పిల్లలను అలరించే కథలు కోకొల్లలు. ఇప్పటికే అనేక పుస్తకాలు వెలువడ్డాయి. అలాగే పిల్లలను ఆలోచింపజేసే పజిల్సూ అనేకం వస్తున్నాయి. ముఖ్యంగా దిన, వార, మాస పత్రికల్లోని పిల్లల విభాగాల్లో ఇలాంటి శీర్షికలు నడుస్తున్నాయి. పుస్తకాలగానూ వెలువడుతున్నాయి. ఈ రెండింటి సమాహారంగా పిల్లల రచనలు చేయటం నిజంగా ప్రయోగమే. ప్రయోజనదాయకం కూడా. ఈ ప్రయోగాత్మక, ప్రయోజనదాయక ప్రయత్నాల ప్రతిరూపం 'తమాషా కథలు'.
ఈ పుస్తకంలో మొత్తం 50 కథలు ఉన్నాయి. అందులో 35 తమాషా కథలు. ఒక్కొక్క కథలో పదేసి పదాలు ఉండాల్సిన చోట కాక వేరేచోట ఉంటాయి. ఉన్నవి ఉన్నట్టుగా చదివితే అర్థం బోధపడదు. కథాక్రమాన్నిబట్టి ఆలోచిస్తే, అక్కడ ఉండాల్సిన పదం ఏమిటో పిల్లలకు అవగతమవుతుంది. దీనివల్ల పిల్లలకు పదప్రయోగం, వాక్య నిర్మాణం, ఆలోచనాశక్తి అలవడతాయనడంలో అతిశయోక్తి లేదు. అంతేకాదు, కథ పూర్తయ్యేసరికి చక్కని నీతి కూడా తెలుస్తుంది. మిగతా 15 కథలూ మరో కోవకు చెందినవి. అవి తికమక కథలు. ఒక్కో కథలోని 10 పదాల తాలూకు అక్షరాలూ తారుమారై ఉంటాయి. వాటిని సరైన క్రమంలో అమర్చితే అర్థవంతమైన పదాలు వస్తాయి.
పిల్లలను అలరించే కథలు కోకొల్లలు. ఇప్పటికే అనేక పుస్తకాలు వెలువడ్డాయి. అలాగే పిల్లలను ఆలోచింపజేసే పజిల్సూ అనేకం వస్తున్నాయి. ముఖ్యంగా దిన, వార, మాస పత్రికల్లోని పిల్లల విభాగాల్లో ఇలాంటి శీర్షికలు నడుస్తున్నాయి. పుస్తకాలగానూ వెలువడుతున్నాయి. ఈ రెండింటి సమాహారంగా పిల్లల రచనలు చేయటం నిజంగా ప్రయోగమే. ప్రయోజనదాయకం కూడా. ఈ ప్రయోగాత్మక, ప్రయోజనదాయక ప్రయత్నాల ప్రతిరూపం 'తమాషా కథలు'. ఈ పుస్తకంలో మొత్తం 50 కథలు ఉన్నాయి. అందులో 35 తమాషా కథలు. ఒక్కొక్క కథలో పదేసి పదాలు ఉండాల్సిన చోట కాక వేరేచోట ఉంటాయి. ఉన్నవి ఉన్నట్టుగా చదివితే అర్థం బోధపడదు. కథాక్రమాన్నిబట్టి ఆలోచిస్తే, అక్కడ ఉండాల్సిన పదం ఏమిటో పిల్లలకు అవగతమవుతుంది. దీనివల్ల పిల్లలకు పదప్రయోగం, వాక్య నిర్మాణం, ఆలోచనాశక్తి అలవడతాయనడంలో అతిశయోక్తి లేదు. అంతేకాదు, కథ పూర్తయ్యేసరికి చక్కని నీతి కూడా తెలుస్తుంది. మిగతా 15 కథలూ మరో కోవకు చెందినవి. అవి తికమక కథలు. ఒక్కో కథలోని 10 పదాల తాలూకు అక్షరాలూ తారుమారై ఉంటాయి. వాటిని సరైన క్రమంలో అమర్చితే అర్థవంతమైన పదాలు వస్తాయి.© 2017,www.logili.com All Rights Reserved.