ఈనాటి ప్రపంచంలో ఎక్కడచూచినా కనిపించేది అవినీతి, అరాచకత్వమునూ! సామాన్యునిలో, నిరాశ, నిస్పృహ జీవితంలో అడుగడుగునా సంఘర్షణలతో నిండివుంది! మనిషి ఎందుకు జీవిస్తున్నాడో తెలియని అయోమయంలో జీవితాన్నే నెట్టుకొస్తున్న వైనమూ కనిపిస్తూంది. దీనికి ప్రధానంగా కనిపించే కారణం రాజకీయవ్యాపారుల పురోగమనం.
రాజకీయమనేది పాలన నిమిత్తమైంది - సేవాభావంతో కూడుకొన్నది కాక, కేవలం వ్యాపారంకన్నా పరమహీనంగా తయారై వుండటం చూస్తున్నాము. ఇది అగ్రస్థానంలో వున్న వారికే పట్టిన కాలదోషమనిపిస్తుంది.
అగ్రస్థానంలో ఉన్నవారి నుండి సామాన్య మానవుని వరకూ గల మానవతా శాతం, మానవత్వపు విలువ బాగా తగ్గిపోయింది. అంటే మనుషుల నాణ్యతే దిగజారి పోయిందన్నమాట.
- డా. వేదవ్యాస
ఇవే యోగమిత్రులందరికీ, పాఠకులకూ, నా మంగళాశాసనములు!