తలుపు టకటకా చప్పుడయ్యింది. బాబూరావు పక్కమీద అటు నుంచి ఇటు బద్ధకంగా దొర్లాడు. మళ్లీ తలుపు చప్పుడు. ఇక లేవక తప్పలేదు బాబూరావుకి. మంచం మీద నుంచి లేచి తలుపు వైపు నడిచాడు. పాలమనిషి అందించిన సీసాలు తీసుకుని గడియపెట్టి మళ్లీ పడకగదిలోకి వచ్చాడు. ప్రశాంతంగా నిద్రపోతున్న సీతను, వేణును చూస్తూ కొద్ది క్షణాలపాటు నిలబడ్డాడు. తనతో జీవితం పంచుకున్న భార్య, తమిద్దరి అనురాగానికి చిహ్నంగా పుట్టుకొచ్చిన ముద్దుల కొడుకు. వాళ్లిద్దర్నీ చూస్తుంటే తను చాలా అదృష్టవంతుడనిపించింది బాబూరావుకి. తృప్తిగా నిట్టూర్చి వంటగదివైపు నడిచాడు.
సీతకు చిన్నప్పట్నించీ బెడ్ కాఫీ తాగడం అలవాటు. తనను ప్రేమించి, అయిన వాళ్లనందరినీ కాదని, సిరిసంపదలను వదులుకుని వచ్చేసి తనతో అతి సాధారణమైన జీవితానికి అలవాటుపడ్డ తొలి రోజుల్లో లేవగానే కాఫీ కోసం సీత ఇబ్బందిపడటం గమనించాడు బాబూరావు. తనకోసం ఎన్నో త్యాగాలు చేసిన భార్యకు బెడ్ కాఫీతో సుప్రభాతం పలకడం పెద్ద కష్టమనిపించలేదు బాబూరావుకి. అంతమాత్రం చేత భార్యాదాసుడ్నయిపోతానన్న భావనే అతని మనసులోకి ఎన్నడూ రాలేదు.
అతనికెలాగూ ఉదయం ఆరవుతుండగానే మెలుకువ వచ్చేస్తుంది. పాలు కాచి కాఫీ తయారుచేసి భార్యను నిద్రలేపడం అతని పెళ్లయిన ఆరేళ్ల నుండి యధావిధిగా, జరుగుతూనే వుంది. అలా చెయ్యడంలో ఎంతో ఆనందం కూడా ఫీలవుతాడతడు. పొగలు కక్కుతున్న కాఫీ కప్పులు రెండు చేతుల్తో పట్టుకుని చిన్నగా ఈల వేస్తూ పడకగదిలోకి వచ్చాడు. కాఫీ కప్పులు టీపాయ్ మీద వుంచి ముందుకు వంగి సీత చెవిలో, “దేవిగారూ, కాఫీ సిద్ధం, అన్నాడు.
సీతలో చలనం లేదు.
“ఏయ్ సీతా, ఏమిటా మొద్దునిద్ర లే," గిలిగింతలు పెట్టాడు.
"అబ్బ ఏమిటీ అల్లరిచేష్టలు? మీరు రోజురోజుకీ మరీ చిన్నపిల్లాడయి పోతున్నారు, ఒక్క ఉదుటున లేచి కూర్చుంది సీత.
“నేనలా చిన్నపిల్లాడయి పసిపాపలా ఎలా మారిపోతానో అని చూస్తూనే ఉండు. ఈలోపులో ఈ కాఫీ కాస్తా చల్లారిపోతుంది. అంతేకాని తీరా నేను కేర్కర్మంటే నాకు పట్టించడానికి పాలుగా మాత్రం చేస్తే మారదు," చిలిపిగా అన్నాడు బాబూరావు. నవ్వేసింది సీత. ఆమెకో కప్పు అందించి తనూ కాఫీ సిప్ చెయ్యసాగాడు. బాబూరావు...............
