అవి 18వ శతాబ్దపు చివరి రోజులు. తమిళనాడులోని తంజావూరు జిల్లాలో కుంభకోణం పట్టణంలో శ్రీనివాస అయ్యంగారు ఒక చిన్న బట్టలకొట్టులో గుమాస్తాగా పనిచేస్తుండేవారు. ఈయనకు నెలకు ఇరవై రూపాయలు జీతంగా ఇచ్చేవారు. శ్రీనివాస అయ్యంగారి భార్య పేరు కొమలత్తమ్మాళ్. వచ్చే జీతంతో ఇల్లుగడవటం కష్టంగా ఉండటంవల్ల, ఆమె ఇద్దరు విద్యార్థులకు అన్నం వండిపెట్టి వారివద్ద కొంత డబ్బు వసూలు చేసేది. ఈ విధంగా చేయటం వల్ల వేడినీల్లకు చన్నీళ్ళు తోడైనట్లుగా ఇంకో ఇరవై రూపాయలు అదనపు ఆదాయం వస్తూండేది.
1887 సంవత్సరంలో శ్రీనివాస అయ్యంగార్ దంపతులకు ఒక పుత్రుడు జన్మించాడు. ఇతడే మన నవలా కథానాయకుడు. ఇతని పేరు శ్రీనివాస రామానుజన్. యితడు గణితశాస్త్రంలో జగత్ప్రుసిద్ధుడవుతాడని అల్పాయుష్కుడని, అప్పుడు ఎవ్వరూ కూడా ఊహించలేదు. రామానుజన్ గురించి మరికొన్ని విషయాలు ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.
అవి 18వ శతాబ్దపు చివరి రోజులు. తమిళనాడులోని తంజావూరు జిల్లాలో కుంభకోణం పట్టణంలో శ్రీనివాస అయ్యంగారు ఒక చిన్న బట్టలకొట్టులో గుమాస్తాగా పనిచేస్తుండేవారు. ఈయనకు నెలకు ఇరవై రూపాయలు జీతంగా ఇచ్చేవారు. శ్రీనివాస అయ్యంగారి భార్య పేరు కొమలత్తమ్మాళ్. వచ్చే జీతంతో ఇల్లుగడవటం కష్టంగా ఉండటంవల్ల, ఆమె ఇద్దరు విద్యార్థులకు అన్నం వండిపెట్టి వారివద్ద కొంత డబ్బు వసూలు చేసేది. ఈ విధంగా చేయటం వల్ల వేడినీల్లకు చన్నీళ్ళు తోడైనట్లుగా ఇంకో ఇరవై రూపాయలు అదనపు ఆదాయం వస్తూండేది. 1887 సంవత్సరంలో శ్రీనివాస అయ్యంగార్ దంపతులకు ఒక పుత్రుడు జన్మించాడు. ఇతడే మన నవలా కథానాయకుడు. ఇతని పేరు శ్రీనివాస రామానుజన్. యితడు గణితశాస్త్రంలో జగత్ప్రుసిద్ధుడవుతాడని అల్పాయుష్కుడని, అప్పుడు ఎవ్వరూ కూడా ఊహించలేదు. రామానుజన్ గురించి మరికొన్ని విషయాలు ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.© 2017,www.logili.com All Rights Reserved.