బాల్యం టక్కరిది. ఏ అనుభవాలను, సంతోషాలను , భయాలను, ఏఏ భావాలను మనసుకు పట్టించుకోని అది ముందు జీవితానికి మార్గనిర్దేశం చేస్తుందో ఎవరూ పసిగట్టలేం. ఎక్కడో కొందరుంటారు, పసితనం నుంచి ప్రతి అనుభవాన్ని రికార్డు చేసుకొని జ్ఞాపకాల పేటీకలో భద్రం చేసుకొనేవాళ్ళు. ఇలాంటి వళ్ళే తమని తాము బయటనుంచి చేసుకోగలరు. అంతర్లోకాల్లో విహరించనూ గలరు. అలా చూసుకుంటూ, విహరిస్తూ మాయమైపోతున్న పసి అడుగులపై ప్రేమగా గాలి ఉది, తొంగి చూస్తున్న భావాతీతమైన అనుభూతికి రెక్కలుకట్టి ఎగరేసారు ఈ కధలో రచయిత్రి శ్రీసుధ మోదుగు.
పెద్దల బాల్యం పిల్లలు, పిల్లల ఆలోచనల్ని పెద్దలు తెలుసుకోవడానికి రెక్కలు తొడిగే కధల్లోకి, కాసేపు ఈ పల్నాటిపిల్ల చేతిని పట్టుకొని ఎగిరొద్దామా మరి.
- శ్రీసుధ మోదుగు.