"యాత్రనార్యస్తు పూజ్యంతే రమంతే తత్రదేవతాః యత్రై తాస్తు నపూజ్యంతే సర్వాస్తత్రీ ఫలాఃక్రియా": ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అచట దేవతలు ప్రీతి చెందుతారు. ఎచట గౌరవించబడరో అచ్చట చేసే సర్వ కార్యాలు నిష్ఫలమౌతాయని భావం. ఇది సనాతనభావన.
'ఆధునిక మహిళలు భారతదేశ చరిత్ర తిరగరాస్తారు' ఇది గురజాడ వారి ఆధునిక దృష్టి. స్త్రీ వ్యక్తికాదు శక్తి "మన జాతి ఇంతగా దిగజారిపోవడానికి కారణం శక్తి స్వరూపిణులయిన స్త్రీలను గౌరవించకపోవడమే" అన్నారు స్వామి వివేకానంద. వేదకాలంలో స్త్రీలు బ్రహ్మవాదినులుగా, మంత్రం ద్రష్టలుగా ప్రసిద్ధులయ్యారని కొన్ని దృష్టాంతాలు చూపుతున్నా మధ్యయుగాల నాటికి స్త్రీల పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి. పితృస్వామ్య సమాజంలోని కట్టుబాట్ల కారణంగా స్త్రీ భావదాస్యానికి గురయి సమాజం శాసించిన విలువల చట్రాలలో బిగించబడింది. తన శరీర ధర్మాలవల్ల, సమాజ ధర్మాలవల్ల అణచివేతకు గురైంది.
సాంఘిక సేవా రంగాల్లోనూ నిరంతర కృషి సాగించిన కార్యదీక్షాదక్షులైన తెలుగు మహిళలెందరో కనిపిస్తారు. వారి మేధోవిశిష్టత, శిల్ప చాతుర్యం, ప్రాబోధికత, జ్ఞానదీప్తి, సేవాస్ఫూర్తి, దేశభక్తీ, త్యాగనిరతి, స్వయంకృషి, ఆత్మావిశ్వాసం ఇలా ఏదో ఒక పరమార్థ మానవ ధర్మం వెలుగు చిమ్మిన తెలుగువనితల జీవితరేఖా చిత్ర సంచయనిక ఇది.
"యాత్రనార్యస్తు పూజ్యంతే రమంతే తత్రదేవతాః యత్రై తాస్తు నపూజ్యంతే సర్వాస్తత్రీ ఫలాఃక్రియా": ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అచట దేవతలు ప్రీతి చెందుతారు. ఎచట గౌరవించబడరో అచ్చట చేసే సర్వ కార్యాలు నిష్ఫలమౌతాయని భావం. ఇది సనాతనభావన. 'ఆధునిక మహిళలు భారతదేశ చరిత్ర తిరగరాస్తారు' ఇది గురజాడ వారి ఆధునిక దృష్టి. స్త్రీ వ్యక్తికాదు శక్తి "మన జాతి ఇంతగా దిగజారిపోవడానికి కారణం శక్తి స్వరూపిణులయిన స్త్రీలను గౌరవించకపోవడమే" అన్నారు స్వామి వివేకానంద. వేదకాలంలో స్త్రీలు బ్రహ్మవాదినులుగా, మంత్రం ద్రష్టలుగా ప్రసిద్ధులయ్యారని కొన్ని దృష్టాంతాలు చూపుతున్నా మధ్యయుగాల నాటికి స్త్రీల పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి. పితృస్వామ్య సమాజంలోని కట్టుబాట్ల కారణంగా స్త్రీ భావదాస్యానికి గురయి సమాజం శాసించిన విలువల చట్రాలలో బిగించబడింది. తన శరీర ధర్మాలవల్ల, సమాజ ధర్మాలవల్ల అణచివేతకు గురైంది. సాంఘిక సేవా రంగాల్లోనూ నిరంతర కృషి సాగించిన కార్యదీక్షాదక్షులైన తెలుగు మహిళలెందరో కనిపిస్తారు. వారి మేధోవిశిష్టత, శిల్ప చాతుర్యం, ప్రాబోధికత, జ్ఞానదీప్తి, సేవాస్ఫూర్తి, దేశభక్తీ, త్యాగనిరతి, స్వయంకృషి, ఆత్మావిశ్వాసం ఇలా ఏదో ఒక పరమార్థ మానవ ధర్మం వెలుగు చిమ్మిన తెలుగువనితల జీవితరేఖా చిత్ర సంచయనిక ఇది.© 2017,www.logili.com All Rights Reserved.