Jatiya Pathaka RupaSilpi Pingali Venkaiah

By Dr Venna Vallabharao (Author)
Rs.100
Rs.100

Jatiya Pathaka RupaSilpi Pingali Venkaiah
INR
MANIMN3506
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

  1. భారత జాతీయ జెండా పరిణామం జాతీయ పతాకం స్వతంత్ర దేశానికి చిహ్నం. అది జాతి ఆత్మగౌరవానికి ప్రతీక. ప్రతి దేశానికి ప్రత్యేకమైన పతాకం ఉంటుంది. అది దేశంలో నివసించే జాతి ప్రజల ఆదర్శాలను ప్రతిబింబిస్తుంది. దేశ ప్రజలందరూ ఆ పతాకాన్ని తమ జాతికి ప్రతీకగా భావించి దాన్ని గౌరవిస్తారు, అవసరమైతే దాని ప్రతిష్ఠను కాపాడేందుకు తమ ప్రాణాలను సహితం త్యాగం చేస్తారు.

జాతీయ పతాకం జాతీయ భావాన్ని ప్రేరేపించేదిగా ఉంటుంది. దేశంలో ఎన్ని మతాలకు చెందిన

ప్రజలున్నా, విభిన్న ప్రాంతాలలో వారు నివసిస్తున్నా, రకరకాల భాషలు మాట్లాడుతున్నా - వారంతా సమష్టిగా జాతీయ పతాకాన్ని ఒకేలా ప్రేమించి ఆదరిస్తారు. దాని గౌరవాన్ని నిలబెట్టేందుకు కంకణబద్ధులై ఉంటారు.

జాతీయ పతాకం దేశభక్తిని పెంపొందించే సమర్థమైన సాధనం. అంతర్జాతీయ స్థాయిలో ఏ దేశమైనా జాతీయ పతాకం ద్వారానే గుర్తింపు పొందుతుంది.

జాతీయ పతాకం, జాతీయ గీతం,

జాతీయ భాష సర్వదా ప్రేమించి గౌరవించదగినవి. భారత దేశంపై ఆంగ్లేయుల పరిపాలన మొదలయ్యేటంతవరకూ మన దేశానికి ఒక జాతీయ పతాకం లేదు. గతంలో ఈ దేశాన్ని అనేక రాజవంశాలు పరిపాలించాయి. ప్రాచీన భారత దేశంలోని రాజవంశాల పతాకాల్లో మౌర్యుల 'గరుడ పతాకం, మొఘలాయుల 'ఆలమ్' ప్రసిద్ధంగా చెప్పుకోదగినవి. బ్రిటిష్ వాళ్ళు భారతావనిలో అడుగు పెట్టేనాటికి మన దేశంలో 565 సంస్థానాలు ఉండేవి. వాటన్నింటికీ వాటి వాటి పతాకాలో లేక రాజ్యచిహ్నాలో ఉండేవి. ఈ విధంగా ఈ విశాలమైన దేశంలో ఒకే సమయంలో వివిధ రకాల పతాకాలు మనుగడలో ఉండేవి. భారత దేశంలో వ్యాపించిన రాజకీయ అనైక్యతే ఇందుకు ప్రధాన కారణం. చరిత్రలో, సువిశాలమైన భారతావని ఎప్పుడైనా కొద్దికాలం పాటు ఒక్కటే సామ్రాజ్యంగా ఒకే ప్రభుత్వపు పరిపాలనలో ఉంటే, అత్యధిక తెలం చిన్నాచితకా రాజ్యాలుగా విభజింపబడి అనైక్యంగా ఉంటూ వచ్చింది. శ్రీ సామర్థ్యం, దూరదృష్టి గల రాజులు పరిపాలించిన కాలంలో మాత్రమే భారతావని ఒకే పరిపాలనలో ఉండేది. బలహీనులు, దూరదృష్టి లేని పరిపాలకులు పాలనలోకి రావటంతో దేశంలో ఐక్యత మటుమాయమైపోతూ |..............

