వర్తమాన రచయిత్రిగా లోకానికి పరిచయమవుతున్న సరోజలో రచయిత్రికి ఉండాల్సిన సునిశిత దృష్టి, వినికిడి, ఊహ సహజంగా ఉన్నాయి. రచనా శిల్పం ఆహ్లాదం కలిగించే 'హాబీ'గా కాక, సాధన భూతమైన పరికరంగా భావిస్తుంది సరోజ! ప్రతి కథలో ఓ అవ్యక్త సందేశం నిక్షిప్తం. అసలు నేటి సమాజమంతా రోగజనకమైన అసత్యం మీద ఆధారపడి ఉంది. అంచేత రచయిత్రిగా తన అనుభవాలను మూగవోనీయకుండా ఓ ప్రత్యేక జీవిత దృక్పథం జీవితాదర్శం అలవర్చుకొని, సమాజంలోని సమస్యల్ని అందరి వ్యక్తుల దృష్టికి తెచ్చి, వారితో కలిసి "ఇప్పుడేం చేద్దాం చెప్పండి!" అనడిగే కథల్ని రాయడం ఈమెలోని ప్రత్యేకత.
మధ్య తరగతి కుటుంబాలను బాగా అవగాహన చేసుకున్న మనస్సు, సానుభూతి ఈమెకు పుష్కలంగా ఉన్నాయి! సగటు మనిషి జీవితపు విలువల్ని సవరిస్తాయి సరోజ కథలు. పురుషస్వాములు 'డామినేట్' చేసే కుటుంబ వ్యవస్థలో మార్పురావటం లేదే అని నిట్టూరుస్తాయి ఈమె రచనలు! ఈ రచయిత్రి రాయబోయే నవలలు, గేయాలు సృజనాత్మకమై అశేష ఆంద్ర ప్రజల ఆదరాభిమానాలను చూరగొనాలని నా ఆకాంక్ష.
- ఆరార్కే మూర్తి
వర్తమాన రచయిత్రిగా లోకానికి పరిచయమవుతున్న సరోజలో రచయిత్రికి ఉండాల్సిన సునిశిత దృష్టి, వినికిడి, ఊహ సహజంగా ఉన్నాయి. రచనా శిల్పం ఆహ్లాదం కలిగించే 'హాబీ'గా కాక, సాధన భూతమైన పరికరంగా భావిస్తుంది సరోజ! ప్రతి కథలో ఓ అవ్యక్త సందేశం నిక్షిప్తం. అసలు నేటి సమాజమంతా రోగజనకమైన అసత్యం మీద ఆధారపడి ఉంది. అంచేత రచయిత్రిగా తన అనుభవాలను మూగవోనీయకుండా ఓ ప్రత్యేక జీవిత దృక్పథం జీవితాదర్శం అలవర్చుకొని, సమాజంలోని సమస్యల్ని అందరి వ్యక్తుల దృష్టికి తెచ్చి, వారితో కలిసి "ఇప్పుడేం చేద్దాం చెప్పండి!" అనడిగే కథల్ని రాయడం ఈమెలోని ప్రత్యేకత. మధ్య తరగతి కుటుంబాలను బాగా అవగాహన చేసుకున్న మనస్సు, సానుభూతి ఈమెకు పుష్కలంగా ఉన్నాయి! సగటు మనిషి జీవితపు విలువల్ని సవరిస్తాయి సరోజ కథలు. పురుషస్వాములు 'డామినేట్' చేసే కుటుంబ వ్యవస్థలో మార్పురావటం లేదే అని నిట్టూరుస్తాయి ఈమె రచనలు! ఈ రచయిత్రి రాయబోయే నవలలు, గేయాలు సృజనాత్మకమై అశేష ఆంద్ర ప్రజల ఆదరాభిమానాలను చూరగొనాలని నా ఆకాంక్ష. - ఆరార్కే మూర్తి© 2017,www.logili.com All Rights Reserved.