ఫీల్డ్ వర్కర్ తో తొలి పరిచయం
2002లో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ పేదరిక నిర్మూలన ప్రాజెక్టులో చేరిన తర్వాత శిక్షణలో భాగంగా ఇండక్షన్ ప్రోగ్రాం ప్రారంభమైంది. ఈ ప్రాజెక్టు మా గుంటూరు జిల్లాలో మొదలుకావడానికి చాలా ముందుగా డిస్ట్రిక్ట్ పావర్టీ ఇనీషియేటివ్స్ ప్రాజెక్ట్స్ (DPIP) పేరుతో ఆరు జిల్లాలలో పైలట్ ప్రాజెక్టుగా అమలయింది. 2002లో దానిని మరో 16 జిల్లాలకు విస్తరించారు. ఆ జిల్లాలలో కూడా కొన్ని మండలాలను మాత్రమే ప్రాజెక్ట్ పరిధిలోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లాలో 22 మండలాలు (మొత్తం 58 మండలాలకు గాను) మాత్రమే ప్రాజెక్ట్ కింద ఉన్నాయి.
ప్రతి మండలానికి ఇద్దరు లేదా ముగ్గురు కమ్యూనిటీ కోఆర్డినేటర్ల చొప్పున ఎంపిక చేశారు. మేమంతా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసామే తప్ప సోషల్ వర్క్ శిక్షణ పొందిన వాళ్లం కాదు. కాబట్టి మాకు పని చేయడానికి తగిన శిక్షణ ఇవ్వడం ఎంతో కీలకం. అందుకోసం మమ్మల్ని DPIP జిల్లాలకు ఇండక్షన్కు పంపారు. అక్కడ అప్పటికే పనిచేస్తున్న కమ్యూనిటీ కోఆర్డినేటర్లతో కలిసి కొన్ని రోజుల పాటు గడపడం వలన ఆ పని పరిధి, పరిమితులు, విధి విధానాలు అర్ధం చేసుకుంటామని వారి ఉద్దేశం.
మమ్మల్ని బృందాలుగా విభజించి వివిధ జిల్లాలకు పంపారు. మా బృందం శ్రీకాకుళం జిల్లాకు వెళ్ళాలి. నేను కవిటి మండలంలో కోఆర్డినేటరుగా పని చేస్తున్న గ్రేస్ ను కలవాలి.
గ్రేస్ చాలా చురుకైన అమ్మాయి. నేను కవిటిలో బస్సు దిగేసరికి అక్కడ నన్ను ఆమె రిసీవ్ చేసుకుని ఒక ఊరికి తీసుకు వెళ్ళింది. ఒక్కొక్క మండలానికి...........................
ఫీల్డ్ వర్కర్ తో తొలి పరిచయం 2002లో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ పేదరిక నిర్మూలన ప్రాజెక్టులో చేరిన తర్వాత శిక్షణలో భాగంగా ఇండక్షన్ ప్రోగ్రాం ప్రారంభమైంది. ఈ ప్రాజెక్టు మా గుంటూరు జిల్లాలో మొదలుకావడానికి చాలా ముందుగా డిస్ట్రిక్ట్ పావర్టీ ఇనీషియేటివ్స్ ప్రాజెక్ట్స్ (DPIP) పేరుతో ఆరు జిల్లాలలో పైలట్ ప్రాజెక్టుగా అమలయింది. 2002లో దానిని మరో 16 జిల్లాలకు విస్తరించారు. ఆ జిల్లాలలో కూడా కొన్ని మండలాలను మాత్రమే ప్రాజెక్ట్ పరిధిలోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లాలో 22 మండలాలు (మొత్తం 58 మండలాలకు గాను) మాత్రమే ప్రాజెక్ట్ కింద ఉన్నాయి. ప్రతి మండలానికి ఇద్దరు లేదా ముగ్గురు కమ్యూనిటీ కోఆర్డినేటర్ల చొప్పున ఎంపిక చేశారు. మేమంతా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసామే తప్ప సోషల్ వర్క్ శిక్షణ పొందిన వాళ్లం కాదు. కాబట్టి మాకు పని చేయడానికి తగిన శిక్షణ ఇవ్వడం ఎంతో కీలకం. అందుకోసం మమ్మల్ని DPIP జిల్లాలకు ఇండక్షన్కు పంపారు. అక్కడ అప్పటికే పనిచేస్తున్న కమ్యూనిటీ కోఆర్డినేటర్లతో కలిసి కొన్ని రోజుల పాటు గడపడం వలన ఆ పని పరిధి, పరిమితులు, విధి విధానాలు అర్ధం చేసుకుంటామని వారి ఉద్దేశం. మమ్మల్ని బృందాలుగా విభజించి వివిధ జిల్లాలకు పంపారు. మా బృందం శ్రీకాకుళం జిల్లాకు వెళ్ళాలి. నేను కవిటి మండలంలో కోఆర్డినేటరుగా పని చేస్తున్న గ్రేస్ ను కలవాలి. గ్రేస్ చాలా చురుకైన అమ్మాయి. నేను కవిటిలో బస్సు దిగేసరికి అక్కడ నన్ను ఆమె రిసీవ్ చేసుకుని ఒక ఊరికి తీసుకు వెళ్ళింది. ఒక్కొక్క మండలానికి...........................© 2017,www.logili.com All Rights Reserved.