భారత జాతీయ జెండా పరిణామం జాతీయ పతాకం స్వతంత్ర దేశానికి చిహ్నం. అది జాతి ఆత్మగౌరవానికి ప్రతీక. ప్రతి దేశానికి ప్రత్యేకమైన పతాకం ఉంటుంది. అది దేశంలో నివసించే జాతి ప్రజల ఆదర్శాలను ప్రతిబింబిస్తుంది. దేశ ప్రజలందరూ ఆ పతాకాన్ని తమ జాతికి ప్రతీకగా భావించి దాన్ని గౌరవిస్తారు, అవసరమైతే దాని ప్రతిష్ఠను కాపాడేందుకు తమ ప్రాణాలను సహితం త్యాగం చేస్తారు. జాతీయ పతాకం జాతీయ భావాన్ని ప్రేరేపించేదిగా ఉంటుంది. దేశంలో ఎన్ని మతాలకు చెందిన ప్రజలున్నా, విభిన్న ప్రాంతాలలో వారు నివసిస్తున్నా, రకరకాల భాషలు మాట్లాడుతున్నా - వారంతా సమష్టిగా జాతీయ పతాకాన్ని ఒకేలా ప్రేమించి ఆదరిస్తారు. దాని గౌరవాన్ని నిలబెట్టేందుకు కంకణబద్ధులై ఉంటారు. జాతీయ పతాకం దేశభక్తిని పెంపొందించే సమర్థమైన సాధనం. అంతర్జాతీయ స్థాయిలో ఏ దేశమైనా జాతీయ పతాకం ద్వారానే గుర్తింపు పొందుతుంది. జాతీయ పతాకం, జాతీయ గీతం, జాతీయ భాష సర్వదా ప్రేమించి గౌరవించదగినవి. భారత దేశంపై ఆంగ్లేయుల పరిపాలన మొదలయ్యేటంతవరకూ మన దేశానికి ఒక జాతీయ పతాకం లేదు. గతంలో ఈ దేశాన్ని అనేక రాజవంశాలు పరిపాలించాయి. ప్రాచీన భారత దేశంలోని రాజవంశాల పతాకాల్లో మౌర్యుల 'గరుడ పతాకం, మొఘలాయుల 'ఆలమ్' ప్రసిద్ధంగా చెప్పుకోదగినవి. బ్రిటిష్ వాళ్ళు భారతావనిలో అడుగు పెట్టేనాటికి మన దేశంలో 565 సంస్థానాలు ఉండేవి. వాటన్నింటికీ వాటి వాటి పతాకాలో లేక రాజ్యచిహ్నాలో ఉండేవి. ఈ విధంగా ఈ విశాలమైన దేశంలో ఒకే సమయంలో వివిధ రకాల పతాకాలు మనుగడలో ఉండేవి. భారత దేశంలో వ్యాపించిన రాజకీయ అనైక్యతే ఇందుకు ప్రధాన కారణం. చరిత్రలో, సువిశాలమైన భారతావని ఎప్పుడైనా కొద్దికాలం పాటు ఒక్కటే సామ్రాజ్యంగా ఒకే ప్రభుత్వపు పరిపాలనలో ఉంటే, అత్యధిక తెలం చిన్నాచితకా రాజ్యాలుగా విభజింపబడి అనైక్యంగా ఉంటూ వచ్చింది. శ్రీ సామర్థ్యం, దూరదృష్టి గల రాజులు పరిపాలించిన కాలంలో మాత్రమే భారతావని ఒకే పరిపాలనలో ఉండేది. బలహీనులు, దూరదృష్టి లేని పరిపాలకులు పాలనలోకి రావటంతో దేశంలో ఐక్యత మటుమాయమైపోతూ |..............

Features

  • : Jatiya Pathaka RupaSilpi Pingali Venkaiah
  • : Dr Venna Vallabharao
  • : chinuku Publications
  • : MANIMN3506
  • : Paperback
  • : July, 2016 First Edition
  • : 132
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Jatiya Pathaka RupaSilpi Pingali Venkaiah

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam