"బాలల సముద్ర శాస్త్రం" - ఈ పుస్తకం నలుగు భాగాలుగా రూపొందడం జరిగింది. బాలలకు ఇది చక్కని కరదీపిక. విద్యార్థులకు విజ్ఞాన దాయిని.
సముద్రాలు భూమి మీద దాదాపు 71% భాగములో ఉన్నాయి. అనాదికాలం నుండి సముద్రాలు మానవుల జీవితాల మీద అత్యంత ప్రభావం చూపిస్తూ వస్తున్నాయి. అందువలన సముద్రాలను గురించి తెలుసుకొనుట మనకందరికీ చాలా అవసరము. సముద్రాలను గురించి అన్ని విషయాలు తెలుపు శాస్త్ర౦ సముద్రశాస్త్రం.
సముద్రాలను గురించి కొన్ని విషయాలు తెలియజేయు ఉద్దేశ్యంతో ఈ బాలల సముద్రశాస్త్రం మొదటి భాగం వ్రాయబడింది. ఇందులోని విషయాలు బాలురు గాక, విద్యార్థులు, పెద్దవారు కూడా తెలుసుకొనవలసినవి చాలా ఉన్నవి. అందరూ సముద్ర శాస్త్రం గురించి సులభంగా తెలుసుకొనుటకు అనేక పటాల ఫోటోలు ఇందులో చేర్చడమైనది.
"బాలల సముద్రశాస్త్రం" మొదటి భాగంలో సముద్రశాస్త్ర చరిత్ర, సముద్రాల ప్రయోజనాలు, మహాసముద్రాలు వాటి సరిహద్దు సముద్రాల గురించి విపులంగా తెలుపబడినది.
"బాలల సముద్రశాస్త్రం" రెండవ భాగంలో మహాసముద్రాల ఉపరితల ప్రవాహాల గురించి, సముద్రాలందరి జీవరాసుల గురించి చాలా వివరంగా తెలుపబడింది.
"బాలల సముద్రశాస్త్రం" మూడవ భాగంలో సముద్రాలు - అందలి వివిధ అలలు (గాలి అలలు, తుఫాను పెద్ద అలలు, సునామీలు, సముద్రపు పోటు - పాట్లు) గురించి, సముద్రశాస్త్ర అధ్యయనానికి ఉపయోగపడే అనేక సాధనాల గురించి వివరించబడింది. ఇది అందరికీ పఠనీయమైన పుస్తకం.
"బాలల సముద్రశాస్త్రం" నాల్గవ భాగంలో సముద్రాలు - అందలి భౌతిక వనరుల నుండి శక్తి ఉత్పాదన, సముద్రాలు - అందలి ఉప్పు నీటి నుండి మంచి నీటి ఉత్పాదన, సముద్రాలు - అందలి మత్స్య ఆహార సంపద సేకరణ, సముద్రాల పరిసర పరిస్థితుల ప్రభావం గురించి వివరించబడింది. శక్తి, ఆహారం, నీరు - ఈ మూడు ప్రధాన కొరతలుగా మిగిలాయి. ఆ ప్రధాన సవాళ్ళ కొరతలను తీర్చుటకు ఎం చేయాలో ఈ పుస్తకంలో తెలుపబడింది.
- డా. యం.పి. మద్దులేటి రెడ్డి
"బాలల సముద్ర శాస్త్రం" - ఈ పుస్తకం నలుగు భాగాలుగా రూపొందడం జరిగింది. బాలలకు ఇది చక్కని కరదీపిక. విద్యార్థులకు విజ్ఞాన దాయిని. సముద్రాలు భూమి మీద దాదాపు 71% భాగములో ఉన్నాయి. అనాదికాలం నుండి సముద్రాలు మానవుల జీవితాల మీద అత్యంత ప్రభావం చూపిస్తూ వస్తున్నాయి. అందువలన సముద్రాలను గురించి తెలుసుకొనుట మనకందరికీ చాలా అవసరము. సముద్రాలను గురించి అన్ని విషయాలు తెలుపు శాస్త్ర౦ సముద్రశాస్త్రం. సముద్రాలను గురించి కొన్ని విషయాలు తెలియజేయు ఉద్దేశ్యంతో ఈ బాలల సముద్రశాస్త్రం మొదటి భాగం వ్రాయబడింది. ఇందులోని విషయాలు బాలురు గాక, విద్యార్థులు, పెద్దవారు కూడా తెలుసుకొనవలసినవి చాలా ఉన్నవి. అందరూ సముద్ర శాస్త్రం గురించి సులభంగా తెలుసుకొనుటకు అనేక పటాల ఫోటోలు ఇందులో చేర్చడమైనది. "బాలల సముద్రశాస్త్రం" మొదటి భాగంలో సముద్రశాస్త్ర చరిత్ర, సముద్రాల ప్రయోజనాలు, మహాసముద్రాలు వాటి సరిహద్దు సముద్రాల గురించి విపులంగా తెలుపబడినది. "బాలల సముద్రశాస్త్రం" రెండవ భాగంలో మహాసముద్రాల ఉపరితల ప్రవాహాల గురించి, సముద్రాలందరి జీవరాసుల గురించి చాలా వివరంగా తెలుపబడింది. "బాలల సముద్రశాస్త్రం" మూడవ భాగంలో సముద్రాలు - అందలి వివిధ అలలు (గాలి అలలు, తుఫాను పెద్ద అలలు, సునామీలు, సముద్రపు పోటు - పాట్లు) గురించి, సముద్రశాస్త్ర అధ్యయనానికి ఉపయోగపడే అనేక సాధనాల గురించి వివరించబడింది. ఇది అందరికీ పఠనీయమైన పుస్తకం. "బాలల సముద్రశాస్త్రం" నాల్గవ భాగంలో సముద్రాలు - అందలి భౌతిక వనరుల నుండి శక్తి ఉత్పాదన, సముద్రాలు - అందలి ఉప్పు నీటి నుండి మంచి నీటి ఉత్పాదన, సముద్రాలు - అందలి మత్స్య ఆహార సంపద సేకరణ, సముద్రాల పరిసర పరిస్థితుల ప్రభావం గురించి వివరించబడింది. శక్తి, ఆహారం, నీరు - ఈ మూడు ప్రధాన కొరతలుగా మిగిలాయి. ఆ ప్రధాన సవాళ్ళ కొరతలను తీర్చుటకు ఎం చేయాలో ఈ పుస్తకంలో తెలుపబడింది. - డా. యం.పి. మద్దులేటి రెడ్డి
© 2017,www.logili.com All Rights Reserved.