నా మాట
ఎన్నడూ తిరిగిరాని అమూల్యమైనది బాల్యం. గుండె పొరల మాటున దాగిన అలనాటి జ్ఞాపకాలు నా కథలకు ప్రేరణ.
ఆనాడు కాయకష్టం చేసి కష్టసుఖాలు కలిసి పంచుకునే మనుషుల స్వభావాన్ని చూశాను.
అమ్మలక్కలతో కలిసి పిండి దంచి అమ్మ వండిన అరిసెల రుచి, ఉట్టిమీద మట్టి చట్టిలో భద్రంగా నా కొరకై దాచిన తాయిలాల రుచి మరపురాదెందుకో! కోమటి కొట్టు దగ్గర పడిగాపులుపడి అందుకున్న బెల్లం ముక్క మధురమైన రుచి ఆనాటి జ్ఞాపకాలు.
ఇంటిల్లిపాదీ టూరింగ్ టాకీస్లో సినిమాకెళ్ళి హీరో కష్టాలకు చలించి బోరున ఏడుస్తూ గుండె బరువుతో ఇల్లు చేరిన సున్నిత మనస్కులను చూశాను. అడిగిన వారి ముందర “ఓ దేవదా!” అంటూ సావిత్రిలా పాట పాడుతూ డాన్స్ చేసి వారిని ఆనందపరచటం గుర్తు. ఊరంతటికీ ఒకే ఇంట్లో వున్న గ్రామఫోన్లో ఏ.యం. రాజా పాటలు వినడం ఉత్సాహం ఆనాడు.
చెట్టుపుట్టలెంట సీమచింతకాయలకెళితే పసిగట్టి జుట్టుపట్టి ప్రేక్షకులైన తల్లిదండ్రుల ముందు ఈత బెత్తంతో బాదుకుంటూ బడికి తీసుకెళ్ళిన ఉత్తమ ఉపాధ్యాయుడిని చూశాను ఆనాడు.
దెబ్బల భయంతో పద్యాలు కంఠత పెట్టడం, అమ్మ చెప్పే చిన్న చిన్న కథలు వినడం, ఎన్.టి.ఆర్. పౌరాణిక సినిమాలు చూసి దానిలోని సంభాషణలను (డైలాగ్స్) రోజంతా వల్లించడం, భాష మీద శ్రద్ధ పెంచుకుని అవగాహనలేని వయసున 5వ తరగతినుండే తెలుగులో క్లాస్ఫస్ట్ రావడం మధురస్మృతులు.
ఆనాడు నా బాల్యానికి పునాదులు, నా ఊహాజగత్తుకు బాటలు వేసినవి ఆనాటి బాలల మాస పత్రికలు - చందమామ, బాలమిత్రలు. నేడు అవి కనుమరుగయ్యాయి. చందమామ పుస్తకాల్ని చదువుతున్నప్పుడు ఆనంద పడేవాళ్ళం . దానిలో అంతర్లీనంగా క్రమశిక్షణ, నైతిక ప్రవర్తన, స్నేహం, మూగ జీవాల పట్ల ప్రేమ, దయ
మొదలైన గుణాలు అన్నీ ఉండేవి. కథతోపాటు నీతిని నేర్చుకోవాటానికి అవకాశం కలిగేది. నేటి బాలలే రేపటి పౌరులని భావించి నేటి తరానికి ఆనాటి నా జ్ఞాపకాల అనుభవాల్ని కథలుగా అందించాలన్నదే నా తాపత్రయం . సరళంగా, సులభమైన శైలిలో రాసినవి ఈ కథలు. చదివి ఆనందిస్తారని మరియు ఆచరిస్తారని ఆశిస్తూ................
చేగూడి కాంతి లిల్లీ పుష్పం
నా మాట ఎన్నడూ తిరిగిరాని అమూల్యమైనది బాల్యం. గుండె పొరల మాటున దాగిన అలనాటి జ్ఞాపకాలు నా కథలకు ప్రేరణ. ఆనాడు కాయకష్టం చేసి కష్టసుఖాలు కలిసి పంచుకునే మనుషుల స్వభావాన్ని చూశాను. అమ్మలక్కలతో కలిసి పిండి దంచి అమ్మ వండిన అరిసెల రుచి, ఉట్టిమీద మట్టి చట్టిలో భద్రంగా నా కొరకై దాచిన తాయిలాల రుచి మరపురాదెందుకో! కోమటి కొట్టు దగ్గర పడిగాపులుపడి అందుకున్న బెల్లం ముక్క మధురమైన రుచి ఆనాటి జ్ఞాపకాలు. ఇంటిల్లిపాదీ టూరింగ్ టాకీస్లో సినిమాకెళ్ళి హీరో కష్టాలకు చలించి బోరున ఏడుస్తూ గుండె బరువుతో ఇల్లు చేరిన సున్నిత మనస్కులను చూశాను. అడిగిన వారి ముందర “ఓ దేవదా!” అంటూ సావిత్రిలా పాట పాడుతూ డాన్స్ చేసి వారిని ఆనందపరచటం గుర్తు. ఊరంతటికీ ఒకే ఇంట్లో వున్న గ్రామఫోన్లో ఏ.యం. రాజా పాటలు వినడం ఉత్సాహం ఆనాడు. చెట్టుపుట్టలెంట సీమచింతకాయలకెళితే పసిగట్టి జుట్టుపట్టి ప్రేక్షకులైన తల్లిదండ్రుల ముందు ఈత బెత్తంతో బాదుకుంటూ బడికి తీసుకెళ్ళిన ఉత్తమ ఉపాధ్యాయుడిని చూశాను ఆనాడు. దెబ్బల భయంతో పద్యాలు కంఠత పెట్టడం, అమ్మ చెప్పే చిన్న చిన్న కథలు వినడం, ఎన్.టి.ఆర్. పౌరాణిక సినిమాలు చూసి దానిలోని సంభాషణలను (డైలాగ్స్) రోజంతా వల్లించడం, భాష మీద శ్రద్ధ పెంచుకుని అవగాహనలేని వయసున 5వ తరగతినుండే తెలుగులో క్లాస్ఫస్ట్ రావడం మధురస్మృతులు. ఆనాడు నా బాల్యానికి పునాదులు, నా ఊహాజగత్తుకు బాటలు వేసినవి ఆనాటి బాలల మాస పత్రికలు - చందమామ, బాలమిత్రలు. నేడు అవి కనుమరుగయ్యాయి. చందమామ పుస్తకాల్ని చదువుతున్నప్పుడు ఆనంద పడేవాళ్ళం . దానిలో అంతర్లీనంగా క్రమశిక్షణ, నైతిక ప్రవర్తన, స్నేహం, మూగ జీవాల పట్ల ప్రేమ, దయ మొదలైన గుణాలు అన్నీ ఉండేవి. కథతోపాటు నీతిని నేర్చుకోవాటానికి అవకాశం కలిగేది. నేటి బాలలే రేపటి పౌరులని భావించి నేటి తరానికి ఆనాటి నా జ్ఞాపకాల అనుభవాల్ని కథలుగా అందించాలన్నదే నా తాపత్రయం . సరళంగా, సులభమైన శైలిలో రాసినవి ఈ కథలు. చదివి ఆనందిస్తారని మరియు ఆచరిస్తారని ఆశిస్తూ................ చేగూడి కాంతి లిల్లీ పుష్పం© 2017,www.logili.com All Rights Reserved.