ప్రతివాడు సాధించాల్సినవి ధర్మార్ధ కామమొక్షాలను నాలుగు పురుషార్ధాలు ఇందు 'మోక్షం' అనేది ప్రతి ప్రాణికి గమ్యం. మోక్షం అన్నా ముక్తి అన్నా ఒక్కటే. ముక్తి అన్నా, మోక్షం అన్నా విడిచి పెట్టడం అన్నది అర్థం. జన్మ మరణాల పరిభ్రమణం కల్గించే కర్మవాసనల్ని విడిచి పెట్టడమే ముక్తి. జన్మ అంటూ వుంటే దుఃఖానుభవం ఎంతవారికి తప్పదు కాన జన్మరాహిత్యంతో జీవన్ముక్తి పొంది ఆపైని అఖండానందరూపుడైన పరమాత్మతో సాయుజ్యం పొందాలి. దానికి సోపాన మార్గమే ఈ ముక్తికి మెట్లు.
జీవన్ముక్తికి ఆచార్య శంకర భగవత్పాదులు వారు
సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం నిశ్చల తత్వే జీవన్ముక్తి
అని సత్సంగంతో నిస్సంగం సిద్ధిస్తుందనీ.
ఆ నిస్సంగత్వం వల్ల నిర్మోహత్వం, అంటే అజ్ఞాన నాశనం కల్గుతుందనీ ఆ అజ్ఞాన నాశనం వల్ల నిశ్చలుడైన పరమాత్మ యొక్క తత్త్వం తెలుస్తుందనీ, ఆ నిశ్చలతత్త్వం జ్ఞానంతో జీవన్ముక్తి కల్గుతుందనీ అంటే జీవించియుండగానే కర్మవాసనలు నశిస్తాయని వివరించారు.
ప్రతివాడు సాధించాల్సినవి ధర్మార్ధ కామమొక్షాలను నాలుగు పురుషార్ధాలు ఇందు 'మోక్షం' అనేది ప్రతి ప్రాణికి గమ్యం. మోక్షం అన్నా ముక్తి అన్నా ఒక్కటే. ముక్తి అన్నా, మోక్షం అన్నా విడిచి పెట్టడం అన్నది అర్థం. జన్మ మరణాల పరిభ్రమణం కల్గించే కర్మవాసనల్ని విడిచి పెట్టడమే ముక్తి. జన్మ అంటూ వుంటే దుఃఖానుభవం ఎంతవారికి తప్పదు కాన జన్మరాహిత్యంతో జీవన్ముక్తి పొంది ఆపైని అఖండానందరూపుడైన పరమాత్మతో సాయుజ్యం పొందాలి. దానికి సోపాన మార్గమే ఈ ముక్తికి మెట్లు. జీవన్ముక్తికి ఆచార్య శంకర భగవత్పాదులు వారు సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్త్వం నిశ్చల తత్వే జీవన్ముక్తి అని సత్సంగంతో నిస్సంగం సిద్ధిస్తుందనీ. ఆ నిస్సంగత్వం వల్ల నిర్మోహత్వం, అంటే అజ్ఞాన నాశనం కల్గుతుందనీ ఆ అజ్ఞాన నాశనం వల్ల నిశ్చలుడైన పరమాత్మ యొక్క తత్త్వం తెలుస్తుందనీ, ఆ నిశ్చలతత్త్వం జ్ఞానంతో జీవన్ముక్తి కల్గుతుందనీ అంటే జీవించియుండగానే కర్మవాసనలు నశిస్తాయని వివరించారు.© 2017,www.logili.com All Rights Reserved.