సంక్లిష్ట సందర్భాలు
“వామపక్ష భావజాలం నుంచైనా, ఆర్ఎస్సెస్ భావజాలం నుంచైనా మంచి రచయితలు కానీ పాత్రికేయులుకానీ వస్తారు. ఎందుకంటే వారికి అధ్యయనశీలం ఉంటుంది. విశ్లేషణ అలవాటై ఉంటుంది" అనేవారు ఆంధ్రప్రభ బెంగళూరు ఎడిషన్లో పనిచేస్తున్న రోజుల్లో మాకు న్యూస్ ఎడిటర్గా, ఆత్మీయుడుగా, మార్గదర్శకుడిగా ఉండిన పుల్లయ్యగారు.
విద్యార్థి దశలోనే రాజకీయాలలో ఆసక్తి, అభినివేశం ప్రదర్శించిన సుధాకర్గారు 'జైఆంధ్ర' ఉద్యమకారుడిగా, ఏబీవీపీ కార్యకర్తగా చైతన్యయాత్ర ఆరంభించి తదనంతరకాలంలో రాడికల్ విద్యార్థి సంఘం (ఆర్ఎసూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎదిగి విప్లవబాట పట్టారు. సాయుధ పోరాటానికి మద్దతుదారుగా మూడేళ్ళు రాజకీయ ఖైదీగా ఉన్నారు. 'పీపుల్స్ వార్' క్రమంగా ప్రజలకు దూరంగా జరిగిందని గ్రహించి సాయుధ పోరాట రాజకీయాలకు తానూ దూరంగా జరిగారు. పదేళ్ళు అటూ ఇటూ నేనూ, సుధాకర్ ఒకే తరానికి చెందినవాళ్ళం. మా తరం వారందరిలో ఉన్న ఆవేశం, ఆలోచన, ఆత్మవిమర్శ, దిద్దుబాటు స్వభావం సుధాకర్లోనూ కనిపిస్తాయి.......................
సంక్లిష్ట సందర్భాలు “వామపక్ష భావజాలం నుంచైనా, ఆర్ఎస్సెస్ భావజాలం నుంచైనా మంచి రచయితలు కానీ పాత్రికేయులుకానీ వస్తారు. ఎందుకంటే వారికి అధ్యయనశీలం ఉంటుంది. విశ్లేషణ అలవాటై ఉంటుంది" అనేవారు ఆంధ్రప్రభ బెంగళూరు ఎడిషన్లో పనిచేస్తున్న రోజుల్లో మాకు న్యూస్ ఎడిటర్గా, ఆత్మీయుడుగా, మార్గదర్శకుడిగా ఉండిన పుల్లయ్యగారు. విద్యార్థి దశలోనే రాజకీయాలలో ఆసక్తి, అభినివేశం ప్రదర్శించిన సుధాకర్గారు 'జైఆంధ్ర' ఉద్యమకారుడిగా, ఏబీవీపీ కార్యకర్తగా చైతన్యయాత్ర ఆరంభించి తదనంతరకాలంలో రాడికల్ విద్యార్థి సంఘం (ఆర్ఎసూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎదిగి విప్లవబాట పట్టారు. సాయుధ పోరాటానికి మద్దతుదారుగా మూడేళ్ళు రాజకీయ ఖైదీగా ఉన్నారు. 'పీపుల్స్ వార్' క్రమంగా ప్రజలకు దూరంగా జరిగిందని గ్రహించి సాయుధ పోరాట రాజకీయాలకు తానూ దూరంగా జరిగారు. పదేళ్ళు అటూ ఇటూ నేనూ, సుధాకర్ ఒకే తరానికి చెందినవాళ్ళం. మా తరం వారందరిలో ఉన్న ఆవేశం, ఆలోచన, ఆత్మవిమర్శ, దిద్దుబాటు స్వభావం సుధాకర్లోనూ కనిపిస్తాయి.......................© 2017,www.logili.com All Rights Reserved.