కథనంలో సూటిదనం, శైలిలో లౌక్యం వరించిన 'విరించి' ఇరవై అయిదు కథల సమాహారమిది, మానవతా సౌరభాలివి! మానవతా ఆణిముత్యాలై, సమాజ నేపథ్యంలో, సజీవపాత్రల స్వరాల్ని సాకారం చేసిన రచనలుగా, సంపుటి తొలికథ 'ఆశ్రమశ్రావణి' నుండి 'అతడే హితుడు' వరకూ అన్నిటిలో మానవత్వకోణం కళ్ళముందు వెలుగవుతుంది. ఏ వర్ణన - కల్పనాశిల్పాల మెరుపుల కన్నా, స్వచ్చభావాల మానవత్వ 'మెచ్చు' తునకల్ని మెచ్చుకోకుండా ఉండలేం. మమతానుబంధాల గతి సుగంధహేలే! మానవతతో మనసుపెట్టి, మనిషి జీవనశిలల్ని - మానవతా శిల్పులుగా మలచిన మనిషితనం విపంచులు, మానవత్వ మణిమాలలు 'విరించి' కథలనడానికి నిదర్శనాలు - 'నాణానికి మరోవైపు', 'మంచం పట్టిన మానవత్వం' 'ఋణానుబంధం', 'ఒకరికి ఒకరు' కథలు.
ఈ కథలు కల్పనలు కాదు. కళ్ళముందు కనిపించే ఈనాటి అనేక సజీవపాత్రల స్వభావాలకి దర్పణాలు. ఈ కథలు కంట తడీ పెట్టిస్తాయి, కడుపు మండేలాగానూ చేస్తాయి... వెరసి, మానవ సంబంధాల, మానవతా భావాల మౌలిక స్వరూపాన్ని ఆవిష్కరిస్తాయి. 'విరించి' గుండె లోతుల్లో ఏం దాగివుందో, ఈ కథలు మనసున్న వాళ్లకి ఎందుకు నచ్చుతాయో నేను వేరే చెప్పాలా?
- జి వల్లీశ్వర్
కథనంలో సూటిదనం, శైలిలో లౌక్యం వరించిన 'విరించి' ఇరవై అయిదు కథల సమాహారమిది, మానవతా సౌరభాలివి! మానవతా ఆణిముత్యాలై, సమాజ నేపథ్యంలో, సజీవపాత్రల స్వరాల్ని సాకారం చేసిన రచనలుగా, సంపుటి తొలికథ 'ఆశ్రమశ్రావణి' నుండి 'అతడే హితుడు' వరకూ అన్నిటిలో మానవత్వకోణం కళ్ళముందు వెలుగవుతుంది. ఏ వర్ణన - కల్పనాశిల్పాల మెరుపుల కన్నా, స్వచ్చభావాల మానవత్వ 'మెచ్చు' తునకల్ని మెచ్చుకోకుండా ఉండలేం. మమతానుబంధాల గతి సుగంధహేలే! మానవతతో మనసుపెట్టి, మనిషి జీవనశిలల్ని - మానవతా శిల్పులుగా మలచిన మనిషితనం విపంచులు, మానవత్వ మణిమాలలు 'విరించి' కథలనడానికి నిదర్శనాలు - 'నాణానికి మరోవైపు', 'మంచం పట్టిన మానవత్వం' 'ఋణానుబంధం', 'ఒకరికి ఒకరు' కథలు. ఈ కథలు కల్పనలు కాదు. కళ్ళముందు కనిపించే ఈనాటి అనేక సజీవపాత్రల స్వభావాలకి దర్పణాలు. ఈ కథలు కంట తడీ పెట్టిస్తాయి, కడుపు మండేలాగానూ చేస్తాయి... వెరసి, మానవ సంబంధాల, మానవతా భావాల మౌలిక స్వరూపాన్ని ఆవిష్కరిస్తాయి. 'విరించి' గుండె లోతుల్లో ఏం దాగివుందో, ఈ కథలు మనసున్న వాళ్లకి ఎందుకు నచ్చుతాయో నేను వేరే చెప్పాలా? - జి వల్లీశ్వర్© 2017,www.logili.com All Rights Reserved.