తలుపు టకటకా చప్పుడయ్యింది. బాబూరావు పక్కమీద అటు నుంచి ఇటు బద్ధకంగా దొర్లాడు. మళ్లీ తలుపు చప్పుడు. ఇక లేవక తప్పలేదు బాబూరావుకి. మంచం మీద నుంచి లేచి తలుపు వైపు నడిచాడు. పాలమనిషి అందించిన సీసాలు తీసుకుని గడియపెట్టి మళ్లీ పడకగదిలోకి వచ్చాడు. ప్రశాంతంగా నిద్రపోతున్న సీతను, వేణును చూస్తూ కొద్ది క్షణాలపాటు నిలబడ్డాడు. తనతో జీవితం పంచుకున్న భార్య, తమిద్దరి అనురాగానికి చిహ్నంగా పుట్టుకొచ్చిన ముద్దుల కొడుకు. వాళ్లిద్దర్నీ చూస్తుంటే తను చాలా అదృష్టవంతుడనిపించింది బాబూరావుకి. తృప్తిగా నిట్టూర్చి వంటగదివైపు నడిచాడు. సీతకు చిన్నప్పట్నించీ బెడ్ కాఫీ తాగడం అలవాటు. తనను ప్రేమించి, అయిన వాళ్లనందరినీ కాదని, సిరిసంపదలను వదులుకుని వచ్చేసి తనతో అతి సాధారణమైన జీవితానికి అలవాటుపడ్డ తొలి రోజుల్లో లేవగానే కాఫీ కోసం సీత ఇబ్బందిపడటం గమనించాడు బాబూరావు. తనకోసం ఎన్నో త్యాగాలు చేసిన భార్యకు బెడ్ కాఫీతో సుప్రభాతం పలకడం పెద్ద కష్టమనిపించలేదు బాబూరావుకి. అంతమాత్రం చేత భార్యాదాసుడ్నయిపోతానన్న భావనే అతని మనసులోకి ఎన్నడూ రాలేదు. అతనికెలాగూ ఉదయం ఆరవుతుండగానే మెలుకువ వచ్చేస్తుంది. పాలు కాచి కాఫీ తయారుచేసి భార్యను నిద్రలేపడం అతని పెళ్లయిన ఆరేళ్ల నుండి యధావిధిగా, జరుగుతూనే వుంది. అలా చెయ్యడంలో ఎంతో ఆనందం కూడా ఫీలవుతాడతడు. పొగలు కక్కుతున్న కాఫీ కప్పులు రెండు చేతుల్తో పట్టుకుని చిన్నగా ఈల వేస్తూ పడకగదిలోకి వచ్చాడు. కాఫీ కప్పులు టీపాయ్ మీద వుంచి ముందుకు వంగి సీత చెవిలో, “దేవిగారూ, కాఫీ సిద్ధం, అన్నాడు. సీతలో చలనం లేదు. “ఏయ్ సీతా, ఏమిటా మొద్దునిద్ర లే," గిలిగింతలు పెట్టాడు. "అబ్బ ఏమిటీ అల్లరిచేష్టలు? మీరు రోజురోజుకీ మరీ చిన్నపిల్లాడయి పోతున్నారు, ఒక్క ఉదుటున లేచి కూర్చుంది సీత. “నేనలా చిన్నపిల్లాడయి పసిపాపలా ఎలా మారిపోతానో అని చూస్తూనే ఉండు. ఈలోపులో ఈ కాఫీ కాస్తా చల్లారిపోతుంది. అంతేకాని తీరా నేను కేర్కర్మంటే నాకు పట్టించడానికి పాలుగా మాత్రం చేస్తే మారదు," చిలిపిగా అన్నాడు బాబూరావు. నవ్వేసింది సీత. ఆమెకో కప్పు అందించి తనూ కాఫీ సిప్ చెయ్యసాగాడు. బాబూరావు...............© 2017,www.logili.com All Rights Reserved.