సాహసం సేయరా...
"జీజాజీ! మీరింకా బాలరాకుమారుడునే అనుకుంటున్నారా? ఈ వయసులో అది మరదలు ఫ్లయిట్ లెఫ్టినెంట్ డాక్టర్ మిసెస్ భారతి, ఆమెకంతగా తెలుగు రాదు. వాయుసేనాధికారి అయిన తండ్రి వెంట చిన్నతనమంతా కోన కోసల్లో తిరిగిన ఫలితమిది! అదే కారణం వల్ల నోరారా . 'బావా' అనడానికి బదులు హిందీ సంప్రదాయ ప్రభావంతో 'జీజాజీ' అంటుంది. తెలుగు సరిగ్గా రాని పుణ్యమా అని 'బాలాకుమారుడు' కాస్తా 'బాలారాకుమారుడు' అయి కూర్చుంది!
ఆ వేళాకోళపు పోటుకు స్పందించి నా ఆరోగ్య స్థితి గురించీ, హిమాలయాల్లో నేను అప్పటికే చేసిన అనేకానేక పర్యటనానుభవాలు గురించి క్లాసు తీసుకుందామన్న ఆవేశం కలిగింది. అయినా తమాయించుకుని చిరునవ్వుతో సరిపుచ్చా.
కాని మా తోడల్లుడు - ఫ్లయిట్ లెఫ్టినెంట్ ప్రసాద్ వకాల్తా పుచ్చుకున్నాడు.
"తగ్గు... తగ్గు... జీజాజీ అంటే ఏమిటనుకున్నావ్? నలభై ఏళ్ళు నిండినంత మాత్రాన ముసలాళ్ళయిపోయినట్టేనా? ఆ మాటకొస్తే మనందరికన్నా తనే చురుగ్గా కనిపించడంలేదూ? ప్రతీ ఏడాదీ ఆయన చేసే సాహస యాత్రల గురించి తెలిసి కూడా ఎందుకీ సందేహాలు?" భారతిలాగా ప్రసాద్కు కూడా నన్ను 'జీజాజీ' అనడం అలవాటు.
పఠాన్కోట్ ఎయిర్ఫోర్స్ స్టేషన్లో మా భారతి మెడికల్ ఆఫీసరు. ప్రసాద్ విమానాల మెకానికల్ ఇంజనీరు. నేను పనిచేసేది ఢిల్లీ శివార్లలోని ఘజియాబాద్ అన్న ఉపగ్రహ నగరంలో. భారత్ ఎలక్ట్రానిక్స్ అనే ప్రభుత్వరంగ సంస్థలో 1993 మార్చి నెలలో మేము ఢిల్లీకి ఉత్తరాన జమ్మూ సమీపంలో ఉన్న వైష్ణోదేవి మందిరానికి వెళ్ళివస్తూ దారిలో పరాన్కోట్లో ఆగాం. మమ్మల్ని పలకరించడానికి అక్కడి మిత్ర బృందం ప్రసాద్ వాళ్ళింట్లో పోగుపడింది.
ఈ బృందంలోని బలరామ్ అన్న బాపట్ల యువకుడూ, త్రినాథ్ బాబు అన్న ఒంగోలబ్బాయీ 1992 ఆగస్టు నెలలో తమ స్కూటరు మీద పఠాన్కోట్కు నాలుగు వందల కిలోమీటర్ల దూరాన, సముద్రతలానికి పధ్నాలుగు వేల అడుగుల ఎత్తున ఉన్న 'రోహతాంగ్ పాస్' అనే హిమాలయ పర్వతపంక్తులలోని కనుమకు చేసిన సాహసయాత్ర గురించి చెపుతుంటే అంతా వింటున్నాం. అలాంటి యాత్రలలో.................
సాహసం సేయరా... "జీజాజీ! మీరింకా బాలరాకుమారుడునే అనుకుంటున్నారా? ఈ వయసులో అది మరదలు ఫ్లయిట్ లెఫ్టినెంట్ డాక్టర్ మిసెస్ భారతి, ఆమెకంతగా తెలుగు రాదు. వాయుసేనాధికారి అయిన తండ్రి వెంట చిన్నతనమంతా కోన కోసల్లో తిరిగిన ఫలితమిది! అదే కారణం వల్ల నోరారా . 'బావా' అనడానికి బదులు హిందీ సంప్రదాయ ప్రభావంతో 'జీజాజీ' అంటుంది. తెలుగు సరిగ్గా రాని పుణ్యమా అని 'బాలాకుమారుడు' కాస్తా 'బాలారాకుమారుడు' అయి కూర్చుంది! ఆ వేళాకోళపు పోటుకు స్పందించి నా ఆరోగ్య స్థితి గురించీ, హిమాలయాల్లో నేను అప్పటికే చేసిన అనేకానేక పర్యటనానుభవాలు గురించి క్లాసు తీసుకుందామన్న ఆవేశం కలిగింది. అయినా తమాయించుకుని చిరునవ్వుతో సరిపుచ్చా. కాని మా తోడల్లుడు - ఫ్లయిట్ లెఫ్టినెంట్ ప్రసాద్ వకాల్తా పుచ్చుకున్నాడు. "తగ్గు... తగ్గు... జీజాజీ అంటే ఏమిటనుకున్నావ్? నలభై ఏళ్ళు నిండినంత మాత్రాన ముసలాళ్ళయిపోయినట్టేనా? ఆ మాటకొస్తే మనందరికన్నా తనే చురుగ్గా కనిపించడంలేదూ? ప్రతీ ఏడాదీ ఆయన చేసే సాహస యాత్రల గురించి తెలిసి కూడా ఎందుకీ సందేహాలు?" భారతిలాగా ప్రసాద్కు కూడా నన్ను 'జీజాజీ' అనడం అలవాటు. పఠాన్కోట్ ఎయిర్ఫోర్స్ స్టేషన్లో మా భారతి మెడికల్ ఆఫీసరు. ప్రసాద్ విమానాల మెకానికల్ ఇంజనీరు. నేను పనిచేసేది ఢిల్లీ శివార్లలోని ఘజియాబాద్ అన్న ఉపగ్రహ నగరంలో. భారత్ ఎలక్ట్రానిక్స్ అనే ప్రభుత్వరంగ సంస్థలో 1993 మార్చి నెలలో మేము ఢిల్లీకి ఉత్తరాన జమ్మూ సమీపంలో ఉన్న వైష్ణోదేవి మందిరానికి వెళ్ళివస్తూ దారిలో పరాన్కోట్లో ఆగాం. మమ్మల్ని పలకరించడానికి అక్కడి మిత్ర బృందం ప్రసాద్ వాళ్ళింట్లో పోగుపడింది. ఈ బృందంలోని బలరామ్ అన్న బాపట్ల యువకుడూ, త్రినాథ్ బాబు అన్న ఒంగోలబ్బాయీ 1992 ఆగస్టు నెలలో తమ స్కూటరు మీద పఠాన్కోట్కు నాలుగు వందల కిలోమీటర్ల దూరాన, సముద్రతలానికి పధ్నాలుగు వేల అడుగుల ఎత్తున ఉన్న 'రోహతాంగ్ పాస్' అనే హిమాలయ పర్వతపంక్తులలోని కనుమకు చేసిన సాహసయాత్ర గురించి చెపుతుంటే అంతా వింటున్నాం. అలాంటి యాత్రలలో.................© 2017,www.logili.com All Rights Reserved.