ఈ కథలన్నిటిని అశేష ప్రజానీకానికి, ఫ్యూడల్ భూస్వామ్యానికి మధ్యనున్న వైరుధ్యాలను పరిష్కరించే క్రమంలో జరిగిన వర్గపోరాట ప్రతిఫలనాలుగా పేర్కొనవచ్చు. భూ సంబంధాల, ఉత్పత్తి సంబంధాల ప్రతిఫలనాలుగా పేర్కొనవచ్చు. నిన్నటి మట్టి మనుషులు కాలికింది మట్టిమనుషులు కాదు. మట్టిలో పొర్లాడే మనుషులే కావచ్చు. నిన్న వెట్టిమనుషులుగా ఆ మట్టిలో పొర్లాడి ఆ మట్టిలో నెత్తురు కక్కి బానిసలుగా చనిపోయిన వాళ్ళు. ఇప్పుడు ఇంతకన్నా నెత్తురు ధారబోసి చస్తున్నారు, బతుకుతున్నారు కావచ్చు కానీ సార్థకంగా చచ్చి అమరులవుతున్నారు.
ఎన్ని కష్టాలు, ఎంత రాజ్యహింస అయినా భరించి మేం బానిసలం కాదని మాత్రం ప్రకటిస్తున్నారు. రాజన్న మార్గం తనను తాను కోల్పోయిన మనిషి తనను తాను వెతుక్కోవడంలో సాగిన, సాగుతున్న సుదీర్ఘ ప్రయాణం. ఈ ప్రయాణం అంతా మదునయ్య వంటి రాజన్నలు ఎందరో ప్రాణత్యాగాలు చేశారు. వాళ్ళ వెంట అల్లం రాజ్య తన సాహిత్య కాగడా పట్టుకుని తోడుగా నడుస్తున్నాడు.
ఈ కథలన్నిటిని అశేష ప్రజానీకానికి, ఫ్యూడల్ భూస్వామ్యానికి మధ్యనున్న వైరుధ్యాలను పరిష్కరించే క్రమంలో జరిగిన వర్గపోరాట ప్రతిఫలనాలుగా పేర్కొనవచ్చు. భూ సంబంధాల, ఉత్పత్తి సంబంధాల ప్రతిఫలనాలుగా పేర్కొనవచ్చు. నిన్నటి మట్టి మనుషులు కాలికింది మట్టిమనుషులు కాదు. మట్టిలో పొర్లాడే మనుషులే కావచ్చు. నిన్న వెట్టిమనుషులుగా ఆ మట్టిలో పొర్లాడి ఆ మట్టిలో నెత్తురు కక్కి బానిసలుగా చనిపోయిన వాళ్ళు. ఇప్పుడు ఇంతకన్నా నెత్తురు ధారబోసి చస్తున్నారు, బతుకుతున్నారు కావచ్చు కానీ సార్థకంగా చచ్చి అమరులవుతున్నారు. ఎన్ని కష్టాలు, ఎంత రాజ్యహింస అయినా భరించి మేం బానిసలం కాదని మాత్రం ప్రకటిస్తున్నారు. రాజన్న మార్గం తనను తాను కోల్పోయిన మనిషి తనను తాను వెతుక్కోవడంలో సాగిన, సాగుతున్న సుదీర్ఘ ప్రయాణం. ఈ ప్రయాణం అంతా మదునయ్య వంటి రాజన్నలు ఎందరో ప్రాణత్యాగాలు చేశారు. వాళ్ళ వెంట అల్లం రాజ్య తన సాహిత్య కాగడా పట్టుకుని తోడుగా నడుస్తున్నాడు.© 2017,www.logili.com All Rights Reserved.