ప్రపంచ భాషల్లో సంస్కృతం విశిష్టమైన భాష. ప్రస్తుతం సంస్కృతం మాతృభాషగా వ్యవహరించే సమాజం మనదేశంలో లేనప్పటికీ భారతీయులందరికీ సంస్కృత భాషతో నిత్యవ్యవహారంలో సంబంధం ఉండనే ఉంటుంది. కొన్ని వేల సంవత్సరాల క్రమంలో మన పూర్వులు సంపాదించిన విజ్ఞానం, సాహిత్యం సంస్కృతంలోనే ప్రోది చేయబడి ఉండడం వల్ల సంస్కృతాన్ని నేర్చుకోవలసిన ఆవశ్యకత ఉంది. మత, ఆధ్యాత్మిక పరమైన కర్మకాండ, ఆచార వ్యవహారాలూ సంస్కృతంలోనే నిర్వహించుకుంటున్నాం. అయితే దీని వినియోగం ఇంతవరకే అనుకుంటే పొరపాటే. అపారమైన శాస్త్రవిజ్ఞానం కూడా, నేటికీ మనకు అవసరమైనది సంస్కృత భాషలోనే ఉన్నందున కూడా మనం సంస్కృతాన్ని అభ్యసించవలసిన ఆవశ్యకత ఉంది.
సంస్కృత భాషాభిమానులకు, కళాశాలలో మార్కుల కోసం సంస్కృతం తీసుకుని కొంత సంస్కృత పరిచయం పొంది దానిలో మరింత అవగాహనం పెంచుకుందామనుకునే వారికి ఈ గ్రంథం అనేక విధాలుగా తోడ్పడుతుంది. దీనిలో సంగ్రహంగా వ్యాకరణం, ఛందస్సు, అలంకారాలు, అలంకార శాస్త్రం తెలిపిన అభిధాదివృత్తులు, రీతులు, పాకాలు, కావ్యాలు, నాయకులూ, నాయికలు, రసాలు, గుణ దోషాలు ఉన్నాయి.
ప్రపంచ భాషల్లో సంస్కృతం విశిష్టమైన భాష. ప్రస్తుతం సంస్కృతం మాతృభాషగా వ్యవహరించే సమాజం మనదేశంలో లేనప్పటికీ భారతీయులందరికీ సంస్కృత భాషతో నిత్యవ్యవహారంలో సంబంధం ఉండనే ఉంటుంది. కొన్ని వేల సంవత్సరాల క్రమంలో మన పూర్వులు సంపాదించిన విజ్ఞానం, సాహిత్యం సంస్కృతంలోనే ప్రోది చేయబడి ఉండడం వల్ల సంస్కృతాన్ని నేర్చుకోవలసిన ఆవశ్యకత ఉంది. మత, ఆధ్యాత్మిక పరమైన కర్మకాండ, ఆచార వ్యవహారాలూ సంస్కృతంలోనే నిర్వహించుకుంటున్నాం. అయితే దీని వినియోగం ఇంతవరకే అనుకుంటే పొరపాటే. అపారమైన శాస్త్రవిజ్ఞానం కూడా, నేటికీ మనకు అవసరమైనది సంస్కృత భాషలోనే ఉన్నందున కూడా మనం సంస్కృతాన్ని అభ్యసించవలసిన ఆవశ్యకత ఉంది. సంస్కృత భాషాభిమానులకు, కళాశాలలో మార్కుల కోసం సంస్కృతం తీసుకుని కొంత సంస్కృత పరిచయం పొంది దానిలో మరింత అవగాహనం పెంచుకుందామనుకునే వారికి ఈ గ్రంథం అనేక విధాలుగా తోడ్పడుతుంది. దీనిలో సంగ్రహంగా వ్యాకరణం, ఛందస్సు, అలంకారాలు, అలంకార శాస్త్రం తెలిపిన అభిధాదివృత్తులు, రీతులు, పాకాలు, కావ్యాలు, నాయకులూ, నాయికలు, రసాలు, గుణ దోషాలు ఉన్నాయి.© 2017,www.logili.com All Rights Reserved.