స్పష్ట సంకేతం
నేను తిరిగి మనుషుల్లో పడుతున్న దాదాపు నెల రోజులకు వచ్చిందా పోన్
కాల్! అది చందూ దగ్గర్నించి.
"ఏరా!" ఏమంటున్నది నీ హృదయం' ఛలోక్తి విసిరాడు.
అసలే సున్నితమైనదాన్ని. ఎలాంటి ఒత్తిడికి తట్టుకోలేను. ఇకపై ఎలా చూసుకుంటావో మరి? - అంటోంది” నేనూ అదే ధోరణిలో బదులు చెప్పాను. "గుడ్! నీలో సెన్సాఫ్ హ్యూమర్ సజీవంగా ఉంది. ఎక్కడ డీలా పడిపోయావోనని హడలి వచ్చాను?
నేను బదులు పలకలేదు. మళ్లీ చందూయే అన్నాడు - "నేను బొంబాయిలో ఉండగా తెలిసింది విషయం. మూర్తి ఫోన్ చేసి చెప్పాడు. వెంటనే రావాలనుకున్నాను కానీ ఇప్పటికి కుదిరింది ఈ ఊరు రావడం! హోటల్ గోకుల్లోనే దిగాను. సాయంత్రం వస్తావుగా? ఈ సందర్భాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి.”
"సారీ చందూ! నేను తాగడం మానేసాను" ఒక క్షణం ఆగి అన్నాను. “ఒరేయ్ వంశీ! ఆగాగు! రెండుసార్లు స్ట్రోక్ వచ్చిన వాడ్ని నేనే నిక్షేపంగా రోజూ మందు కొడుతున్నాను. ఒక్కసారి చిన్నగా గుండె లయ తప్పిందని ఏకంగా నువ్వు సన్యాసం పుచ్చుకుంటాననడం ఏమీ బాగాలేదు" ఆందోళనగా అన్నాడు చందూ.
“అది కాదురా! ఇక డ్రింక్స్ జోలికి పోనని సుధకు ఒట్టేసి మరీ చెప్పాను”
“చాల్లేవోయ్! అసలు ఒట్టేయడమే ఒక నేరం! చెంపలేసుకుని ఒట్టును గట్టెక్కించి మందు పూజలో కూర్చోకపోతే అది మహాపాపం. జస్ట్ రెండంటే రెండు పెగ్గులు తీసుకుని పోదువుగాని! ఆ మాత్రం తట్టుకోగలదు నీ గుండె! కాదంటావా...? నేను చచ్చినంత ఒట్టు!"...................
స్పష్ట సంకేతం నేను తిరిగి మనుషుల్లో పడుతున్న దాదాపు నెల రోజులకు వచ్చిందా పోన్ కాల్! అది చందూ దగ్గర్నించి. "ఏరా!" ఏమంటున్నది నీ హృదయం' ఛలోక్తి విసిరాడు. అసలే సున్నితమైనదాన్ని. ఎలాంటి ఒత్తిడికి తట్టుకోలేను. ఇకపై ఎలా చూసుకుంటావో మరి? - అంటోంది” నేనూ అదే ధోరణిలో బదులు చెప్పాను. "గుడ్! నీలో సెన్సాఫ్ హ్యూమర్ సజీవంగా ఉంది. ఎక్కడ డీలా పడిపోయావోనని హడలి వచ్చాను? నేను బదులు పలకలేదు. మళ్లీ చందూయే అన్నాడు - "నేను బొంబాయిలో ఉండగా తెలిసింది విషయం. మూర్తి ఫోన్ చేసి చెప్పాడు. వెంటనే రావాలనుకున్నాను కానీ ఇప్పటికి కుదిరింది ఈ ఊరు రావడం! హోటల్ గోకుల్లోనే దిగాను. సాయంత్రం వస్తావుగా? ఈ సందర్భాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి.” "సారీ చందూ! నేను తాగడం మానేసాను" ఒక క్షణం ఆగి అన్నాను. “ఒరేయ్ వంశీ! ఆగాగు! రెండుసార్లు స్ట్రోక్ వచ్చిన వాడ్ని నేనే నిక్షేపంగా రోజూ మందు కొడుతున్నాను. ఒక్కసారి చిన్నగా గుండె లయ తప్పిందని ఏకంగా నువ్వు సన్యాసం పుచ్చుకుంటాననడం ఏమీ బాగాలేదు" ఆందోళనగా అన్నాడు చందూ. “అది కాదురా! ఇక డ్రింక్స్ జోలికి పోనని సుధకు ఒట్టేసి మరీ చెప్పాను” “చాల్లేవోయ్! అసలు ఒట్టేయడమే ఒక నేరం! చెంపలేసుకుని ఒట్టును గట్టెక్కించి మందు పూజలో కూర్చోకపోతే అది మహాపాపం. జస్ట్ రెండంటే రెండు పెగ్గులు తీసుకుని పోదువుగాని! ఆ మాత్రం తట్టుకోగలదు నీ గుండె! కాదంటావా...? నేను చచ్చినంత ఒట్టు!"...................
© 2017,www.logili.com All Rights Reserved.