“గడిచిపోయిన నా జీవితాన్ని వెనక్కి పిలువరా”
అని వేడుకుంటున్నాడు ఉర్దూ కవి సఫీ లఖ్నవీ. పిలిస్తే మాత్రం గడిచిపోయిన జీవితం తిరిగి వస్తుందా? రాదు. ఆ సంగతి కవికి తెలుసు - మనకు తెలుసు. కాబట్టి మనమే గతంలోకి వెళ్లి, కొన్ని తీయని జ్ఞాపకాలు పట్టి తెచ్చి పాఠకుల ముందు
పరిస్తే మంచిది. వినేవాళ్లు వింటారు, విననివాళ్లు వినరు. ఉర్దూలో ఒక మాటున్నది "జో. సునా ఉస్కా భలా - జో నసునా ఉస్కా భలా" అంటే, ఎవరు విన్నారో వాళ్లకు మేలగుగాక ఎవరు వినలేదో వాళ్లకూ మేలగుగాక".
“దానివలన ఏమి ప్రయోజనం? పనిలేని పని" అని చప్పరిస్తారు కొందరు. నావంటి పనీపాటా లేని వారికి అది పనికివచ్చే పనే.
“అంతేమరి. ముసలివాళ్లు వర్తమాన పరిస్థితులతో సర్దుకుపోలేరు. సమస్యలకు సరిగా స్పందించలేరు. భవిష్యత్తు పట్ల ఆశలు పెంచుకోలేరు. వాళ్ల ఆలోచనలన్నీ గతాన్ని పట్టుకొనే వుంటాయి. ఎవరు విన్నా వినకున్నా పాతకాలపు ముచ్చట్లే చెప్తుంటారు. ఏమున్నదందులో? పాత చింతకాయ పచ్చడి" అని ఈసడించినాడొక మేధావి. ఆయుర్వేద వైద్యాన్నే నమ్ముకున్న మా అనుపమ శ్రీనివాసరావుగారేమో (రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్, హయ్యర్ ఎడ్యుకేషన్) "పాత చింతకాయపచ్చడి పైత్యాన్ని తగ్గిస్తుంది. శరీరాన్నేగాక మనసునూ ఆరోగ్యంగా వుంచుతుంది" అంటారు.
యాభైయేళ్లకు పైగా ఈ పాత ముచ్చట్లే చెప్తున్నాను. ఇక్కడ ముప్పయ్యేళ్లు వెనక్కి వెళ్తున్నాను.
****
ఆదిలాబాద్ నగరంలో మార్వాడీ ధర్మశాల వున్నది. పెళ్లిళ్లకు, పెద్ద పెద్ద సభలకు అప్పుడదే అనువైన చోటు. దుర్గా నవరాత్రుల సందర్భాన ఆ చోటనే హిందూస్తానీ సంగీత సభలు ఘనంగా జరిగేవి. గొట్టుముక్కల వామనరావు ఇక్కడి జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో షిరస్తేదారు. అతనికి సంగీతం పిచ్చి. ఎక్కడెక్కడి సుప్రసిద్ధ గాయికా గాయకులనో వినేవాడు. తాను పొందిన ఆనందాన్ని ఇక్కడి సంగీత ప్రియులకు అందించాలని ఆరాటపడేవాడు.
'జరా ఉమై - రఫ్తాకో ఆవాజ్ దేనా" “గడిచిపోయిన నా జీవితాన్ని వెనక్కి పిలువరా” అని వేడుకుంటున్నాడు ఉర్దూ కవి సఫీ లఖ్నవీ. పిలిస్తే మాత్రం గడిచిపోయిన జీవితం తిరిగి వస్తుందా? రాదు. ఆ సంగతి కవికి తెలుసు - మనకు తెలుసు. కాబట్టి మనమే గతంలోకి వెళ్లి, కొన్ని తీయని జ్ఞాపకాలు పట్టి తెచ్చి పాఠకుల ముందు పరిస్తే మంచిది. వినేవాళ్లు వింటారు, విననివాళ్లు వినరు. ఉర్దూలో ఒక మాటున్నది "జో. సునా ఉస్కా భలా - జో నసునా ఉస్కా భలా" అంటే, ఎవరు విన్నారో వాళ్లకు మేలగుగాక ఎవరు వినలేదో వాళ్లకూ మేలగుగాక". “దానివలన ఏమి ప్రయోజనం? పనిలేని పని" అని చప్పరిస్తారు కొందరు. నావంటి పనీపాటా లేని వారికి అది పనికివచ్చే పనే. “అంతేమరి. ముసలివాళ్లు వర్తమాన పరిస్థితులతో సర్దుకుపోలేరు. సమస్యలకు సరిగా స్పందించలేరు. భవిష్యత్తు పట్ల ఆశలు పెంచుకోలేరు. వాళ్ల ఆలోచనలన్నీ గతాన్ని పట్టుకొనే వుంటాయి. ఎవరు విన్నా వినకున్నా పాతకాలపు ముచ్చట్లే చెప్తుంటారు. ఏమున్నదందులో? పాత చింతకాయ పచ్చడి" అని ఈసడించినాడొక మేధావి. ఆయుర్వేద వైద్యాన్నే నమ్ముకున్న మా అనుపమ శ్రీనివాసరావుగారేమో (రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్, హయ్యర్ ఎడ్యుకేషన్) "పాత చింతకాయపచ్చడి పైత్యాన్ని తగ్గిస్తుంది. శరీరాన్నేగాక మనసునూ ఆరోగ్యంగా వుంచుతుంది" అంటారు. యాభైయేళ్లకు పైగా ఈ పాత ముచ్చట్లే చెప్తున్నాను. ఇక్కడ ముప్పయ్యేళ్లు వెనక్కి వెళ్తున్నాను. **** ఆదిలాబాద్ నగరంలో మార్వాడీ ధర్మశాల వున్నది. పెళ్లిళ్లకు, పెద్ద పెద్ద సభలకు అప్పుడదే అనువైన చోటు. దుర్గా నవరాత్రుల సందర్భాన ఆ చోటనే హిందూస్తానీ సంగీత సభలు ఘనంగా జరిగేవి. గొట్టుముక్కల వామనరావు ఇక్కడి జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో షిరస్తేదారు. అతనికి సంగీతం పిచ్చి. ఎక్కడెక్కడి సుప్రసిద్ధ గాయికా గాయకులనో వినేవాడు. తాను పొందిన ఆనందాన్ని ఇక్కడి సంగీత ప్రియులకు అందించాలని ఆరాటపడేవాడు.© 2017,www.logili.com All Rights Reserved.