నా ఊపిరి మీద నిఘా పెట్టినంత కాలం.. నా కాలి కింద మట్టిని తీసి పరిశోధనలకి పంపినంత కాలం.. నేను ఎలా ఆలోచించాలో నువ్వు నేర్పినంత కాలం.. నేను ఏమి తినాలో తాగాలో నువ్వే మెనూ ఇచ్చినంత కాలం.. నేను ఏ పలుకు పలకాలో నువ్వే చిలకవై చెప్పినంత కాలం.. నా అస్తిత్వం నువ్వైనంత కాలం.. నన్ను కొట్టి తన్ని కాల్చి చంపినంత కాలం.. నీ మతం నీదై నా అభిమతం పట్టనంత కాలం.. నా ఉనికి నాకు చిక్కనంత కాలం.. అదెంత కాలమైనా నా పాట నేను పాడుతూనే ఉంటాను! నా ఆట నేను ఆడుతూనే ఉంటాను! నా మాట నేను పలుకుతూనే ఉంటాను! నేనొక నిరసననవుతాను.
జరుగుతున్న సంఘటనల పట్ల రచయితగా బజరా స్పందనే ఇది. తాను స్పందించడమే కాదు ఆ స్పందనతో అనివార్యంగా మనల్ని ప్రతిస్పందించేలా చేస్తాడు. చేయబట్టి సంఘటనా స్థలికి తీసుకుపోతాడు. మన చూపుకు తన చూపు జత చేస్తాడు. కనిపించని దృశ్యాల్ని సూక్ష్మదర్శిని ద్వారా చూపుతాడు. అక్కడి ఆవేదనలోనో ఆవేశంలోనో ఆగ్రహంలోనో ప్రతిఘటనలోనో భాగం చేస్తాడు.
- ఎ కె ప్రభాకర్
నా ఊపిరి మీద నిఘా పెట్టినంత కాలం.. నా కాలి కింద మట్టిని తీసి పరిశోధనలకి పంపినంత కాలం.. నేను ఎలా ఆలోచించాలో నువ్వు నేర్పినంత కాలం.. నేను ఏమి తినాలో తాగాలో నువ్వే మెనూ ఇచ్చినంత కాలం.. నేను ఏ పలుకు పలకాలో నువ్వే చిలకవై చెప్పినంత కాలం.. నా అస్తిత్వం నువ్వైనంత కాలం.. నన్ను కొట్టి తన్ని కాల్చి చంపినంత కాలం.. నీ మతం నీదై నా అభిమతం పట్టనంత కాలం.. నా ఉనికి నాకు చిక్కనంత కాలం.. అదెంత కాలమైనా నా పాట నేను పాడుతూనే ఉంటాను! నా ఆట నేను ఆడుతూనే ఉంటాను! నా మాట నేను పలుకుతూనే ఉంటాను! నేనొక నిరసననవుతాను. జరుగుతున్న సంఘటనల పట్ల రచయితగా బజరా స్పందనే ఇది. తాను స్పందించడమే కాదు ఆ స్పందనతో అనివార్యంగా మనల్ని ప్రతిస్పందించేలా చేస్తాడు. చేయబట్టి సంఘటనా స్థలికి తీసుకుపోతాడు. మన చూపుకు తన చూపు జత చేస్తాడు. కనిపించని దృశ్యాల్ని సూక్ష్మదర్శిని ద్వారా చూపుతాడు. అక్కడి ఆవేదనలోనో ఆవేశంలోనో ఆగ్రహంలోనో ప్రతిఘటనలోనో భాగం చేస్తాడు. - ఎ కె ప్రభాకర్© 2017,www.logili.com All Rights Reserved.