ముందుమాట:
సాహిత్య సంచారి.. ఈ కథల విహారి...
'వాత్సల్యం జీవితంలా ప్రవహించే' కథల విహారుడు. కథలతోనూ, మనుషులతోనూ, జీవితంలోనూ వాత్సల్యత పెనవేసుకున్న సాహిత్య సంచారి విహారి. (జొన్నలగడ్డ సత్యనారాయణమూర్తి) అంటే తెలియదేమో కానీ 'విహారి' అనగానే తెలుగు కథ పరిచయంగా నవ్వుతుంది. కథలు చదవడం, కథకులను పరిచయం చేయడం, కథలు రాయడం, కథలు గురించే మాట్లాడడం విహారి జీవితాన్ని అల్లుకున్న నాలుగు ప్రధాన రహదారులు. వీటిని బైపాస్ చేయకుండానే వాటిని కలుపుతూ కొత్తగా మొలచిన ఫ్లైవోవర్ విహారి పదచిత్ర రామాయణం. కవిగా, కథకుడిగా, కథా విమర్శకుడిగా, పద్యకవిగా సాగుతున్న విహారి సాహిత్య జీవ ప్రవాహానికి అరవై సంవత్సరాలు నిండుతున్న సందర్భంలో... విహారి కథల విశేషాలను పంచుకోవడమే ఈ వ్యాస లక్ష్యం.
పాలగుమ్మి పద్మరాజు, సభా, పరుచూరి రాజారాం, మధురాంతకం రాజారాం, మునిపల్లె రాజు, కేతు విశ్వనాథరెడ్డి లాంటి మహా కథకులు విస్తృతంగా కథలు రాస్తున్న కాలంలో కథకుడిగా విహారి మొగ్గ తొడగడం, వికసించడం, కాలం నిండా తన కథా పరిమళాలను వెదజల్లుతూ ఉండడం ఒక విశేషమైతే, కాలంలో గెలిచిన కథలను, కాలంతో పాటే నిలిచిన కథలను, కాలంతో నడిచిన కథలను తన తర్వాతి తరాలకు చెప్పే ఒక ఎన్సైక్లోపీడియాగా మారడం మరో విశేషం. అందుకేనేమో, చాలామంది కథకులు కొంతకాలానికి పెన్ను మూసేసినా, కళ్ళజోడు తీసేసినా విహారి మాత్రం నిర్విరామ శ్రామికుడిగా కథా వ్యవసాయాన్ని చేస్తూనే ఉన్నారు.
ఈ హాలికుడి ఆరు దశాబ్దాల కథల ప్రయాణం ఎన్నో మేలిమి ముత్యాలను పోగేసి తెలుగు కథను అలంకరించింది. 'గురజాడ' నాటకంతో ఏ విధంగా అయితే ఆరంగ్రేటం ఆం చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడో 'విహారి' కూడా మొట్టమొదట జీవితానికి...................
ముందుమాట: సాహిత్య సంచారి.. ఈ కథల విహారి... 'వాత్సల్యం జీవితంలా ప్రవహించే' కథల విహారుడు. కథలతోనూ, మనుషులతోనూ, జీవితంలోనూ వాత్సల్యత పెనవేసుకున్న సాహిత్య సంచారి విహారి. (జొన్నలగడ్డ సత్యనారాయణమూర్తి) అంటే తెలియదేమో కానీ 'విహారి' అనగానే తెలుగు కథ పరిచయంగా నవ్వుతుంది. కథలు చదవడం, కథకులను పరిచయం చేయడం, కథలు రాయడం, కథలు గురించే మాట్లాడడం విహారి జీవితాన్ని అల్లుకున్న నాలుగు ప్రధాన రహదారులు. వీటిని బైపాస్ చేయకుండానే వాటిని కలుపుతూ కొత్తగా మొలచిన ఫ్లైవోవర్ విహారి పదచిత్ర రామాయణం. కవిగా, కథకుడిగా, కథా విమర్శకుడిగా, పద్యకవిగా సాగుతున్న విహారి సాహిత్య జీవ ప్రవాహానికి అరవై సంవత్సరాలు నిండుతున్న సందర్భంలో... విహారి కథల విశేషాలను పంచుకోవడమే ఈ వ్యాస లక్ష్యం. పాలగుమ్మి పద్మరాజు, సభా, పరుచూరి రాజారాం, మధురాంతకం రాజారాం, మునిపల్లె రాజు, కేతు విశ్వనాథరెడ్డి లాంటి మహా కథకులు విస్తృతంగా కథలు రాస్తున్న కాలంలో కథకుడిగా విహారి మొగ్గ తొడగడం, వికసించడం, కాలం నిండా తన కథా పరిమళాలను వెదజల్లుతూ ఉండడం ఒక విశేషమైతే, కాలంలో గెలిచిన కథలను, కాలంతో పాటే నిలిచిన కథలను, కాలంతో నడిచిన కథలను తన తర్వాతి తరాలకు చెప్పే ఒక ఎన్సైక్లోపీడియాగా మారడం మరో విశేషం. అందుకేనేమో, చాలామంది కథకులు కొంతకాలానికి పెన్ను మూసేసినా, కళ్ళజోడు తీసేసినా విహారి మాత్రం నిర్విరామ శ్రామికుడిగా కథా వ్యవసాయాన్ని చేస్తూనే ఉన్నారు. ఈ హాలికుడి ఆరు దశాబ్దాల కథల ప్రయాణం ఎన్నో మేలిమి ముత్యాలను పోగేసి తెలుగు కథను అలంకరించింది. 'గురజాడ' నాటకంతో ఏ విధంగా అయితే ఆరంగ్రేటం ఆం చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడో 'విహారి' కూడా మొట్టమొదట జీవితానికి...................© 2017,www.logili.com All Rights Reserved.