జ్ఞానులు ఒకే స్థలంలో ఉండక జ్ఞాన సముపార్జనకోసం నిరంతరం సంచరిస్తూ ఉండాలి. లోక సంచారి కాని వాడు జ్ఞాని కాలేడు. జ్ఞాని అనేవాడు లోక సంచారి కాకతప్పదు.
ఆదిభిక్షువు శివుడు జంగమ దేవరగా ఈ స్థావర జంగమాత్మక ప్రప్రంచంలో నిరంతరం సంచరించిన వాడే. సిద్ధార్ధుడు బుద్ధుడిగా పరివర్తన చెంది, పరివ్రాజికుడిగా పర్యటించిన వాడే. ఆది శంకరుడు మొదలుకొని వివేకానందుడి దాకా ఎందరెందరో సాధవులు, సన్యాసులు, సంత్ లు, సూఫీ ఫకీర్లు ఆసేతు హిమాచలం సంచరించిన వారే. మహమ్మద్ ప్రవక్త, జీసస్ కూడా ఆ కోవకు చెందినవారే.
సంచరించటం ఆసియా దేశవాసుల పురాతన సంప్రదాయం. అతి ప్రాచీన సంస్కృతి.
పూర్వకాలంలో "దేశాటనం" విద్యాభ్యాసం చివరలో ఒక ముఖ్యమైన భాగం.
నేనొక సాహసయాత్ర చేయాలని, అది వినూతనంగా, విభిన్నంగా వుండాలని దృఢనిశ్చయం తీసుకున్నాను.
సాహసం సమక్షంలో మృత్యువు ఒక లెక్కకాదు అన్న దేశదిమ్మరి కళాతపస్వి సంజీవ్ దేవ్ మాటల్ని పదే పదే మననం చేసుకున్నాను. యద్భావం తత్భవతి. ఫలితమే స్కూటర్ పై ఛత్తీస్ ఘడ్ సాహసయాత్ర.
పది రోజులలో 1943 కీ.మీ.లు పర్యటించిన యాత్ర కధనం.
- పరవస్తు లోకేశ్వర్
జ్ఞానులు ఒకే స్థలంలో ఉండక జ్ఞాన సముపార్జనకోసం నిరంతరం సంచరిస్తూ ఉండాలి. లోక సంచారి కాని వాడు జ్ఞాని కాలేడు. జ్ఞాని అనేవాడు లోక సంచారి కాకతప్పదు. ఆదిభిక్షువు శివుడు జంగమ దేవరగా ఈ స్థావర జంగమాత్మక ప్రప్రంచంలో నిరంతరం సంచరించిన వాడే. సిద్ధార్ధుడు బుద్ధుడిగా పరివర్తన చెంది, పరివ్రాజికుడిగా పర్యటించిన వాడే. ఆది శంకరుడు మొదలుకొని వివేకానందుడి దాకా ఎందరెందరో సాధవులు, సన్యాసులు, సంత్ లు, సూఫీ ఫకీర్లు ఆసేతు హిమాచలం సంచరించిన వారే. మహమ్మద్ ప్రవక్త, జీసస్ కూడా ఆ కోవకు చెందినవారే. సంచరించటం ఆసియా దేశవాసుల పురాతన సంప్రదాయం. అతి ప్రాచీన సంస్కృతి. పూర్వకాలంలో "దేశాటనం" విద్యాభ్యాసం చివరలో ఒక ముఖ్యమైన భాగం. నేనొక సాహసయాత్ర చేయాలని, అది వినూతనంగా, విభిన్నంగా వుండాలని దృఢనిశ్చయం తీసుకున్నాను. సాహసం సమక్షంలో మృత్యువు ఒక లెక్కకాదు అన్న దేశదిమ్మరి కళాతపస్వి సంజీవ్ దేవ్ మాటల్ని పదే పదే మననం చేసుకున్నాను. యద్భావం తత్భవతి. ఫలితమే స్కూటర్ పై ఛత్తీస్ ఘడ్ సాహసయాత్ర. పది రోజులలో 1943 కీ.మీ.లు పర్యటించిన యాత్ర కధనం. - పరవస్తు లోకేశ్వర్© 2017,www.logili.com All Rights Reserved.