ఆధునిక సాహిత్యోద్యమాలలో స్త్రీ వాదం ఒకటి. పురుషాధిక్యత నశించాలనీ, పెళ్లి స్వేచ్చాయుత జీవితానికి అవరోధమనీ, స్త్రీని పనిమనిషిగా చూస్తున్నారనీ 'స్త్రీవాద సాహిత్యం' ప్రకటిస్తుంది. స్త్రీవాదంలోని అవాంఛనీయాల్ని, అందులో గల వైరుధ్యాల్నీ విడమరచి చెప్తూ సింహప్రసాద్ రాసిన నవల 'ఒక ఆడ + ఒక మగ'. ఈ శీర్షికే ఔచిత్యభరితంగా ఉంది. ఆడ, మగల మధ్య ఎటువంటి సంబంధాలుండాలో కనువిప్పు కలిగిస్తుందీ నవల.
అసలు స్త్రీ ఎలా ఉండాలి? స్వేచ్చకి పరిమితులు లేవా? పెళ్లి జైలు ఎలా అవుతుంది? సమాజం పెళ్లి లేని సహజీవనాన్ని ఆదరిస్తుండా? సమాజంలో ఉంటూ ఉష్ట్ర పక్షిలా సమాజాన్ని పట్టించుకోను అంటే సంఘజీవి ఎలా అవుతారు? విచ్చలవిడితనం సమర్ధనీయమా?.
పాశ్చాత్యులు మన వివాహ వ్యవస్థ పట్ల ఆకర్షితులై మన సంప్రదాయం ప్రకారం పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. 'యువర్ ఫాదర్ అండ్ హిజ్ ఫాదర్ ఈజ్ మై ఫాదర్' వంటి సమాజాన్ని కోరుకోవచ్చా? సంసారంలోని చిన్న సమస్యల్ని 'కోతిపుండు బ్రహ్మ రాక్షసి' లా చేసుకొని సుఖాన్ని పోగొట్టుకోవటమా? ఇద్దరూ స్నేహభావంతో సర్దుకుపోయి 'ఎంత మధురమీ హాయి' అనుకోవటం అవమానంగా భావించాలా? ఇటువంటి ప్రశ్నలకి సమాధానమే 'ఒక ఆడ + ఒక మగ'.
స్త్రీ వాదులు ఈ నవలను తప్పకుండా చదివి స్పందిస్తే మంచిది. ఈ నవల సమకాలీన సందేశాత్మక నవల!!
- ద్వా నా శాస్త్రి
ఆధునిక సాహిత్యోద్యమాలలో స్త్రీ వాదం ఒకటి. పురుషాధిక్యత నశించాలనీ, పెళ్లి స్వేచ్చాయుత జీవితానికి అవరోధమనీ, స్త్రీని పనిమనిషిగా చూస్తున్నారనీ 'స్త్రీవాద సాహిత్యం' ప్రకటిస్తుంది. స్త్రీవాదంలోని అవాంఛనీయాల్ని, అందులో గల వైరుధ్యాల్నీ విడమరచి చెప్తూ సింహప్రసాద్ రాసిన నవల 'ఒక ఆడ + ఒక మగ'. ఈ శీర్షికే ఔచిత్యభరితంగా ఉంది. ఆడ, మగల మధ్య ఎటువంటి సంబంధాలుండాలో కనువిప్పు కలిగిస్తుందీ నవల. అసలు స్త్రీ ఎలా ఉండాలి? స్వేచ్చకి పరిమితులు లేవా? పెళ్లి జైలు ఎలా అవుతుంది? సమాజం పెళ్లి లేని సహజీవనాన్ని ఆదరిస్తుండా? సమాజంలో ఉంటూ ఉష్ట్ర పక్షిలా సమాజాన్ని పట్టించుకోను అంటే సంఘజీవి ఎలా అవుతారు? విచ్చలవిడితనం సమర్ధనీయమా?. పాశ్చాత్యులు మన వివాహ వ్యవస్థ పట్ల ఆకర్షితులై మన సంప్రదాయం ప్రకారం పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. 'యువర్ ఫాదర్ అండ్ హిజ్ ఫాదర్ ఈజ్ మై ఫాదర్' వంటి సమాజాన్ని కోరుకోవచ్చా? సంసారంలోని చిన్న సమస్యల్ని 'కోతిపుండు బ్రహ్మ రాక్షసి' లా చేసుకొని సుఖాన్ని పోగొట్టుకోవటమా? ఇద్దరూ స్నేహభావంతో సర్దుకుపోయి 'ఎంత మధురమీ హాయి' అనుకోవటం అవమానంగా భావించాలా? ఇటువంటి ప్రశ్నలకి సమాధానమే 'ఒక ఆడ + ఒక మగ'. స్త్రీ వాదులు ఈ నవలను తప్పకుండా చదివి స్పందిస్తే మంచిది. ఈ నవల సమకాలీన సందేశాత్మక నవల!! - ద్వా నా శాస్త్రి© 2017,www.logili.com All Rights Reserved.