నిశిరాత్రి ఆ తోటలో...
ప్రసాదిని నదీ తీరాన గల కీకారణ్యములో తన పరివారముతో గుడారములలో నివసిస్తూ ముదముతో తనకెంతో ఇచ్చగల వేటలో నిమగ్నమయ్యాడు అభిక్య నగరాధీశు డైన అమరసింహుడు.
ఎన్ని నెలలు గడిచినా రాజ్య బాధ్యతలను విస్మరించి ప్రజల బాగోగులను మరిచి అరణ్యములోనే ఆనందించుతూ గడుపుతున్న అమరసింహుని కలుగబోవు దుర్యశము నుండి మరలించు నిమిత్తము, అభిక్యనగర మహామంత్రి మాణిక్యవర్మ, రాజ పురోహితుడు, మణిపద్మనాభుడు, అమరసింహునికి నచ్చజెప్పి అభిక్య నగరానికి రమ్మని అభ్యర్థించు కోరిక గలవారై అడవికి బయలుదేరారు.
అక్కడికెళ్ళి “జయము.... జయము మహారాజా..."అని పలికిన అమాత్యులకు, పురోహితునికి చిరునవ్వుతో ఆసీనులు కమ్మని ఆహ్వానించాడు అమరసింహుడు. "మహారాజా! మీరులేక రాజమందిరము బోసిపోయింది. దర్బారు కళావిహీన మయింది” అన్నాడు అమాత్యుడు.
"అవును ప్రభూ ఆరు మాసములనుండి ఈ ఘోరారణ్యమున గడుపుతున్నారు. ప్రజల అభీష్టము నెరవేర్చుట ఒక్క మహారాజుకే సాధ్యము. మేము ఏపాటి వారము ప్రభూ” అన్న పురోహితుని మాటలకు “మా అంగరక్షకుడు, మా సలహాదారుడైన అత్యంత ప్రియమైన 'జయసింహుడు' వున్నాడు కదా! ఇక మీకు కొదవ ఏమున్నది, అతనికి తోడు మన మంత్రివర్యులు, అర్థవంతుడు, అన్నిటికీ అర్థం చెప్పగల సామర్థ్యము గల అభ్యర్చితులు పురోహితులు మీరు ఉన్నారు. కనుక మేము నిశ్చింతగా వున్నాము” అన్నాడు.
మరలా పురోహితుడు "ప్రభూ! విద్యాధికుడు, సర్వ విద్యలలో ఆరితేరిన వాడు, ఉత్తముడు, రాజ్యములో ఎన్నో సమస్యలను తన భుజస్కంధాలపై మోస్తూ మీరు లేని సమయాన మన రాచకార్యాలను చక్కపెడుతూ ప్రేమమూర్తిగా, పేదల పెన్నిధిగా, నిజాయితీకి నిలువుటద్దముగా వున్న జయసింహుని గూర్చి ఎంత చెప్పినా అది కొంతే...........................
నిశిరాత్రి ఆ తోటలో... ప్రసాదిని నదీ తీరాన గల కీకారణ్యములో తన పరివారముతో గుడారములలో నివసిస్తూ ముదముతో తనకెంతో ఇచ్చగల వేటలో నిమగ్నమయ్యాడు అభిక్య నగరాధీశు డైన అమరసింహుడు. ఎన్ని నెలలు గడిచినా రాజ్య బాధ్యతలను విస్మరించి ప్రజల బాగోగులను మరిచి అరణ్యములోనే ఆనందించుతూ గడుపుతున్న అమరసింహుని కలుగబోవు దుర్యశము నుండి మరలించు నిమిత్తము, అభిక్యనగర మహామంత్రి మాణిక్యవర్మ, రాజ పురోహితుడు, మణిపద్మనాభుడు, అమరసింహునికి నచ్చజెప్పి అభిక్య నగరానికి రమ్మని అభ్యర్థించు కోరిక గలవారై అడవికి బయలుదేరారు. అక్కడికెళ్ళి “జయము.... జయము మహారాజా..."అని పలికిన అమాత్యులకు, పురోహితునికి చిరునవ్వుతో ఆసీనులు కమ్మని ఆహ్వానించాడు అమరసింహుడు. "మహారాజా! మీరులేక రాజమందిరము బోసిపోయింది. దర్బారు కళావిహీన మయింది” అన్నాడు అమాత్యుడు. "అవును ప్రభూ ఆరు మాసములనుండి ఈ ఘోరారణ్యమున గడుపుతున్నారు. ప్రజల అభీష్టము నెరవేర్చుట ఒక్క మహారాజుకే సాధ్యము. మేము ఏపాటి వారము ప్రభూ” అన్న పురోహితుని మాటలకు “మా అంగరక్షకుడు, మా సలహాదారుడైన అత్యంత ప్రియమైన 'జయసింహుడు' వున్నాడు కదా! ఇక మీకు కొదవ ఏమున్నది, అతనికి తోడు మన మంత్రివర్యులు, అర్థవంతుడు, అన్నిటికీ అర్థం చెప్పగల సామర్థ్యము గల అభ్యర్చితులు పురోహితులు మీరు ఉన్నారు. కనుక మేము నిశ్చింతగా వున్నాము” అన్నాడు. మరలా పురోహితుడు "ప్రభూ! విద్యాధికుడు, సర్వ విద్యలలో ఆరితేరిన వాడు, ఉత్తముడు, రాజ్యములో ఎన్నో సమస్యలను తన భుజస్కంధాలపై మోస్తూ మీరు లేని సమయాన మన రాచకార్యాలను చక్కపెడుతూ ప్రేమమూర్తిగా, పేదల పెన్నిధిగా, నిజాయితీకి నిలువుటద్దముగా వున్న జయసింహుని గూర్చి ఎంత చెప్పినా అది కొంతే...........................© 2017,www.logili.com All Rights Reserved.