నెల్లూరు జిల్లా రాపూరులో శ్రీమతి అంజనీదేవి, చిరంజీవి దంపతులకు 28 ఫిబ్రవరి 1954న జన్మించారు. ఎమ్.ఎ.ఎమ్. ఇడి,పిహెచ్.డి. చేశారు. 'తెలుగులో బాలల కథలు' అన్న అంశం మీద శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో పరిశోధన చేసి డాక్టరేట్ పొందారు. చిన్నతనం నుండే కథలు రాయడం ప్రారంభించిన వీరి కథలు యాభై ఏళ్లుగా అన్ని తెలుగు బాలల పత్రికల్లో ప్రచురించబడ్డాయి. చంపక్,
గోకులం ఆంగ్ల పత్రిక ల్లోనూ పిల్లల కథలు రాశారు. 50కి పైగా బాల సాహిత్యం మీద పరిశోధనా పత్రాలు సమర్పించారు. డజనుకు పైగా పుస్తకాలు ప్రచురించబడ్డాయి. నెల్లూరు చరిత్రను గ్రంథస్థం చేశారు. చలనచిత్రరంగం మీద అనేక వ్యాసాలు 'విజయచిత్ర' లో ప్రచురించ బడ్డాయి. అమెరికాలో పిల్లల కొరకు రాసిన 'Moon Beam' అనే బొమ్మల కథల పుస్తకం ఐడ్రీమ్ పబ్లికేషన్స్ వారు (U.S.A) ప్రచురించారు.
'చందమామ' బాలల పత్రికలో (1980-82) రెండేళ్లపాటు ఉప సంపాదకుడిగా పనిచేశారు.
ఆంధ్రప్రదేశ్ అధికారభాషాసంఘం అవార్డు, రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, బాలకథారత్న బిరుదు, బాల సాహితీభూషణ్ అవార్డు, బాలల అకాడెమీ ఆంధ్రప్రదేశ్ వారి సన్మానం మరెన్నో సత్కారాలు పొందారు. ఉపాధ్యాయునిగా పనిచేసి పదవీ విరమణ చేసిన వీరు 'పుణ్యభారతి'కి 10 ఏళ్లపాటు సంపాదక బాధ్యతలు నిర్వహించారు.
వీరు ప్రస్తుతం 'పున్నమి' మాసపత్రిక సంపాదకులుగా వ్యవహరిస్తున్నారు.
నెల్లూరు జిల్లా రాపూరులో శ్రీమతి అంజనీదేవి, చిరంజీవి దంపతులకు 28 ఫిబ్రవరి 1954న జన్మించారు. ఎమ్.ఎ.ఎమ్. ఇడి,పిహెచ్.డి. చేశారు. 'తెలుగులో బాలల కథలు' అన్న అంశం మీద శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో పరిశోధన చేసి డాక్టరేట్ పొందారు. చిన్నతనం నుండే కథలు రాయడం ప్రారంభించిన వీరి కథలు యాభై ఏళ్లుగా అన్ని తెలుగు బాలల పత్రికల్లో ప్రచురించబడ్డాయి. చంపక్, గోకులం ఆంగ్ల పత్రిక ల్లోనూ పిల్లల కథలు రాశారు. 50కి పైగా బాల సాహిత్యం మీద పరిశోధనా పత్రాలు సమర్పించారు. డజనుకు పైగా పుస్తకాలు ప్రచురించబడ్డాయి. నెల్లూరు చరిత్రను గ్రంథస్థం చేశారు. చలనచిత్రరంగం మీద అనేక వ్యాసాలు 'విజయచిత్ర' లో ప్రచురించ బడ్డాయి. అమెరికాలో పిల్లల కొరకు రాసిన 'Moon Beam' అనే బొమ్మల కథల పుస్తకం ఐడ్రీమ్ పబ్లికేషన్స్ వారు (U.S.A) ప్రచురించారు. 'చందమామ' బాలల పత్రికలో (1980-82) రెండేళ్లపాటు ఉప సంపాదకుడిగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ అధికారభాషాసంఘం అవార్డు, రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, బాలకథారత్న బిరుదు, బాల సాహితీభూషణ్ అవార్డు, బాలల అకాడెమీ ఆంధ్రప్రదేశ్ వారి సన్మానం మరెన్నో సత్కారాలు పొందారు. ఉపాధ్యాయునిగా పనిచేసి పదవీ విరమణ చేసిన వీరు 'పుణ్యభారతి'కి 10 ఏళ్లపాటు సంపాదక బాధ్యతలు నిర్వహించారు. వీరు ప్రస్తుతం 'పున్నమి' మాసపత్రిక సంపాదకులుగా వ్యవహరిస్తున్నారు.© 2017,www.logili.com All Rights Reserved.