1956లో ఏర్పడిన విశాలాంధ్ర రాష్ట్రం 58 సంవత్సరాల ఒడుదుడుకుల జీవనం తరువాత విడిపోవడాన్ని ఆమోదిస్తూ 29వ రాష్ట్రంగా తెలంగాణాకు ఈ చట్టం జన్మనిచ్చింది. తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం, తెలుగు భాషా ప్రాతిపదికపైన 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. పెద్ద మనుషుల ఒప్పందం ఉల్లంఘన, అసమానతలు, భాశావమానాలు, నిధులు, నీళ్ళు, ఉద్యోగాలు, విద్యావకాశాల మళ్లింపు, తెలంగాణ పట్ల వివక్ష అనే కారణాలపైన సాగిన ఉద్యమాల ఫలితంగా ఈ చట్టం వచ్చింది. పార్లమెంటులో ఎన్నో ఉద్రిక్తల మధ్య ఆమోదం పొందిన చట్టం ఈ విభజన చట్టం.1956లో ఆంధ్రప్రదేశ్ అనే సమైక్య రాష్ట్రం కూడా ఆనాటి విభజనల మీద ఆధారపడినదే. హైదరాబాద్ రాష్ట్రాన్ని విభజించి మరాఠా ప్రాంతాలను, కన్నడ ప్రాంతాలను వేరు చేసిన తరువాత హైదరాబాద్ మిగిలింది. మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయిన ఆంద్ర రాష్ట్రం మిగిలింది. వీటి కలయికను సమైక్యం అన్నారు. సమైక్యత లేదని తేలిపోయిన తరువాత రెండు రాష్ట్రాలకు రూపకల్పన చేసి ఈ చట్టం పునర్వ్యవస్థీకరణ చేసింది. అంటే విభజన. ఇది నిజానికి విభజన చట్టం.
- డాక్టర్ మాడభూషి శ్రీధర్
1956లో ఏర్పడిన విశాలాంధ్ర రాష్ట్రం 58 సంవత్సరాల ఒడుదుడుకుల జీవనం తరువాత విడిపోవడాన్ని ఆమోదిస్తూ 29వ రాష్ట్రంగా తెలంగాణాకు ఈ చట్టం జన్మనిచ్చింది. తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం, తెలుగు భాషా ప్రాతిపదికపైన 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. పెద్ద మనుషుల ఒప్పందం ఉల్లంఘన, అసమానతలు, భాశావమానాలు, నిధులు, నీళ్ళు, ఉద్యోగాలు, విద్యావకాశాల మళ్లింపు, తెలంగాణ పట్ల వివక్ష అనే కారణాలపైన సాగిన ఉద్యమాల ఫలితంగా ఈ చట్టం వచ్చింది. పార్లమెంటులో ఎన్నో ఉద్రిక్తల మధ్య ఆమోదం పొందిన చట్టం ఈ విభజన చట్టం.1956లో ఆంధ్రప్రదేశ్ అనే సమైక్య రాష్ట్రం కూడా ఆనాటి విభజనల మీద ఆధారపడినదే. హైదరాబాద్ రాష్ట్రాన్ని విభజించి మరాఠా ప్రాంతాలను, కన్నడ ప్రాంతాలను వేరు చేసిన తరువాత హైదరాబాద్ మిగిలింది. మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయిన ఆంద్ర రాష్ట్రం మిగిలింది. వీటి కలయికను సమైక్యం అన్నారు. సమైక్యత లేదని తేలిపోయిన తరువాత రెండు రాష్ట్రాలకు రూపకల్పన చేసి ఈ చట్టం పునర్వ్యవస్థీకరణ చేసింది. అంటే విభజన. ఇది నిజానికి విభజన చట్టం. - డాక్టర్ మాడభూషి శ్రీధర్
© 2017,www.logili.com All Rights Reserved.