చిన్నయసూరి గొప్పపండితుడు. వ్యాకరణశాస్ర్తజ్ఞాడు. నేటికీ ప్రాచీన తెలుగు సాహిత్యభాషకు వచ్చిన వ్యాకరణాలలో బాలవ్యాకరణానికి బాలవ్యాకరణమే సాటి. ఇందులో సందేహం లేదు. పది పరిచ్చేదాలతో, 465 సూత్రాలతో కూడుకొని ఉన్న ఈ రచనలోని సూత్రాలను, ఉదాహరణలను గూర్చి ఇంతకుముందున్న వ్యాఖ్యాన కారులు ఎన్నోరకాలుగా కీర్తించారు. అవి నూటికి నూరుపాళ్ళు యదార్ధమైన పొగడ్తలే. అయినా ఇన్నిసూత్రాల్లో ఎక్కడా లోపంలేదా అనే కాంక్షతో పరిశీలిస్తూ చదివితే ఏవో కొన్ని చిన్నపాటివి లాభిస్తాయి. వంట రుచిగా ఉన్నదా! లేదా! అవి చెప్పటానికి వంటచేయటం రావాల్సిన అవసరం లేదుగదా! తినగలిగే ఆసక్తి ఉంటేచాలు. కాబట్టి ఈ వ్యాఖ్యానంలో వ్యాకర్త గొప్పదనాన్ని చూపిస్తూనే, ఎక్కడైనా లోపంగా నాకు అనిపిస్తే దాచకుండా ఆ లోపాన్ని చూపించే ధైర్యం చేశాను. అంతమాత్రాన నేను గోప్పపండితున్ననే భావం కాదు. ఆసక్తితో చదివిన పాఠకున్నని భావం. ఇరువై ఐదు సంవత్సరాలుగా తరగతిగదిలో ఈ వ్యాకరణాన్ని భోదించటం వల్ల - విద్యార్ధుల ఆలోచనలు, వారి ప్రశ్నలు, వానికి సమాధానాలు, విటన్నింటినీ కలగలిపిన సారాంశం ఈ వ్యాఖ్యానం ప్రధానంగా విద్యార్ధులను ఉద్దేశించి ఇది వ్రాయటం జరిగింది. అందుకే "కరదీపికావ్యాఖ్యాన" మని నామకరణం చేశాను. కాబట్టి విద్యార్ధిలోకానికి ఏ మాత్రం ఉపయోగపడినా, నా శ్రమ ఫలించిందని భావిస్తాను.
డా" ఆలేటి మోహన్ రెడ్డి
చిన్నయసూరి గొప్పపండితుడు. వ్యాకరణశాస్ర్తజ్ఞాడు. నేటికీ ప్రాచీన తెలుగు సాహిత్యభాషకు వచ్చిన వ్యాకరణాలలో బాలవ్యాకరణానికి బాలవ్యాకరణమే సాటి. ఇందులో సందేహం లేదు. పది పరిచ్చేదాలతో, 465 సూత్రాలతో కూడుకొని ఉన్న ఈ రచనలోని సూత్రాలను, ఉదాహరణలను గూర్చి ఇంతకుముందున్న వ్యాఖ్యాన కారులు ఎన్నోరకాలుగా కీర్తించారు. అవి నూటికి నూరుపాళ్ళు యదార్ధమైన పొగడ్తలే. అయినా ఇన్నిసూత్రాల్లో ఎక్కడా లోపంలేదా అనే కాంక్షతో పరిశీలిస్తూ చదివితే ఏవో కొన్ని చిన్నపాటివి లాభిస్తాయి. వంట రుచిగా ఉన్నదా! లేదా! అవి చెప్పటానికి వంటచేయటం రావాల్సిన అవసరం లేదుగదా! తినగలిగే ఆసక్తి ఉంటేచాలు. కాబట్టి ఈ వ్యాఖ్యానంలో వ్యాకర్త గొప్పదనాన్ని చూపిస్తూనే, ఎక్కడైనా లోపంగా నాకు అనిపిస్తే దాచకుండా ఆ లోపాన్ని చూపించే ధైర్యం చేశాను. అంతమాత్రాన నేను గోప్పపండితున్ననే భావం కాదు. ఆసక్తితో చదివిన పాఠకున్నని భావం. ఇరువై ఐదు సంవత్సరాలుగా తరగతిగదిలో ఈ వ్యాకరణాన్ని భోదించటం వల్ల - విద్యార్ధుల ఆలోచనలు, వారి ప్రశ్నలు, వానికి సమాధానాలు, విటన్నింటినీ కలగలిపిన సారాంశం ఈ వ్యాఖ్యానం ప్రధానంగా విద్యార్ధులను ఉద్దేశించి ఇది వ్రాయటం జరిగింది. అందుకే "కరదీపికావ్యాఖ్యాన" మని నామకరణం చేశాను. కాబట్టి విద్యార్ధిలోకానికి ఏ మాత్రం ఉపయోగపడినా, నా శ్రమ ఫలించిందని భావిస్తాను. డా" ఆలేటి మోహన్ రెడ్డి
© 2017,www.logili.com All Rights Reserved.