ప్రకృతి వైద్యం ద్వారా సర్వ రోగాల నివారణ - ఈ పుస్తకంలో తెలుపబడింది.
మన ముందు తరం వాళ్ళు చాలా ఆరోగ్యంగా, ఆనందంగా జీవించారన్న విషయంలో ఏమాత్రం సందేహం లేదు. సినిమాలు, షికార్లు లేకపోయినా వెన్నెల్లో నులకమంచం వేసుకొని కబుర్లు చెప్పుకునేవాళ్ళు... పిజ్జాలు, బర్గర్ లు లేకపోయినా దిబ్బరొట్టు, ఆవిరి కుడుములు తింటూ ఆరోగ్యంగా వుండేవాళ్ళు. ఎనభై, తొంభై ఏళ్లదాకా హాయిగా జీవించేవాళ్ళు. వృద్ధాప్యంలో కూడా ఎవరి పనులు వాళ్ళు హాయిగా చేసుకునే వాళ్ళు. డెబ్భై ఏళ్ళు వచ్చినా వెంట్రుకలు నెరవకుండా, నిండైన తలకట్టుతో, టకటకా బఠానీలు తింటూ చురుగ్గా ఉండేవాళ్ళు. ప్రస్తుతం నేటి జనరేషన్ తీసుకుంటే నలభై ఏళ్లకే నీరసించిపోతున్నారు. ఇరవై ఏళ్లకే బట్టతల, ముప్పై ఏళ్లకే బైపాస్ సర్జరీలు, కట్టుడుపళ్ళు అవసరం అవుతున్నాయి. ఇన్ని హాస్పిటల్స్, డెంటిస్టులు, బ్యూటీషియన్స్, ఒబిసిటీ సెంటర్లు ఒకప్పుడు ఉన్నాయా? ఇప్పుడే వాటి అవసరం ఎందుకు పెరిగిపోతుంది? ముందటి తరం వాళ్ళు హాయిగా వంటకాలు చేసుకుని కూడా ఆరోగ్యంగా ఉండగలిగారు? ఎందుకు? - ఇటువంటి ప్రశ్నలన్నిటికీ ఈ పుస్తకంలో జవాబులు కలవు.
- ఆదెళ్ళ శివకుమార్
ప్రకృతి వైద్యం ద్వారా సర్వ రోగాల నివారణ - ఈ పుస్తకంలో తెలుపబడింది. మన ముందు తరం వాళ్ళు చాలా ఆరోగ్యంగా, ఆనందంగా జీవించారన్న విషయంలో ఏమాత్రం సందేహం లేదు. సినిమాలు, షికార్లు లేకపోయినా వెన్నెల్లో నులకమంచం వేసుకొని కబుర్లు చెప్పుకునేవాళ్ళు... పిజ్జాలు, బర్గర్ లు లేకపోయినా దిబ్బరొట్టు, ఆవిరి కుడుములు తింటూ ఆరోగ్యంగా వుండేవాళ్ళు. ఎనభై, తొంభై ఏళ్లదాకా హాయిగా జీవించేవాళ్ళు. వృద్ధాప్యంలో కూడా ఎవరి పనులు వాళ్ళు హాయిగా చేసుకునే వాళ్ళు. డెబ్భై ఏళ్ళు వచ్చినా వెంట్రుకలు నెరవకుండా, నిండైన తలకట్టుతో, టకటకా బఠానీలు తింటూ చురుగ్గా ఉండేవాళ్ళు. ప్రస్తుతం నేటి జనరేషన్ తీసుకుంటే నలభై ఏళ్లకే నీరసించిపోతున్నారు. ఇరవై ఏళ్లకే బట్టతల, ముప్పై ఏళ్లకే బైపాస్ సర్జరీలు, కట్టుడుపళ్ళు అవసరం అవుతున్నాయి. ఇన్ని హాస్పిటల్స్, డెంటిస్టులు, బ్యూటీషియన్స్, ఒబిసిటీ సెంటర్లు ఒకప్పుడు ఉన్నాయా? ఇప్పుడే వాటి అవసరం ఎందుకు పెరిగిపోతుంది? ముందటి తరం వాళ్ళు హాయిగా వంటకాలు చేసుకుని కూడా ఆరోగ్యంగా ఉండగలిగారు? ఎందుకు? - ఇటువంటి ప్రశ్నలన్నిటికీ ఈ పుస్తకంలో జవాబులు కలవు. - ఆదెళ్ళ శివకుమార్© 2017,www.logili.com All Rights Reserved.