎప్పుడూ ఎవరి మీదా దర్పాన్నిగానీ, అధికారాన్నిగానీ ప్రయోగించినవాడు కాదు. ఎప్పుడూ అందరితో నవ్వుతూ మాట్లాడేవాడు. ఎవరైనా పరుషంగా ఏదైనా అన్నా బొత్తిగా పట్టించుకునేవాడు కాదు. నవ్వి ఊరుకునేవాడు. ఇంత మెతక రాజుని ఎప్పుడూ చూడలేదని జనం ఇష్టంగా చెప్పుకునేవారు. మోహనవర్మకు తలపాగాలంటే చాలా ఇష్టం. అతను రంగురంగుల పట్టు తలపాగలు ధరించేవాడు. ప్రతిరోజూ ఒక కొత్తరకం తలపాగా పెట్టుకునేవాడు. తలపాగా అతని శరీరంలో భాగంలా ఉండేది. నెత్తిమీద తలపాగా లేకుండా ఎవరికీ దర్శనం ఇచ్చేవాడు. కూడా కాదు. రాజుగారికి తలపాగాలు నేయడానికి ఆస్థానంలో ఒక ప్రత్యేక విభాగం మోహనవర్మ తలవెంట్రుకలు ఎప్పుడూ బయటకి కనిపించేవి కావు. రాజుగారి నెత్తిమీద వెంట్రుకలు ఉన్నాయా? ఊడిపోయాయా? ఒకవేళ ఉంటే, నల్లగా ఉన్నాయా? తెల్లబడిపోయాయా? అని దేశప్రజలు చర్చించుకుంటూ ఉండేవారు. రాజధాని నగరంలో పితామంగళం అనే ముసలి క్షురకుడు ఉండేవాడు. అతను ప్రతి రోజూ ఉదయాన్నే రాజప్రసాదానికి వెళ్లి మోహనవర్మకు గెడ్డం గీసి, అవసరమైన మేరకు తల వెంట్రుకలు సవరించి వచ్చేవాడు. ఎవరికీ తలవంచని మోహనవర్మ క్షవరం చేయించుకునే సమయంలో మాత్రమే పితామంగళం ముందు తలవంచి కూర్చునేవాడు. అప్పుడు మాత్రమే తలపాగ తీసేవాడు. స్నానాల మందిరంలో మోహనవర్మ పాత తలపాగ తీసి కొత్త తలపాగ పెట్టుకునే తతంగం అంతా రాజమాత కనుసన్నల్లోనే జరిగేది.....................© 2017,www.logili.com All Rights Reserved.