స్త్రీలు, శ్రామికులు అణచివేతకు గురికావటం సర్వసాధారణ విషయంగా నిలచి వున్నది. వివిధ కాలాల్లో విభిన్న దేశాల్లో ఈ అణచివేత వేర్వేరు రూపాలలో ఉండవచ్చు.. కానీ అణచివేత మాత్రం అలాగేవుంది. చారిత్రక అభివృద్ధి క్రమంలో అణగారిన వారు ఈ అణచివేతను చాలాసార్లు గుర్తించారు. అలా గుర్తించటంవల్ల వారి స్థితిగతులు మెరుగుపడే అవకాశం కలిగింది. కానీ ఈ అణచివేతకు మూల కారణాలను గుర్తించే పని ఇవాల్టికీ ఇంకా మిగిలేవుంది. స్త్రీ విషయంలోనూ, శ్రామికుని విషయంలోనూ ఈ మూలకారణాల గుర్తింపు ఇప్పటికీ జరగలేదు. సమాజంయొక్క నిజ స్వభావాన్నీ, సామాజిక పరిణామాన్నీ నిర్దేశించే సూత్రాలను ముందుగా అర్ధం చేసుకున్న తర్వాతనే అన్యాయమైన పరిస్థితులను రూపుమాపటం కోసం తగిన ఉద్యమాన్ని అభివృద్ధి చేయగలుగుతాం. కానీ, అలాంటి ఉద్యమం జరగటమనేది ఈ అన్యాయమైన పరిస్థితికి గురవుతున్న వారిలో తమ అణచివేత గురించిన ఆలోచన, అవగాహన ఎంత ఉన్నది, దానిని పోగొట్టేందుకు తగిన కార్యక్రమాలు చేసే స్వేచ్ఛ ఎంత ఉన్నది అనే దానిమీద ఆధారపడి ఉంటుంది. ఈ రెండు విషయాలలో కార్మికుడికంటే స్త్రీ వెనకబడి వుంది. సంప్రదాయ విద్య, స్వేచ్ఛ లేకపోవటం అనేవి ఆ వెనకబాటుతనానికి కారణం. అంతేగాక తరతరాలుగా నిల్చివున్న పరిస్థితులు చివరికి ఒక అలవాటుగా మారిపోతాయి. వారసత్వం, విద్య ఈ పరిస్థితులను వారికి సహజమైనవిగా కనపడేలా చేస్తాయి. దీనినిబట్టి స్త్రీలు తాము తక్కువవారమనే విషయాన్ని సహజంగా ఎలా తీసుకుంటారో, అది తమకు ఉచితం కాదని ఎలా గుర్తించకుండా ఉండిపోతారో,........................ఆదిమ సమాజంలో స్త్రీ స్ధానం
ఆదిమ చరిత్రలో ముఖ్య ఘట్టాలు
స్త్రీలు, శ్రామికులు అణచివేతకు గురికావటం సర్వసాధారణ విషయంగా నిలచి వున్నది. వివిధ కాలాల్లో విభిన్న దేశాల్లో ఈ అణచివేత వేర్వేరు రూపాలలో ఉండవచ్చు.. కానీ అణచివేత మాత్రం అలాగేవుంది. చారిత్రక అభివృద్ధి క్రమంలో అణగారిన వారు ఈ అణచివేతను చాలాసార్లు గుర్తించారు. అలా గుర్తించటంవల్ల వారి స్థితిగతులు మెరుగుపడే అవకాశం కలిగింది. కానీ ఈ అణచివేతకు మూల కారణాలను గుర్తించే పని ఇవాల్టికీ ఇంకా మిగిలేవుంది. స్త్రీ విషయంలోనూ, శ్రామికుని విషయంలోనూ ఈ మూలకారణాల గుర్తింపు ఇప్పటికీ జరగలేదు. సమాజంయొక్క నిజ స్వభావాన్నీ, సామాజిక పరిణామాన్నీ నిర్దేశించే సూత్రాలను ముందుగా అర్ధం చేసుకున్న తర్వాతనే అన్యాయమైన పరిస్థితులను రూపుమాపటం కోసం తగిన ఉద్యమాన్ని అభివృద్ధి చేయగలుగుతాం. కానీ, అలాంటి ఉద్యమం జరగటమనేది ఈ అన్యాయమైన పరిస్థితికి గురవుతున్న వారిలో తమ అణచివేత గురించిన ఆలోచన, అవగాహన ఎంత ఉన్నది, దానిని పోగొట్టేందుకు తగిన కార్యక్రమాలు చేసే స్వేచ్ఛ ఎంత ఉన్నది అనే దానిమీద ఆధారపడి ఉంటుంది. ఈ రెండు విషయాలలో కార్మికుడికంటే స్త్రీ వెనకబడి వుంది. సంప్రదాయ విద్య, స్వేచ్ఛ లేకపోవటం అనేవి ఆ వెనకబాటుతనానికి కారణం. అంతేగాక తరతరాలుగా నిల్చివున్న పరిస్థితులు చివరికి ఒక అలవాటుగా మారిపోతాయి. వారసత్వం, విద్య ఈ పరిస్థితులను వారికి సహజమైనవిగా కనపడేలా చేస్తాయి. దీనినిబట్టి స్త్రీలు తాము తక్కువవారమనే విషయాన్ని సహజంగా ఎలా తీసుకుంటారో, అది తమకు ఉచితం కాదని ఎలా గుర్తించకుండా ఉండిపోతారో,........................