శ్రీ మల్లాది నరసింహమూర్తిగారు అచ్చతెలుగులో వ్రాసిన భారతీయ గణితశాస్త్రజ్ఞులు అను పరిశోధనాత్మక గ్రంథము గణితశాస్త్రాభిలాష కలిగిన వారికి ఒక నిఘంటువు వంటిది. వారు విషయమును ప్రస్తావించిన తీరు చాలా బాగున్నది. 100 మంది గణితాచార్యులను గూర్చి వారు సేకరించిన సమాచారము గణితశాస్త్ర పరిశోధకులకు ఎంతయో ఉపయోగకరము. భారతదేశమందలి అని ప్రాంతములకు సంబంధించిన గణితశాస్త్రజ్ఞులు జనన మరణములు, వారి జన్మస్థానములు వివాదంశములుగానే ఉన్నవి. భారతీయులు కీర్తికాముకులు కారు. పేరుప్రఖ్యాతుల కొరకు వారెన్నడు పాకులాడలేదు. అంతేకాక ఈ రోజు పైధాగరస్ సిద్ధాంతముగా పెర్కొనబడుచున్న కర్ణవర్గ సిద్ధాంతపు రూపకర్త ఎవరు? అని ప్రశ్నించుకొనినపుదు భాస్కరుడు, బోధాయనుడు, ఆపస్తంబుడు మొదలగు గణితశాస్త్రజ్ఞులందరు, ఆ సిద్ధాంతమును తామే ప్రతిపాదించినట్లు చెప్పలేదు. అయితే ప్రతిఒక్కరు ‘మా పూర్వీకులు మాకందించిన పరిజ్ఞానము ప్రకారము, తాము ఆ సిద్ధాంతమునకు నిరూపణ వ్రాసినాము’ అన్నారు.
శ్రీ మల్లాది నరసింహమూర్తిగారు అచ్చతెలుగులో వ్రాసిన భారతీయ గణితశాస్త్రజ్ఞులు అను పరిశోధనాత్మక గ్రంథము గణితశాస్త్రాభిలాష కలిగిన వారికి ఒక నిఘంటువు వంటిది. వారు విషయమును ప్రస్తావించిన తీరు చాలా బాగున్నది. 100 మంది గణితాచార్యులను గూర్చి వారు సేకరించిన సమాచారము గణితశాస్త్ర పరిశోధకులకు ఎంతయో ఉపయోగకరము. భారతదేశమందలి అని ప్రాంతములకు సంబంధించిన గణితశాస్త్రజ్ఞులు జనన మరణములు, వారి జన్మస్థానములు వివాదంశములుగానే ఉన్నవి. భారతీయులు కీర్తికాముకులు కారు. పేరుప్రఖ్యాతుల కొరకు వారెన్నడు పాకులాడలేదు. అంతేకాక ఈ రోజు పైధాగరస్ సిద్ధాంతముగా పెర్కొనబడుచున్న కర్ణవర్గ సిద్ధాంతపు రూపకర్త ఎవరు? అని ప్రశ్నించుకొనినపుదు భాస్కరుడు, బోధాయనుడు, ఆపస్తంబుడు మొదలగు గణితశాస్త్రజ్ఞులందరు, ఆ సిద్ధాంతమును తామే ప్రతిపాదించినట్లు చెప్పలేదు. అయితే ప్రతిఒక్కరు ‘మా పూర్వీకులు మాకందించిన పరిజ్ఞానము ప్రకారము, తాము ఆ సిద్ధాంతమునకు నిరూపణ వ్రాసినాము’ అన్నారు.© 2017,www.logili.com All Rights Reserved.