చిన్న కొడుకు, ఇరవై యేళ్లవాడు, అలా ఎందుకు మారిపోయాడు? ఇంటి పట్టున ఉండడు, ఎక్కడికి వెడుతున్నాడో ఎవరితో స్నేహం చేస్తున్నాడో తెలియదు. తల్లికి గాని తండ్రికి గాని తెలియదు. డబ్బుకి లోటులేదు. పుష్కలంగా ఉంది. కాలేజి చదువు పూర్తికాగానే అమెరికా పంపి పై చదువులు చదివించాలనుకున్నారు. కాని ఈ చిన్న కొడుకు అందరికీ దూరమైపోయాడు. ఇంటిలో ఎవరితోనూ మనసిచ్చి మాటాడడు. భోగభాగ్యాలంటే నిరసన. తల్లికి అర్థంకాదు. చిన్న కొడుకు మారిపోయాడు. చివరికి ఇరయయ్యోయేట దారుణంగా చంపబడ్డాడు. వాడు పుట్టిన రోజూ, చచ్చిపోయిన రోజూ ఒకటే, జనవరి 17.
తల్లికి మాత్రమే ఇది జ్ఞాపకం. వాడు చచ్చిపోయి ఏడాది తిరిగి వచ్చింది. ఆ రోజున తల్లి అన్వేషణకు బయలుదేరింది. తన చిన్న కొడుకు ఎందుకలా అయిపోయినాడని. ఆ రోజు సాయంత్రం అయ్యేసరికి బోధపడింది. బోధపదేసరికి తట్టుకోలేకపోయింది. ఆమె ఆవేదన కూడా అదే రోజున అంతమయింది. ఇది ఆ ఒక్క తల్లి కథకాదు. ఈనాడు సమాజంలో కొత్తతరం, యువజనం, స్వాతంత్ర్యానంతరం పుట్టిన తరం, ఇలా ఎందుకు మారిపోతున్నారో తెలియక దుఃఖానికి గురవుతున్న అనేక మంది తల్లుల కథ- అందరి తల్లుల కథ కూడా.
చిన్న కొడుకు, ఇరవై యేళ్లవాడు, అలా ఎందుకు మారిపోయాడు? ఇంటి పట్టున ఉండడు, ఎక్కడికి వెడుతున్నాడో ఎవరితో స్నేహం చేస్తున్నాడో తెలియదు. తల్లికి గాని తండ్రికి గాని తెలియదు. డబ్బుకి లోటులేదు. పుష్కలంగా ఉంది. కాలేజి చదువు పూర్తికాగానే అమెరికా పంపి పై చదువులు చదివించాలనుకున్నారు. కాని ఈ చిన్న కొడుకు అందరికీ దూరమైపోయాడు. ఇంటిలో ఎవరితోనూ మనసిచ్చి మాటాడడు. భోగభాగ్యాలంటే నిరసన. తల్లికి అర్థంకాదు. చిన్న కొడుకు మారిపోయాడు. చివరికి ఇరయయ్యోయేట దారుణంగా చంపబడ్డాడు. వాడు పుట్టిన రోజూ, చచ్చిపోయిన రోజూ ఒకటే, జనవరి 17. తల్లికి మాత్రమే ఇది జ్ఞాపకం. వాడు చచ్చిపోయి ఏడాది తిరిగి వచ్చింది. ఆ రోజున తల్లి అన్వేషణకు బయలుదేరింది. తన చిన్న కొడుకు ఎందుకలా అయిపోయినాడని. ఆ రోజు సాయంత్రం అయ్యేసరికి బోధపడింది. బోధపదేసరికి తట్టుకోలేకపోయింది. ఆమె ఆవేదన కూడా అదే రోజున అంతమయింది. ఇది ఆ ఒక్క తల్లి కథకాదు. ఈనాడు సమాజంలో కొత్తతరం, యువజనం, స్వాతంత్ర్యానంతరం పుట్టిన తరం, ఇలా ఎందుకు మారిపోతున్నారో తెలియక దుఃఖానికి గురవుతున్న అనేక మంది తల్లుల కథ- అందరి తల్లుల కథ కూడా.© 2017,www.logili.com All Rights Reserved.