స.వెం. రమేశ్ 26 ఆగస్ట్ 1970లో తమిళనాడులో జన్మించారు. తెలుగు భాషోద్యమ కార్యకర్త. ప్రపంచమంతా తిరుగుతూ తెలుగు ఆనవాళ్లు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. యాంత్రోపాలజీ చదువుకున్నారు. తమిళనాడులో వివిధ ప్రాంతాలలోని గ్రామాలలో తెలుగు మాట్లాడేవారికి తెలుగు అక్షరాలు నేర్పించారు. స్వతహాగా కథకులు. ప్రళయకావేరి, కతలగంప కథాసంపుటాలు ప్రచురిం చారు. ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో విస్తరించిన తెలుగు ఆనవాళ్లని పట్టుకొని వ్యాసరూపంలో 'ఎల్లలు లేని తెలుగు'గా ప్రచురించారు. అచ్చ తెలుగు వ్యాకరణాన్ని తయారుచేసి, ప్రచురించారు. మొరసనాడు, తొండనాడు కథా సంకలనాలకు, పదమూడు భారతీయ భాషల్లో వెలువడిన తొలి కతల సంకలనానికి సంపాదకులు. తెలుగులో ఉన్న వేలాది ప్రదర్శన కళలు, చేతికళలు,కుల వృత్తులు పనులకు సంబంధించిన వివరాలను వీడియో రికార్డుచేసే పనిలో ప్రస్తుతం ఉన్నారు.

© 2017,www.logili.com All Rights Reserved.